Just In
- 39 min ago
పడకగదిలో ధైర్యంగా కార్యం కొనసాగించేందుకు ఈ చిట్కాలు పాటించండి...
- 44 min ago
Happy Maha Shivratri 2021:శివుని అనుగ్రహం పొందేలా మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి విషెస్ చెప్పేయండి...
- 3 hrs ago
ఈ 8 సులభమైన మార్గాలను అనుసరించండి మరియు మీరు చాలా త్వరగా బరువు కోల్పోతారు ...!
- 5 hrs ago
ఆయుర్వేదం ప్రకారం, ఈ ఆహారాలను ఈ ఆహారాలతో పాటు తినకూడదు ...తింటే ప్రమాదకరం ...!
Don't Miss
- Movies
మరో స్టార్ హీరోపై ఫోకస్ పెట్టిన సుకుమార్..?
- News
హెరిటేజ్ కేసు... మంత్రి కన్నబాబు,ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు నాన్బెయిలబుల్ వారెంట్...
- Finance
గోల్డ్మన్ శాక్స్ ఎఫెక్ట్, మళ్లీ బిట్ కాయిన్ జంప్: 25 శాతం కరెక్షన్!
- Sports
India vs England: సిక్సర్తో రిషభ్ పంత్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- Automobiles
భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యాషన్ ఫ్యాక్టర్ లో బంగారు బొమ్మలా మారిపోయిన సోనమ్ కపూర్...
బాలీవుడ్ లో జోయా ది ఫ్యాక్టర్ సినిమా చూసిన వారికి సోనమ్ కపూర్ అంటే ఏంటో బాగానే గుర్తుంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఈ బాలీవుడ్ అందాల భామను ఏకంగా క్రికెట్ దేవతను చేసేస్తారు. ఈమె అందం వల్లే.. ఈమె అడుగు పెట్టడం వల్లే భారత్ అన్ని మ్యాచులు గెలుస్తుందని అభిమానులందరూ నమ్ముతారు.
అంతలా పాపులారిటీ సంపాదించిన ఈ బాలీవుడ్ భామ ఎలాంటి సినిమాలకైనా ప్రమోషన్స్ వేదికగా తన ఫ్యాషన్ సెన్స్ ను చక్కగా చాటుకుంటోంది. తాజాగా బంగారు లెహంగాను ధరించి బంగారు బొమ్మలా మారిపోయిన వైనాన్ని చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. లక్మే ఫ్యాషన్ 2020లో ఎంతమంది తారలు తళుక్కుమన్నా.. ఈ భామ స్టైలే వేరు. పొడుగు కాళ్ల సుందరి అయిన ఈ భామ ఫ్యాషన్ డ్రెస్సులపై ఓ లుక్కేయండి...
బుట్ట బొమ్మ ఫ్యాషన్ లుక్స్ చూస్తే అమ్మో అనాల్సిందే...!

స్టైలిష్ సోనమ్ ప్రత్యేకత...
ఎలాంటి డ్రెస్సులను అయినా స్టైలిష్ గా ప్రదర్శించడంలో సోనమ్ కపూర్ ను మించిన వారు ఎవ్వరు లేరని చెప్పొచ్చు. రకరకాల లెహంగాలు.. శారీ ట్రెండ్స్ లో ఈ అమ్మడు అనేక సార్లు మెరిసిపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆమె ధరించిన బంగారు రంగు గల లెహంగాకు ఓ ప్రత్యేకత ఉంది.

పుత్తడి బొమ్మలా..
ఈ గోల్డెన్ లెహంగా డ్రెస్ లో ఈ పొడుగు కాళ్ల సుందరి అచ్చం పుత్తడి బొమ్మలా కనిపించింది. ఆ డ్రస్సుకు తగ్గట్టు వెండి ఆభరణాలు ధరించింది. అలాగే అద్భుతమైన మేకప్ తో తన లుక్స్ ను పూర్తి చేసింది. ఇలా అందంగా మెరిసిపోయిన ఈ భామ తన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది.

అమ్మాయిలకిష్టమైన డిజైన్స్..
చాలా మంది అమ్మాయిలకు ఇష్టమైన ఫ్యాషన్స్ ఫ్లోరల్ డిజైన్స్ లో లెహంగా కూడా ఒక్కటి. అందుకే ఎన్ని ట్రెండ్స్ వచ్చినా వీటికి ఉండే ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పొడుగు కాళ్ల సుందరాంగులకు ఇవి చాలా చక్కగా నప్పుతాయి. అందుకే వీటికి ఎప్పటికీ ఆదరణ తగ్గదు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియాలంటే సోమన్ ధరించిన ఈ అవుట్ ఫిట్స్ ను చూడండి. మీకే తెలుస్తుంది.
గ్రామీ అవార్డ్స్ 2020 : హాట్ హాట్ ఫోజులతో అదరగొట్టిన ప్రియాంక చోప్రా, జోనస్ జోడి...

ఫ్యాషన్ నైపుణ్యం..
బాలీవుడ్ లో ఎంతమంది అందమైన భామలు ఉన్నా.. ఎంత మంది ఫ్యాషన్ ను ఫాలో అయినా.. ఈ అందాల భామ ఫాలో అయినంత ఫ్యాషన్ ను ఎవ్వరు ట్రై చెయ్యలేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమెకు ఫ్యాషన్ లో నైపుణ్యం చాలా ఎక్కువ. ఈ విషయం లక్మే ఫ్యాషన్ 2020 ద్వారా మరోసారి నిరూపితమైంది. ఇక తన బ్రాస్ లైట్, మెడలోని నెక్లేస్ కూడా తన డ్రస్ కు మ్యాచ్ అయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకుంది.

మంచి లుక్ కావాలంటే..
చాలా మంది అమ్మాయిలు మేకప్ అంటే పడి చచ్చిపోతుంటారు. అయితే ఎవ్వరికీ ఏ షెడ్ నప్పుతుందో దానిని ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. మేకప్ కూడా దానికి అనుగుణంగా ఎంచుకోవాలి. అప్పుడే అమ్మాయిలకు మంచి లుక్ వస్తుంది. ఈ విషయంలో సోనమ్ అందరికంటే ముందంజలో నిలిచింది. తను వేసుకున్న గోల్డ్ లెహంగా డ్రెస్ తన లుక్ ని మరింత అందంగా కనిపించేలా చేసింది.