For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2022 Day 2: నవరాత్రి రెండో రోజు మీ అందాన్ని ఎరుపెక్కనివ్వండి

నవరాత్రుల్లో రెండో రోజు అనగా సెప్టెంబర్ 27న ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇక్కడ సూచిస్తున్న డిజైన్లలో ఎరుపు వస్త్రాలను ధరించి అటు స్టైల్ గా కనిపించడంతో పాటు సంప్రదాయబద్ధంగానూ ఉండండి.

|

Navratri 2022 Day 2: సెప్టెంబర్ 26 నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది. ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. నవరాత్రుల సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. అలాగే తొమ్మిది రోజులు తొమ్మిది రంగును కేటాయిస్తారు. ఆ రోజు అమ్మవారికి ఆ రంగులోని చీరతో అలంకరిస్తారు.

Navratri 2022 Day 2: Know the significance of Red Colour in Telugu

ఆయా రోజుల్లో ఆ వర్ణాల్లోని దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 26వ తేదీన నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఇక రెండో రోజు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగుకు కేటాయించడం జరిగింది. నవరాత్రుల్లో రెండో రోజు అనగా సెప్టెంబర్ 27న ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి.

మహిళలకు ఆకట్టుకునే ఎరుపు వస్త్రాలు చాలానే ఉంటాయి. ఈ నవరాత్రి సందర్భంగా.. ఇక్కడ సూచిస్తున్న డిజైన్లలో ఎరుపు వస్త్రాలను ధరించి అటు స్టైల్ గా కనిపించడంతో పాటు సంప్రదాయబద్ధంగానూ ఉండండి.

జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

ఈ రెడ్ చీరలో ఎంబ్రాయిడరీ చేసిన ఎర్రని పూసలు దానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. జాన్వీ కపూర్ ఈ దుస్తులతో ఎటువంటి ఉపకరణాలు ధరించలేదు. మేకప్ చాలా సహజంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ చీర యొక్క ఆకర్షణ దానికదే మాట్లాడుతుంది.

సుహానా ఖాన్

సుహానా ఖాన్

మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ సరళమైన ఇంకా సొగసైన ఎరుపు రంగు చీరలో సుహానా ఖాన్ అద్భుతంగా కనిపిస్తోంది. చీరను ఝుమ్‌కాస్‌తో జత చేయడం ద్వారా ఆమె రూపాన్ని పూర్తి చేసింది.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

సాధారణ ఎరుపు రంగు సూట్‌ తో మీరు ఎప్పటికీ తప్పు చేయలేరు. సోనమ్ కపూర్ ఎరుపు రంగు పలాజోతో జతగా రెడ్ కుర్తాలో అందంగా కనిపిస్తోంది. గోల్డెన్ బార్డర్ దుస్తులకు మరింత ఆకర్షణనిస్తుంది. మీరు పెద్ద గోల్డెన్ ఝుమ్‌కాస్ మరియు కొల్హాపురి షూలతో దుస్తులను జత చేయవచ్చు.

అలియా భట్

అలియా భట్

అలియా భట్ లాగానే మీ సంప్రదాయ దుస్తులకు ఆధునిక ట్విస్ట్ ఇవ్వండి. సబ్యసాచి డిజైన్ చేసిన ఈ డ్రెస్ వన్ సైడ్ ఆఫ్ షోల్డర్ దుస్తులకు మోడ్రన్ లుక్‌ని ఇస్తుంది. ట్రెడిషనల్ బార్డర్ డిజైన్‌తో ఉన్న డ్రెస్‌పై పోల్కా డాట్‌లు మరింత గ్లామర్‌ని ఇస్తాయి.

శిల్పాశెట్టి

శిల్పాశెట్టి

మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ ఇతర చీర మీ సంప్రదాయ చీరకు గ్లామర్‌ ను జోడిస్తుంది. మెరిసే సీక్విన్ చీరలో శిల్పాశెట్టి అద్భుతంగా కనిపిస్తుంది. కేప్ స్లీవ్ బ్లౌజ్ లుక్ ‌కు మరింత అందాన్ని జోడిస్తుంది.

English summary

Navratri 2022 Day 2: Know the significance of Red Colour in Telugu

read on to know Navratri 2022 Day 2: Know the significance of Red Colour in Telugu
Desktop Bottom Promotion