గార్జియస్ శ్రీదేవి 2017 మరియు 2018లో క్యారీ చేసిన బెస్ట్ లుక్స్

Posted By:
Subscribe to Boldsky
Remembering The Gorgeous Sridevi, Best Looks She Carried In 2017-2018

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి ఓ వివాహ వేడుకలో గుండెపోటులో అర్థరాత్రి మృతిచెందిన విషయం ఈ పాటికే మీకందరికి తెలిసిన విషయమే. శ్రీదేవి అందానికి ఫిదా అయిన ఆమె అభిమానులుగా మారినవారు ఎందరో ఉన్నారు.

బాలీవుడ్ లో ఈమెను ఒక ఫ్యాషన్ ఐకాన్ గా చూస్తారు. అనేక ఫ్యాషన్ షోలలో అప్పుడప్పుడు కనబడుతూ అందరీని ఆశ్చర్యపరుస్తుంటారు. వయస్సు పైబడ్డా, ఆ ఛాయలేవీ బయటకు కనబడని అందచందాలు కలిగిన అతిలోక సుందరి శ్రీదేవి. ఈ బాలీవుడ్ ఫ్యాషనిస్ట్ తన స్టైల్ స్టేట్మెంట్ తో 80s నుండి సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.

అలాంటి శ్రీదేవి గత రాత్రి గుండె పోటుతో అకస్మికంగా మరణించడంతో దేశంలోని ఆనాటి, మేటి ఆమె ఫ్యాన్స్ ను ఉలిక్కిపడేలా చేసింది. శ్రీదేవి చివరిగా దుబాయ్ లో జరిగిన బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ వివాహ వేడుకలో సందడి చేశారు. చిన్న కూతురు ఖుషితో కలిసి ఆమె సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే బోనీ కపూర్‌తో కలిసి నూతన వధూవరులతోనూ ఫోటో దిగారు.

శ్రీదేవి ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుక ముగించుకొని తిరిగి వద్దామనుకునే సమయానికి అతిలోక సుందరి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆమె అందానికి ఐకాన్ అని తెలిపే ఫోటోలే ఆమె చివరి జ్ఞాపకాలుగా మిగిలాయి. అవి మీరు ఇక్కడ చూడవచ్చు...

Remembering The Gorgeous Sridevi, Best Looks She Carried In 2017-2018
Remembering The Gorgeous Sridevi, Best Looks She Carried In 2017-2018
Remembering The Gorgeous Sridevi, Best Looks She Carried In 2017-2018
Remembering The Gorgeous Sridevi, Best Looks She Carried In 2017-2018
Remembering The Gorgeous Sridevi, Best Looks She Carried In 2017-2018
English summary

Remembering The Gorgeous Sridevi, Best Looks She Carried In 2017-2018

The beautiful and talented Sridevi passed away a few hours back in Dubai due to a massive cardiac arrest. The country is surely going to miss the ultimate Bollywood fashionista who has been rocking the industry with her style statements since the 80s.