Latest Updates
-
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా..
డోన్ట్ మిస్! : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమన్న దీపికా పదుకొనే..
ప్రతిష్ఠాత్మక 70వ కేన్స్ చలన చిత్రోత్సవ సందడి మొదలైంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమంది. మొదటి రోజు జరిగిన రెడ్‌కార్పెట్‌పై ఆమె మెరిసిపోయింది. పర్పుల్ క
ప్రతిష్ఠాత్మక 70వ కేన్స్ చలన చిత్రోత్సవ సందడి మొదలైంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమంది. మొదటి రోజు జరిగిన రెడ్‌కార్పెట్‌పై ఆమె మెరిసిపోయింది. పర్పుల్ కలర్ డ్రెస్సులో దీపికా ధగధగలాడింది.

'దే గ్రిసోగొనో' జ్యువెలరీ స్టూడియెస్ డిజైన్ చేసిన చెవిరింగులు, ఉంగరం, కళ్లకు నీలిరంగు మేకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

లోరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా కేన్స్‌లో కనిపించింది. రెడ్ కార్పెట్ కోసం మార్చెసా గౌన్‌ను ధరించింది ఆ బ్యూటీ. వేలికి భారీ రింగ్ ధరించిన ఆమె స్టయిలిష్‌గా ఆకట్టుకున్నది.

జిమ్మీ చో కంపెనీ హై హీల్స్ వేసుకున్నది బాలీవుడ్ స్టార్. 2017 కేన్స్ ఉత్సవంలో తొలిరోజు ర్యాంప్ వాక్ చేసిన తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. అంతేకాదు దీపిక కేన్స్‌లో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి.

కే న్స్ లో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్యతో కలిసి బయలుదేరారు. ఈ ఉత్సవంలో ఐష్ 2002లో నటించిన 'దేవ్‌దాస్'సినిమాని ప్రదర్శించబోతున్నారు.

ఐష్ 15 ఏళ్లుగా కేన్స్ ఉత్సవాలకు హాజరవుతున్నారు. ఐశ్వర్యతో పాటు సోనమ్ కపూర్ కూడా పాల్గొనబోతున్నారు.

వీరిద్దరూ ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ లోరియల్ పారిస్‌కి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ హాట్ భామ మల్లికా శెరావత్ కూడా కేన్స్‌లో పాల్గొనబోతోంది.

ప్రముఖ డిజైనర్ జార్జెస్ హొబికా రూపొందించిన దుస్తుల్లో ర్యాంప్‌పై మెరిసిపోనుంది.

ఈ అంతర్జాతీయ వేడుకకి తొలిసారి దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి శ్రుతిహాసన్ పాల్గొనబోతోంది. ఆమె నటిస్తున్న తమిళ చిత్రం 'సంఘమిత్ర' ఫస్ట్‌లుక్‌ను కేన్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ నెల 28 వరకు కేన్స్ వేడుకలు జరగనున్నాయి.







Click it and Unblock the Notifications
