For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కేన్స్ 2018:దైనందిన దుస్తుల లొనే కేన్స్ కు తన గ్లామరుతో వేడెక్కించిన మహీరా

  |

  కేన్స్ చలనచిత్ర వేడుకకు మొట్టమొదటి సారిగా పాకిస్థాన్ నుండి ఆహ్వానింపబడిన తార, మహీరా ఖాన్ తన ఫోటో షూట్లతో అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. పకడ్బందీగా సంసిద్ధమై కేన్స్ లో అడుగుపెట్టిన ఈ భామ ఫోటోలు, అంతర్జాలంలో తుఫాను సృష్టిస్తున్నాయి.

  ఈమె రెడ్ కార్పెట్ పై తారలందరూ ధరించే మాదిరి దుస్తులను కాక, వైవిథ్యంగా గ్లామర్ ను వెదజల్లే జంప్ సూట్స్, హై-వెయిస్ట్ ట్రౌసర్స్ వంటి దైనందిన దుస్తులను ధరించి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈమె తన వైవిధ్యతతో తన సహచర నటీమణులైన కంగనా, దీపికా, హుమా ఖురేషీలకు ధీటుగా నిలిచింది.

  Cannes 2018: Mahira Khan Ups The Glam Quotient In Everyday Wear

  ఈ "రాయీస్" తారను చూస్తుంటే, మనకు కూడా వెంటనే షాపింగ్ చేసి అటువంటి ట్రెండీ దుస్తులను కొనుగోలు చేయాలనే బుద్ధి పుడుతుంది. ఆమె ధరించిన దుస్తులు డిజైన్ చేయబడిన విధానం మనల్ని అచ్చెరువొందిస్తుంది.. ఆమె కేన్స్ 2018లో రెండవ రోజు ధరించిన దుస్తులలో వీక్షకుల మదిని దోచిన మూడింటి గురించి ఇప్పుడు విపులంగా సమీక్షిద్దాం.

  Cannes 2018: Mahira Khan Ups The Glam Quotient In Everyday Wear

  1. అబ్బురపరిచే జంప్ సూట్: ముఖంలో కుతూహలాన్ని వ్యక్తీకరిస్తూ, మహీరా కుర్చీపై అలవోకగా కూర్చున్న తీరు చూస్తే, నిశ్శబ్దంతో నిండివున్న ప్రదేశం కూడా సందడిగా మారుతుంది. మహీరా ధరించిన, లెనార్డో పారిస్ డిజైన్ చెందిన ఉత్సాహపూరితమైన జంప్ సూట్, దానికి జతగా ప్రకృతి అందాల నుండి స్ఫూర్తి పొందిన సున్నితమైన చెవి కమ్మలు లెక్కలేనన్ని భావాలను అభిమానుల గుండెలపై ఎక్కుపెట్టాయి. ఆమె ధరించిన ఏనుగు దంతం రంగు జంప్ సూట్ పై ఊదా,నీలం, ఆకు పచ్చ మరియు నారింజ రంగు పూవుల ప్రింట్ మరియు పరచుకున్న కాలర్ తో ఆమె రూపం అపురూపంగా తోచింది. తెల్లని దుస్తులకు కాంట్రాస్ట్ గా ధరించిన బ్రౌన్ హీల్స్ చైతన్యాన్ని అద్దాయి.

  Cannes 2018: Mahira Khan Ups The Glam Quotient In Everyday Wear

  2. ప్రకంపనలు పుట్టించిన కానరీ ఎల్లో టాప్: మహీరాకు గాఢమైన రంగులలో కూడా తన అందాన్ని సమర్ధవంతంగా ప్రదర్శించడం తనకు వెన్నతో పెట్టిన విద్య. నలుగురి దారిలో ఆడంబరమైన గౌనులు ధరించకుండా నేవీ బ్లూ హై వెయిస్ట్ ట్రౌసర్స్ కి జతగా లేత పసుపు టాప్ ధరించింది. ఒక వైపు మాత్రమే ఉన్న అలల ఎగసి పొడుగాటి స్లీవ్ సొగసును కొత్త అర్ధం చెప్పింది. ఆమె పాదాలకు ధరించిన క్రిస్టియన్ లౌబౌటిన్ బ్లాక్ పంప్స్ మరియు చెవులకు అలంకరించుకున్న బంగారు లోలాకులు ఆమె రూపురేఖలను మార్చేసాయి. మీగడ తెలుపు రంగు బెల్ట్ దుస్తులకు హుందాతనాన్ని చేకూర్చింది. కురులను గాలికి అలల వలె ఎగరడానికి వీలుగా విరబోసుకుంది.

  Cannes 2018: Mahira Khan Ups The Glam Quotient In Everyday Wear

  3. ఆహ్లాదాన్ని తెచ్చిపెట్టిన దుపట్టా: ఈలాన్ దుస్తులతో మహీరా తాజా పిల్లతెమ్మెరలా ఆహ్లాదపరచింది. సాగర తీరాన, నీలి నురుగుల అలల వెంట తెల్లని హాల్టర్ నెక్ ఉన్న టాప్ మరియు పలాజో ప్యాంట్స్ ధరించిన మహీరా, సముద్రాన్నే ఘనీభవింప చేస్తుందేమో అనేంత అందంగా ఉంది. తన భుజం పై వేసుకున్న రాయల్ బ్లూ రంగు పూల ఎంబ్రాయిడరీ కలిగిన దుపట్టా ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసిందని చెప్పవచ్చు. అందమైన జూకాలు, నున్నగా దువ్వి పెట్టుకున్న ముడి, ఆమె వేషధారణకు సరిగ్గా అమరాయి.

  నిరాడంబరంగా ఉన్న దుస్తులు ధరించినప్పటికి, మహీరా సొగసు అందరిని ఆకట్టుకోవడంలో ముందంజలో ఉంది. ఆమె ఫ్రెంచ్ రివేరాకు వన్నె తెచ్చిందని అందరూ ముక్తకంఠంతో చెప్పుకుంటున్నారు. తనను తాను మలచుకుంటున్న ఒక ఫ్యాషనిస్తాగా ఆమెను అభివర్ణించవచ్చు. మహీరా ఫోటోషూట్ల గురించి మీ అభిప్రాయమేంటో మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఉండనే ఉందిగా!

  English summary

  Cannes 2018: Mahira Khan Ups The Glam Quotient In Everyday Wear

  The first Pakistani actress to be invited for the Festival De Cannes, Mahira Khan has surprised us all with her stunning photoshoots. She is ditching the usual dresses and instead seen glamorising everyday wears such as jumpsuits, high-waist trousers, and separates like a pro. Here are her three outstanding photoshoots!
  Story first published: Thursday, May 17, 2018, 18:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more