ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017 వేడుకకు అదనపు సొగసులద్దిన 10 బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీస్ వీరే

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

సినీప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2017 వేడుక ముంబైలో వారాంతంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన సెలెబ్రిటీలు వారి స్టైలిష్ లుక్స్ తో ఈ వేడుకకు హైలైట్ గా నిలిచారు.

వైభవంగా జరిగిన ఈ వేడుకలో తారలు తమ స్టైలిష్ లుక్స్ తో సినీప్రేమికుల మనసును దోచారు. ఈ వేడుకలో స్టన్నింగ్ లుక్స్ లో హల్చల్ చేసిన తారల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం....

1. మానుషీ చిల్లర్

1. మానుషీ చిల్లర్

లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ మానుషీ చిల్లర్ ఈ వేడుకలో తనదైన స్టైల్ లో హల్చల్ చేసింది. మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని చేపట్టిన ఈ అందాలతార అద్భుతమైన స్టైల్ లో ఈ వేడుకకు హాజరై కెమెరాల అటెన్షన్ ను అందుకుంది. మానుషీ చిల్లర్ హాజరైన మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక ఇదే అవడం గమనించదగ్గ విషయం. ఫల్గుణి అండ్ షేన్ పీకాక్ వారి స్ఫగెటీ స్లీవ్డ్ సెక్విన్ గౌన్ లో రెడ్ కార్పెట్ పై ఈ బ్యూటీ తళుక్కుమంది.

తన అవుట్ ఫిట్స్ తో మాత్రమే కాదు అందుకు తగిన యాక్సెసరీన్ ను ధరించి మానుషి స్టైల్ ఐకాన్ గా మారిందనడంలో సందేహం లేదు.

ఆమ్రపాలి ఇయర్ రింగ్స్, జిమ్మీ చూ క్లచ్ అండ్ షూస్ తో పాటు మిస్ వరల్డ్ కిరీటాన్ని అలాగే సాచెట్ ని ధరించి వేడుకకు మరింత అందాన్ని తీసుకొచ్చింది ఈ విశ్వసుందరి.

2. కరీనా కపూర్

2. కరీనా కపూర్

కరీనా కపూర్ యొక్క రెడ్ కార్పెట్ అప్పియరెన్స్ ను ఫ్యాషనిష్టాలు ఫిదా అయి తీరాల్సిందే. అద్భుతమైన వస్త్రధారణతో అందరి మనసులో దోచేసింది ఈ ముద్దుగుమ్మ. గలియా లహావ్ వారి తెల్లటి మెర్మైడ్ అవుట్ ఫిట్ తో ఈ వేడుకలో సందడి చేసింది. కరీనా అవుట్ ఫిట్ పై పూల డిజైను అద్భుతంగా ఉంది.

కరీనాను అందంగా చూపించడంలో రియా కపూర్ యొక్క పనితనం కూడా ఇక్కడ కనిపించింది.

3. జాక్వెలిన్ ఫెర్నాన్డేజ్

3. జాక్వెలిన్ ఫెర్నాన్డేజ్

స్టీఫెన్ రోలాండ్ పారిస్ వారి ఐవరీ వైట్ స్ట్రాప్ లెస్ గౌనుతో ఈ వేడుకలో ఒక స్టైల్ మ్యాజిక్ ని క్రియేట్ చేసింది జాక్వెలిన్. తాను సాధారణంగా కనిపించే విధానం కంటే ఈ లుక్ లో జాక్వెలిన్ బ్యూటీకే ఓ కొత్త అర్థాన్ని తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు. ఎక్స్టెండెడ్ రఫుల్స్ కలిగిన తన గౌనుతో జాక్వెలిన్ సందడి చేసింది.

నిరావ్ మోడీ జెవెల్స్ వారి ఇయర్ రింగ్స్ తో పాటు జుడిత్ లెబెర్ న్యూయార్క్ వారి క్లచ్ వలన జాక్వెలిన్ అలంకరణ అద్భుతంగా ఉంది.

4. సోనమ్ కపూర్

4. సోనమ్ కపూర్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017 వేడుకలో సోనమ్ ని బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీస్ లో ఒకరిగా పేర్కొనవచ్చు. మచ్చలేని అందంతో పాస్టెల్ షేడెడ్ అటైర్ లో ఒక దేవకన్యలా కనిపించింది ఈ వయ్యారిభామ. అటెలీర్ జహ్రా వారి స్ట్రాప్ లెస్ బాల్ గౌన్ ను ధరించి ఈ వేడుకలో సందడి చేసింది ఈ భామ. ఈ గౌన్ కోర్సెట్ ఏరియాపై అద్భుతమైన కలర్ ఫుల్ గ్లాస్ ఎంబోస్మెంట్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి.

ఈ గౌన్ పై ఒక రాయల్ క్రౌన్ ని కూడా సోనమ్ ధరించింది.

5. కత్రినా కైఫ్

5. కత్రినా కైఫ్

సమ్మర్ పార్టీ లుక్ తో కత్రినా కైఫ్ అదిరిపోయింది. బీచ్ వేర్ తో కలగలిపిన పార్టీ వేర్ లుక్ ని గౌల్టిర్ గౌనులో చక్కగా క్యారీ చేసింది. కత్రినా గౌన్ క్రెడిట్ జీన్ పాల్ కి చెందుతుంది. ఫ్లోరల్ సరోన్గ్ స్టైల్ లో ఈ గౌనులో నున్న నలుపు రంగు ఆకర్షణీయంగా ఉంది.

ఈ అవుట్ ఫిట్ కి అవుట్ హౌస్ జ్యువలరీ తరఫునుంచి యాక్సెసరీస్ ను అలాగే లోబయోటిన్ వరల్డ్ నుంచి షూస్ ని మ్యాచ్ చేసి స్టైల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది కత్రినా.

6. అలియా భట్

6. అలియా భట్

బాలీవుడ్ స్టైల్ ఐకాన్స్ కి ధీటుగా అలియా కూడా తన అద్భుతమైన వస్త్రధారణతో రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. నీడిల్ అండ్ థ్రెడ్ లండన్ నుంచి టీయర్డ్ లేస్ మరియు తుళ్లే మ్యాక్సీ డ్రెస్ ను ధరించింది.

సెలెబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్ అలియా లుక్ కి మెరుగులు దిద్దారు.

7. భూమి పెడ్నేకర్

7. భూమి పెడ్నేకర్

వైట్ గౌన్ లో భూమి అద్భుతంగా కనిపించింది. బాడీ కాన్ వైట్ అవుట్ ఫిట్ లో వేడుకకు విచ్చేసిన భూమి ఈ వేడుకకు మరింత అందాన్ని తెచ్చింది. భూమి అవుట్ ఫిట్ కు ప్లంజింగ్ నెక్ లైన్ గ్లామర్ ను అద్దింది. అలాగే డ్రెస్ కి కింది భాగం కూడా భూమి యొక్క గ్లామర్ ని పెంపొందించడంలో తనదైన పాత్ర పోషించింది. ఈ గౌన్ కు జిమ్మీ చూ వారి సిల్వర్ హీల్స్ ను మ్యాచ్ చేసింది. అలాగే రేణు ఒబెరాయ్ లక్జరీ జ్యువలరీ మరియు గెహెనా జెవెల్లెర్స్ వారి యాక్ససరీస్ తో మరింత సొగసరిగా కనువిందు చేసింది భూమి.

8. నిథి అగర్వాల్

8. నిథి అగర్వాల్

ఆరుషి కౌతుర్ వారి పౌడర్ పింక్ షేడెడ్ డ్రాప్ షోల్డర్ గౌన్ లో నిథి తన అందాల నిథితో సందడి చేసింది. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే ఫ్రంట్ స్లిట్ గౌన్ ను ధరించి అందాలను అరబోయడంతో ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తపడింది . డైమండ్ చోకర్ తో పాటు గోల్డెన్ స్ట్రాప్ప్డ్ హీల్స్ తో ఈ గౌన్ ను మ్యాచ్ చేసింది.

9. ఈషా గుప్తా

9. ఈషా గుప్తా

బాలీవుడ్ లో హాటెస్ట్ విమెన్ గా ప్రసిద్ధి చెందిన ఈషా గుప్తా వస్త్రధారణ గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ఈషా తన వస్త్రధారణతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈషా ధరించిన సైడ్ బకుల్డ్ బ్లాక్ గౌన్ ని హాటెస్ట్ అవుట్ ఫిట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈషాని ఈ లుక్ లో చూసి ఉండరు.

వల్గారిటీకి తావు లేకుండా ఈ అవుట్ ఫిట్ ని జాగ్రత్తగా క్యారీ చేయడంలో ఈషా సక్సెస్ అయింది. ఈ అవుట్ ఫిట్ తో సినీ ప్రేమికులతో పాటు ఈ వేడుకకు విచ్చేసిన వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఈషా.

10 .సోనాక్షి సిన్హా

10 .సోనాక్షి సిన్హా

తన లుక్ సాధారణంగానే ఉన్నా వేడుకలో తన అట్టైర్ తో చక్కగా సందడి చేసింది సోనాక్షి. నుపుర్ కనోయ్ వారి పాస్టెల్ షేడెడ్ గౌన్ ను ధరించిన సోనాక్షి ఆ గౌను కు మ్యాచ్ అయ్యే ఆమ్రపాలి జెవెల్లెర్స్ తో పాటు స్టీవ్ మేడెన్ సాండల్స్ ని ధరించింది.

మా అభిప్రాయం ప్రకారం వీరందరూ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017 ఈవెంట్ కి అదనపు సొగసులు అద్దిన బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీస్. మీరు గనక బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీస్ ను ఎంపిక చేయాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేస్తారు, ఏ లుక్ మిమ్మల్ని మెస్మరైజ్ చేసింది.

English summary

Best Dressed Actresses At Filmfare Awards 2017

RThe most awaited annual Filmfare Awards 2017 took place in Mumbai as the weekend began and we were enthralled by the style books of all the stars who streamed in the gorgeous event. As we observed all the divas at the star-filled night, it was no more just the actresses who stunned the show.
Story first published: Tuesday, December 5, 2017, 11:26 [IST]