దిషా పటాని లేటెస్ట్ లుక్ చుస్తే ప్రతి అమ్మాయి ఇలానే ఉండాలని కలలు కంటుంది

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky
Disha Patanis Latest Look Is Every Girls Dream,

కేవలం అందంతో మాత్రమే గనుక ఉంటే ఇంస్టాగ్రామ్ లో 9.8 మిల్లియన్ ఫాలోయర్స్ ని సంపాదించుకోవడం సాధ్యమవుతుందా ? మరో ఆలోచనే లేకుండా దీనికి సమాధానం అలా ఎప్పటికి జరగదు.

దిషా పటాని చాలా అందంగా ఉంది కాబట్టే ఆమె ఇంస్టాగ్రామ్ స్టార్ అయిపొయింది అని అనుకుంటూ ఉండవచ్చు చాలామంది. కానీ, ఆలా ఆలోచించే వ్యక్తులు మరో కోణాన్ని చూడటంలో పూర్తిగా విఫలం అయ్యారు.

కేవలం, రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, మంచి కారణాల వల్లనే, సామజిక మాధ్యమాల్లో స్టార్ గా ఎదిగిపోయింది. బాలీవుడ్ లో ఎంతోమంది యువ కథానాయకులు, అందమైన కథానాయకులు చాలా తక్కువ సమయంలో పాపులారిటీ సంపాదించుకొని ఉండవచ్చు. కానీ, ఆ విషయాన్ని అందరూ గ్రహించే లోపే కనుమరుగైపోతూ ఉంటారు. ఇలాంటి వారందరితో పోల్చి చుస్తే దిషా వ్యవహారం చాలా విభిన్నం.

దిషా పటానికి ఒక విభిన్నమైన ఫ్యాషన్ అభిరుచి ఉంది. చూపు తిప్పుకోనివ్వని తో పాటు, ఎంతో సాహసం గల వైఖరిని ప్రదరిస్తుంది. ఏ దుస్తులు ధరించినా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, అద్భుతమైన నాట్య నైపుణ్యం ఉంది, ఆధునిక జీవన శైలికి సంప్రదాయానికి మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తుంది.

ఫ్యాషన్ విషయంలో చాలా అరుదుగా మాత్రమే ఆమె తప్పు చేస్తుంది. ఆమె ఇంస్టాగ్రామ్ పేజీ ఒకసారి గనుక చూసినట్లైతే, మీరు మరో లోకానికి వెళ్తారు. ఎదుగుతున్న, ఉద్భవిస్తున్న ఒక కొత్త ఫ్యాషన్ ఐకాన్ ఈమె అని మీరు ఖచ్చితంగా నమ్ముతారు.

ప్రస్తుతం ఈమె బాయ్ ఫ్రెండ్ అని పుకార్ల ద్వారా భావించబడుతున్న టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన " భాగీ 2 " చిత్ర ప్రమోషన్ లో తీరిక లేకుండా గడుపుతోంది.

ఆమె యుక్తవయస్సులో ఉన్నవారికి ఫ్యాషన్ విషయంలో ఒక బెంచ్ మార్క్ ని నిర్దేశించే విధంగా తన అందాన్ని వైవిధ్యంగా ప్రదర్శిస్తుంది.

ఈమధ్యనే ఈమె ఇంస్టాగ్రామ్ లో క చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆ చిత్రానికి 1.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇంస్టాగ్రామ్ ని ఈ చిత్రం ఒక ఊపుఊపిందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాల్లో బాంబర్ జాకెట్ ని ధరించి, నల్లటి ట్యాంక్ టాప్ ని వేసుకొని, మతిపోగోట్టే డెనిమ్ ప్యాంటు వేసుకొని తన అందాలను ఆరబోస్తూ మరో కోణాన్ని ఆవిష్కరించింది. వీటికితోడు గుడ్డు ఆకారంలో ఉండే కళ్ళద్దాలను ధరించి, ముడివేయబడ్డ ఒక చిన్న టాప్ తో పాటు తెల్లటి స్నికర్లను ధరించి ఆశ్చర్యపరచింది.

ఈ తాజా చిత్రంలో తన అందంతో అందరిని అబ్బురపరిచింది. అదే సమయంలో ఎక్కడగాని హద్దు మీర లేదు. అందానికి ప్రతిరూపంగా ఉండే శరీరం, మత్తెక్కించే నవ్వు ఇలా ఎన్నో విషయాలు ఆమెని విపరీతంగా ఇష్టపడేలా చేస్తున్నాయి. ఆమె ఇంస్టాగ్రామ్ చిత్రాలను గనుక చూసినట్లైతే, అతి త్వరలో భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో సోనమ్ కపూర్ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Disha Patanis Latest Look Is Every Girls Dream,
Disha Patanis Latest Look Is Every Girls Dream,
Disha Patanis Latest Look Is Every Girls Dream,

English summary

Disha Patani's Latest Look Is Every Girl's Dream

Her recent look which she shared on Instagram a day ago, has already got 1.1 million likes and like any of her pics, is driving Instagrammers crazy! In the pics, she is seen flaunting her sporty side in a bomber jacket, black tank top, distressed denim hot pants and she completed the look with an oval-rectangular pair of sunglasses, a messy top knot and white sneakers.
Story first published: Friday, March 23, 2018, 16:00 [IST]