For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎరుపు రంగు పాలకూర వలన చేకూరే 20 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు, ఇది తింటే చాలు, ఇంకేమొద్దు, ఎన్ని లాభాలో

ఎరుపు రంగు పాలకూర ఏంతో రుచికరంగా ఉంటుంది. ఎర్రరేగడి నేల రంగులో ఉండే ఈ పాలకూర, సాధారణ ఆకుపచ్చని పాలకూరకు భిన్నమైన ఆకృతిని పోలి కనిపిస్తుంది. ఇది సాధారణంగా భారత దేశం మరియు అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో

|

ఆకుపచ్చ పాలకూర మరియు దాని వలన చేకూరే అద్భుతమైన లాభాల గురించి మనకు బాగా తెలుసు. అయితే ఎరుపు రంగు పాలకూర గురించి మీకు తెలుసా ? ఈ పాలకూర అమరంతసియే అనే మొక్కల కుటుంబానికి చెందినది. దీని గురించి అతి తక్కువ మందికే పరిచయం ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సాధారణ పాలకూర, తెల్ల పాలకూర, వంటి పాలకూర వర్గాల వలెనే ఎరుపు రంగు పాలకూర కూడా ఒకటి. ఎరుపు రంగు పాలకూర పోషకాలకు మంచి మూలంగా ఉండడంతోపాటుగా పుష్కలమైన ఔషధ అవసరాలకు కూడా విరివిగా వినియోగించడం జరుగుతుంది. పాలకూర కాండములలో ఎరుపు రంగు ద్రవం ఉంటుంది. పాలకూర కాడలు మరియు ఆకులు ఎరుపు రంగులో ఉండేందుకు ఈ ద్రవమే కారణంగా ఉంటుంది.

20 Wonderful Benefits Of Red Spinach, Nutrition & Recipes

ఎరుపు రంగు పాలకూర వినియోగం :

ఎరుపు రంగు పాలకూర ఏంతో రుచికరంగా ఉంటుంది. ఎర్రరేగడి నేల రంగులో ఉండే ఈ పాలకూర, సాధారణ ఆకుపచ్చని పాలకూరకు భిన్నమైన ఆకృతిని పోలి కనిపిస్తుంది. ఇది సాధారణంగా భారత దేశం మరియు అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో విరివిగా వినియోగించబడుతుంది. ఆఫ్రికన్ సాంప్రదాయక వైద్యంలో, ఎరుపు రంగు పాలకూరను గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు మూలికా వైద్యం వలె వినియోగించడం జరుగుతుంది. కాని అధిక వినియోగం కొన్ని దుష్ప్రభావాలకు సైతం దారితీస్తుంది. దుష్ప్రభావాల గురించిన వివరాలు వ్యాసం కింద పొందుపరచబడినవి.

ఆకులతో కూడిన కూరగాయలు అందించే పోషక ప్రయోజనాలు, మీ శారీరిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మీ చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఎరుపు రంగు పాలకూర మీ ఆహారంలో భాగం కాకపోతే, క్రింది ప్రయోజనాలు మరియు పోషక విలువల గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

ఎరుపు రంగు పాలకూర వలన చేకూరే 20 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు మరియు రెసిపీలు :

20 Wonderful Benefits Of Red Spinach, Nutrition & Recipes

ఎరుపు రంగు పాలకూరలోని పోషక విలువలు :

100 గ్రాముల ఎరుపు రంగు పాలకూరలో, 51 కిలో కేలరీల శక్తి, 0.08 మిల్లీ గ్రాముల విటమిన్ B1 h, మరియు 0.5 గ్రాముల కొవ్వు ఉంటుంది.

మరికొన్ని పోషక విలువలు :

10 గ్రాముల కార్బోహైడ్రేట్లు

1 గ్రాము డైటరీ ఫైబర్

4.6 గ్రాముల ప్రోటీన్

42 మిల్లీ గ్రాముల సోడియం

340 మిల్లీ గ్రాముల పొటాషియం

111 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్

368 మిల్లీ గ్రాముల కాల్షియం

2 మిల్లీ గ్రాముల ఇనుము

1.9 మిల్లీ గ్రాముల విటమిన్ ఎ

80 మిల్లీ గ్రాముల విటమిన్ సి

20 Wonderful Benefits Of Red Spinach, Nutrition & Recipes


ఎరుపు రంగు పాలకూర ప్రయోజనాలు :

కాల్షియం మరియు నియాసిన్ లో అధికంగా ఉండే, ఆకు కూరలను మీ రోజువారీ ఆహార ప్రణాళికలో ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ఈ ఎరుపు రంగు పాలకూరను సూప్ లేదా ఇతర రెసిపీల రూపంలో తరచుగా తీసుకోవడం మూలంగా కాల్షియం లోపం (కాల్షియం డెఫీషియన్సీ) సమస్యను నివారించవచ్చునని చెప్పడమైనది. క్రమంగా బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

1. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

1. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

ఎరుపు రంగు పాలకూరలోని ఫైబర్ కంటెంట్ మీ జీర్ణ వ్యవస్థకు అత్యంత ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. దీనిలోని డైటరీ ఫైబర్ పెద్దపేగును శుభ్రపరచడం ద్వారా మీ ప్రేగు కదలికలను క్రమబద్దీకరించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఎరుపు రంగు పాలకూర మీ జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు, మీ పెద్దప్రేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. క్రమంగా మలవిసర్జన సాఫీగా సాగడంలో సహాయపడుతుంది మరియు పెద్దప్రేగు కాన్సర్, డయాబెటిస్ మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను సైతం నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది.

2. క్యాన్సర్ చికిత్సలో భాగంగా :

2. క్యాన్సర్ చికిత్సలో భాగంగా :

ఎరుపు రంగు పాలకూరలో అధిక మోతాదులో అమైనో ఆమ్లాలు, ఇనుము, పొటాషియం, భాస్వరం, విటమిన్ ఇ, పొటాషియం, విటమిన్ సి మరియు మెగ్నీషియం నిల్వలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిర్మూలించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. పాలకూరలోని అనామ్లజనకాలు క్యాన్సర్ పురోగమనాన్ని నివారించే లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా చికిత్సలో పరిపూర్ణ మద్దతునిస్తుంది. తరచుగా ఎరుపు రంగు పాలకూరని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సమస్య తలెత్తకుండా చూడడంలో కూడా సహాయపడుతుంది.

3. ఊబకాయం తగ్గించడంలో సహాయం చేస్తుంది :

3. ఊబకాయం తగ్గించడంలో సహాయం చేస్తుంది :

ఎరుపు రంగు పాలకూరలోని ప్రోటీన్ నిల్వలు మీ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని ప్రోటీన్ నిల్వలు ఆరోగ్యకర హార్మోన్ను విడుదల చేయడంలో సహాయం చేస్తుంది. ఇది ఆకలిని నిరోధించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా నిరంతర ఆకలి సమస్యను కూడా తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ మీ ఆకలిని అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

4. రక్తహీనతను తగ్గించడంలో :

4. రక్తహీనతను తగ్గించడంలో :

ఎరుపు రంగు పాలకూర ఐరన్ నిల్వలను అధికంగా కలిగి ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తప్రసరణ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తరచుగా ఎరుపు రంగు పాలకూరను వినియోగించడం ద్వారా హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి, రక్త శుద్ది జరిగి, ఫలితంగా మీ రక్త ప్రవాహం సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. కావున మీరు రోజువారీ ఆహారంలో ఎరుపు రంగు పాలకూరను చేర్చుకోవడం మంచిదిగా చెప్పబడుతుంది.

5. మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది :

5. మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది :

తరచుగా ఎప్పటికప్పుడు ఎరుపు రంగు పాలకూర తీసుకోవడం ద్వారా మీ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా అందులోని అధిక ఫైబర్ నిల్వలు ఇందులో ప్రధాన భూమికను తీసుకుంటాయి. ప్రధానంగా ఆకు యొక్క కాడలు, మీ మూత్రపిండాల దృష్ట్యా అధిక లాభాలను కలిగి ఉన్నాయని చెప్పబడింది. అందువల్ల ఆకులతో పాటుగా కాడలను కూడా వినియోగించడం ద్వారా, అది మీ శరీరంలోని విషతుల్య ప్రభావాలను తొలగించడంలో అద్బుతంగా పనిచేస్తుందని చెప్పబడింది.

6. రక్త విరోచనాలను నివారిస్తుంది

6. రక్త విరోచనాలను నివారిస్తుంది

ఎరుపు రంగు పాలకూర కాండం, రక్త విరేచనాల చికిత్సలో అత్యంత ప్రయోజనకరమైనదిగా నిరూపించబడింది. పాలకూరలో ఉండే డైటరీ ఫైబర్ నీటిని శోషించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది మరియు పేగు వ్యవస్థను శుభ్రపరుస్తుంది. విరేచనాలను కలిగించే బాక్టీరియాను తొలగించడంలో ఎరుపు రంగు పాలకూరలోని ఆంథోసియానిన్లు సహాయపడతాయి. దీని కాండంలోని ఒక భాగాన్ని తరచుగా వినియోగించడం మూలంగా రక్తవిరోచనాలు కుదుట పడుతాయని చెప్పబడింది.

7. ఆస్థమా చికిత్సలో :

7. ఆస్థమా చికిత్సలో :

దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అత్యంత ప్రభావవంతముగా సహాయపడే బీటా కెరోటిన్ నిల్వలను అధికంగా కలిగి ఉండే ఈ ఎరుపు రంగు పాలకూరలో అనేక ఇతరములైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఆస్థమా యొక్క ఆగమనాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది మీ శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు శ్వాసకోశ నాళాలలోని అవరోధాలను తొలగించడంలో సహాయం చేస్తుంది.

8. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

8. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

విటమిన్లు మరియు పోషకాల యొక్క అధిక నిల్వల మూలంగా, ఎరుపు రంగు పాలకూర మీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడంలో అత్యంత కీలకమైన అమైనో ఆమ్లాలు, విటమిన్ E, విటమిన్ K, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం మరియు పొటాషియం మొదలైన ముఖ్యమైన ఖనిజ నిల్వలు ఇందులో అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని వ్యాధి కారక బ్యాక్టీరియా లేదా వైరస్ల నుండి రక్షించడంలో అత్యుత్తమంగా సహాయం చేస్తాయి.

9. జ్వరం చికిత్సలో సహాయం చేస్తుంది :

9. జ్వరం చికిత్సలో సహాయం చేస్తుంది :

ఎరుపు రంగు పాలకూర ఒక రోగ నిరోధక శక్తి బూస్టర్ వలె ఉన్న కారణాన, జ్వరం చికిత్సలో ఉపయోగించడం గురించి ఆశ్చర్యపోనవసరం లేదు. జ్వరం సమయంలో ఎరుపు రంగు పాలకూరను తీసుకోవడం ద్వారా మీ శరీర ఉష్ణోగ్రతలు సైతం నియంత్రించబడుతాయి. మరియు శరీరాన్ని సాధారణ ఉష్ణోగ్రత వద్ద నిర్వహించడంలో దోహదపడుతుంది.

10. ఎముక బలాన్ని పెంచుతుంది :

10. ఎముక బలాన్ని పెంచుతుంది :

ఎరుపు రంగు పాలకూర విటమిన్ K కి మంచి మూలంగా ఉంటుంది, ఇది మీ ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది. మీ ఆహారంలో విటమిన్ K లేకపోవడం మూలంగా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పొరాసిస్) లేదా ఎముకలలో పగుళ్ల అభివృద్ధికి కారణమవుతుంది. ఎరుపు రంగు పాలకూర కాల్షియం శోషణలో, మరియు ఎముక మాతృక ప్రోటీన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా విటమిన్ k నిల్వలు, గాయాలు వాపు సమయంలో అధిక రక్త స్రావం జరుగకుండా నివారించగలవు కూడా.

11. మధుమేహం చికిత్స :

11. మధుమేహం చికిత్స :

పైన చెప్పినట్లుగా, ఎరుపు రంగు పాలకూర విటమిన్లు మరియు పోషకాలలో అధికంగా ఉంటుంది. వీటితోపాటు, మీ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేసే, విటమిన్ B3 నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా సహాయపడగలదు. కావున కనీసం నెలలో రెండు నుండి మూడు సార్లైనా పాలకూర, లేదా ఎరుపు రంగు పాలకూర తీసుకోవడం ఉత్తమం.

12. శారీరిక శక్తిని పెంచుతుంది :

12. శారీరిక శక్తిని పెంచుతుంది :

ఆకు కూరల్లోని కార్బోహైడ్రేట్స్ నిల్వలు మీ శక్తి స్థాయిలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లతో పాటు మాంసకృత్తులు, విటమిన్ K, ఫోలేట్, రిబోఫ్లావిన్, విటమిన్ A, విటమిన్ B6 మరియు విటమిన్ సి ల మేలుకలయిక మీ శక్తి స్థాయిలను పెంచుతుంది.

13. కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది :

13. కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది :

మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేలా డైటరీ ఫైబర్ కలిగి ఉన్న ఈ ఎరుపు రంగు పాలకూరలోని విటమిన్ E లోని టోకోట్రియెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా మీ శరీరం కొలెస్ట్రాల్ స్థాయిలలో సంతులనాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది.

14. గర్భధారణ సమయంలో ప్రయోజనకరం :

14. గర్భధారణ సమయంలో ప్రయోజనకరం :

గర్భధారణ సమయంలో అత్యధికంగా విటమిన్స్ మరియు ఖనిజాలు అవసరమవుతాయి. గర్భంతో ఉన్న ప్రతి తల్లి తప్పనిసరిగా అనుసరించవలసిన ఆహారంగా ఈ ఎరుపు రంగు పాలకూర ఉంటుంది. ఇందులో కనిపించే విటమిన్లు మరియు ఖనిజాలు తల్లితో పాటు గర్భస్థ శిశువుకు కూడా మంచిదిగా చెప్పబడుతుంది. అంతేకాకుండా తల్లి రొమ్ము పాల ఉత్పత్తి మెరుగుదలలో కూడా అత్యుత్తమంగా సహాయపడుతుంది. కావున గర్భిణీ స్త్రీలు తరచుగా పాలకూర తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి. అయితే మీ అనారోగ్య లక్షణాల ప్రకారం వైద్యుని సిఫార్సు మేరకు ఆహార ప్రణాళిక ఉండాలని గుర్తుంచుకోండి. గౌట్, అలర్జీలు లేదా కీళ్ళ నొప్పి వంటి సమస్యలు ఉన్న ఎడల వైద్య పరీక్షల నిమిత్తం, వైద్యుని సిఫారసు మీద పాలకూర వంటివి అనుసరించవలసి ఉంటుందని మరువకండి.

15. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

15. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

ఎరుపు రంగు పాలకూరలోని ఫైటోస్టెరోల్స్ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయం చేయడమే కాకుండా, గుండె వ్యాధుల అభివృద్ధికి వ్యతిరేకంగా, మరియు విరుగుడుగా పనిచేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఎరుపు రంగు పాలకూరను చేర్చడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చునని చెప్పడమైనది.

16. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

16. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

ఎరుపు రంగు పాలకూర విటమిన్ E లో సమృద్ధిగా ఉండటం మూలన మీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోదగిన కీలకమైన ఆహారంగా ఉంటుంది. మీ కంటి ఆరోగ్యానికి విటమిన్ E అవసరం. ఎందుకంటే ఇది మీ దృష్టిని పెంచడానికి, అదేవిధంగా సమస్యలు రాకుండా నిర్వహించడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్, వంటి గాడ్జెట్ల నిరంతర వినియోగం మరియు గేం అడిక్షన్స్ కారణంగా మీ కళ్ళు తీవ్ర స్థాయిలో ప్రతికూలంగా ప్రభావితమవుతుంటాయి. కావున శరీరానికి విటమిన్ E పుష్కలంగా అందించే క్రమంలో భాగంగా ఎరుపు రంగు పాలకూరని జోడించుకోవలసినదిగా సూచించడమైనది.

17. జుట్టు మూలాలను బలపరుస్తుంది

17. జుట్టు మూలాలను బలపరుస్తుంది

తరచుగా ఎరుపు రంగు పాలకూరను వినియోగించడం ద్వారా కలిగే ఉత్తమ ప్రయోజనాల్లో ఒకటి జుట్టు నాణ్యత మెరుగుపడడం. ఎరుపు రంగు పాలకూర, మిమ్ములను హెయిర్ ఫాల్ సమస్య నుండి కాపాడుతుంది. మీ జుట్టు మూలాలను బలపరుస్తుంది మరియు జుట్టు దృడంగా మార్చడంలో సహాయం చేస్తుంది. పాలకూర రసం, పానీయం లేదా పాలకూర వంటకాలు తరచుగా తీసుకోవడం వంటివి మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడగలవు.

18. అకాల తెల్ల జుట్టును తొలగిస్తుంది :

18. అకాల తెల్ల జుట్టును తొలగిస్తుంది :

ఎరుపు రంగు పాలకూర తరచుగా తీసుకోవడం ద్వారా అకాల వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంతోపాటు, బూడిద రంగు జుట్టును అరికట్టడంలో సహాయం చేస్తుంది. ఎరుపు రంగు అనేది ఈ పాలకూరలోని వర్ణద్రవ్యం. ఇది మెలనిన్ నిల్వలను పరిమితం చేస్తుంది. క్రమంగా అకాల తెల్లజుట్టు నివారించబడుతుంది.

19. చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది :

19. చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది :

విటమిన్ సి లో అధికంగా ఉండే, ఎరుపు రంగు పాలకూర అధిక మోతాదుల్లో కొల్లాజన్ను అభివృద్ధి చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ వలె పనిచేస్తుంది. అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉండే ఆకు కూరగా మాత్రమే కాకుండా, అనేక సౌందర్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుందని చెప్పబడింది. ఎరుపు రంగు పాలకూరలో ఉండే విటమిన్ సి నిల్వలు చర్మాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఎరుపు రంగు పాలకూర ఐరన్ నిల్వలలో అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిలు పెరగడంలో అత్యంత దోహదపడే మూలకంగా ఉంటుంది.

ఇది రక్త ప్రసరణను సజావుగా సాగడంలో సహాయం చేయడం ద్వారా, శారీరిక ఆరోగ్యం నిర్వహించడంతో పాటుగా మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. క్రమంగా మీ చర్మానికి సహజ సిద్దమైన మెరుపును ఇవ్వడంలో సహాయం చేస్తుంది. అదేవిధంగా, ఇందులోని విటమిన్ సి నిల్వలు వాపు మరియు మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా పాలకూరలోని నీటి నిల్వలు, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతూ, చర్మంలో తేమ నిల్వలను నిర్వహించడంలో ఎంతగానో దోహదం చేస్తుంది.

20. డార్క్ సర్కిల్స్ నివారించడంలో సహాయం చేస్తుంది :

20. డార్క్ సర్కిల్స్ నివారించడంలో సహాయం చేస్తుంది :

ఎరుపు రంగు పాలకూరలో ఉండే విటమిన్ K నిల్వలు, కళ్ళ చుట్టూ చేరిన డార్క్ సర్కిల్స్ వదిలించడంలో సహాయపడుతాయి. చర్మంలోని వాపును తగ్గించడం మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా డార్క్ సర్కిల్స్ తొలగించడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన పాలకూర వంటకాలు :

ఆరోగ్యకరమైన పాలకూర వంటకాలు :

1. ఎరుపు ముల్లంగితో (రెడ్ రాడిష్) ఉడికించిన పాలకూర :

కావలసిన పదార్ధాలు:

• 2 పౌండ్ల తాజా పాలకూర

• 6 ఔన్సుల ముల్లంగి

• 1/4 కప్పు నీరు

• 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

• 1/4 టీస్పూన్ ఉప్పు

• 1/8 టీస్పూన్ నల్ల మిరియాలు

విధానం :

• పారుతున్న చల్లటి నీటిలో (టాప్ వాటర్), పాలకూరను శుభ్రం చేసి, ఆరనివ్వండి.

• పాలకూర, ముల్లంగులను నీటిలో వేసి పొయ్యి మీద సన్నని మంట మీద ఉంచండి.

• మీడియం మంట మీద కనీసం 10 నిమిషాలపాటు ఉడికించాలి.

• ఉడికిన తర్వాత, నీటిని తొలగించి ఈ పాలకూర, ముల్లంగి మిశ్రమాన్ని ఒక గిన్నె లోనికి బదిలీ చేయండి.

• నిమ్మరసం, ఉప్పు మరియు మిరియాల పొడిని మిశ్రమంగా చేయండి.

• ఈ మిశ్రమాన్ని పాలకూర మీద పోసి, బాగా కలిపి, సర్వ్ చేయండి.

2. క్లాసిక్ స్పినాచ్ సలాడ్ :

2. క్లాసిక్ స్పినాచ్ సలాడ్ :

కావలసిన పదార్ధాలు :

• 10 ఔన్సుల తాజా పాలకూర ఆకులు

• 1 కప్పు ముక్కలుగా చేసిన పుట్టగొడుగులు

• 1 టమోటా (మీడియం, ముక్కలుగా కట్ చేయండి)

• 1/3 కప్ క్రౌటన్లు (రుచికోసం)

• 1/4 కప్పు ఉల్లిపాయ (తరిగిన)

విధానం :

• చల్లటి నీటితో మరియు పాలకూరను శుభ్రం చేసి, ఆరనివ్వండి.

• ఒక బౌల్లోకి పుట్టగొడుగులు, టమోటాలు, క్రోటన్లు మరియు ఉల్లిపాయ ముక్కలను జోడించండి.

• పాలకూర ఆకులు జోడించండి.

• మిశ్రమంగా కలిపి, సర్వ్ చేయండి!

3. కాప్సికం మరియు పాలకూర :

3. కాప్సికం మరియు పాలకూర :

కావలసిన పదార్ధాలు:

• 1 కాప్సికం (మీడియం, ముక్కలుగా కట్ చేసినది)

• 2 వెల్లుల్లి రెబ్బలు (తురిమినవి)

• 10 ఔన్సుల పాలకూర ఆకులు

• 2 స్పూన్ల నిమ్మ రసం

• 1 టీస్పూన్ బట్టర్

విధానం :

• ఒక పాన్లో బట్టర్ వేసి, సన్నని మంట మీద కరగబెట్టండి.

• మీడియం మంట మీద కాప్సికం వేసి వేయించండి.

• ఇప్పుడు పాలకూర ఆకులు వేసి 4 నిమిషాలపాటు వేయించండి.

• తర్వాత తురిమిన వెల్లుల్లి రెబ్బలను వేసి 30 సెకన్లు ఉడికించండి.

• 2 నిమిషాల పాటు మూతపెట్టి ఉడకనివ్వండి.

• ఇప్పుడు పక్కకి తీసి, నిమ్మరసం జోడించి వేడివేడిగా తీసుకోండి !

ఎరుపు రంగు పాలకూర దుష్ప్రభావాలు :

ఎరుపు రంగు పాలకూర దుష్ప్రభావాలు :

ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను అందించే ఈ ఎరుపు రంగు పాలకూరలో, లాభాల పాటు, కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉన్నాయి.

1. కడుపు సమస్యలు :

అతిగా తీసుకోవడం ఎన్నటికీ ప్రమాదమే అని పెద్దలు చెబుతుంటారు. ఎరుపు రంగు పాలకూర అదనపు వినియోగం కారణంగా, అందులోని డైటరీ ఫైబర్ నిల్వలు, కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఎరుపు రంగు పాలకూర అతిగా తినడం మూలాన కడుపు ఉబ్బరం, తిమ్మిరి మరియు మలబద్ధకం లేదా వాయువు వంటి సమస్యలకు దారితీయవచ్చు. మీ రోజువారీ ఆహారంలో ఎరుపు రంగు పాలకూరను తీసుకుంటూ ఉంటే, నెమ్మదిగా తగ్గించండి. లేనిచో, అది సాధారణ కడుపు సమస్యలతోపాటు, అతిసారానికి కూడా కారణం కావచ్చు.

2. కిడ్నీలో రాళ్ళు :

2. కిడ్నీలో రాళ్ళు :

ఎరుపు రంగు పాలకూరలో పెద్ద మొత్తంలో ప్యూరిన్స్ నిల్వలు ఉంటాయి. ఇవి మీ కిడ్నీ ఆరోగ్యానికి హానికరం. ఈ ప్యూరిన్స్ నిల్వల కారణంగా సేంద్రీయ సమ్మేళనాలు యూరిక్ యాసిడ్ వలె మార్చబడతాయి, క్రమంగా మీ మూత్రపిండాల్లో కాల్షియం అవక్షేప స్థాయిలని పెంచుతుంది. ఫలితంగా, మీ శరీరం అసౌకర్యంగా మరియు బాధాకరంగా ఉంటుంది. కాలక్రమేణా ఈ పరిస్థితి మూత్రపిండాల్లో రాళ్ళ అభివృద్ధికి కారణంగా మారుతుంది.

3. గౌట్ :

3. గౌట్ :

ఎరుపు రంగు పాలకూరలో ఉన్న అధిక ప్యూరిన్ నిల్వలు, మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది, ఇది వాపు మరియు కీళ్ళనొప్పికి కారణం కావొచ్చు. మీరు ఇప్పటికే గౌట్ లేదా ఆర్థరైటిస్ బారినపడి బాధపడుతున్న వారైతే, మీరు పాలకూరకు దూరంగా ఉండడమే మంచిది.

4. అలెర్జీ రియాక్షన్స్ :

4. అలెర్జీ రియాక్షన్స్ :

ఎరుపు రంగు పాలకూరలో ఉండే హిస్టామిన్ నిల్వలు, చిన్న చిన్న అలర్జీలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా అరుదైనప్పటికీ, ఎరుపు రంగు పాలకూర కారణంగా ఇమ్యునోగ్లోబ్యులిన్ E(IgE )- మీడియేట్ అలెర్జీ కొన్ని సందర్భాల్లో చూడబడింది.

5. టీత్ కోర్స్నెస్ :

5. టీత్ కోర్స్నెస్ :

అధికంగా పాలకూర అలవాటు ఉన్న ఎడల, మీ పళ్ళ ఉపరితలంపై సున్నితత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఎరుపు రంగు పాలకూర ఆకులు ఉన్న ఆక్సాలిక్ యాసిడ్, నీటిలో సైతం కరగని చిన్న చిన్న స్ఫటికాలను అభివృద్ధి చేస్తుంది. ఇది మీపళ్ళను ముతకగా లేదా గరుకుగా చేయగలవు. ఈ సమస్య శాశ్వతం కాదు, మరియు కొన్నిగంటల తర్వాత దానికదే తొలగిపోవడం, లేదా బ్రషింగ్ తర్వాత మాయమవడం జరుగుతుంటుంది

ఎరుపు రంగు పాలకూరతో ప్రయోజనాలు

ఎరుపు రంగు పాలకూరతో ప్రయోజనాలు

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

ఎరుపు రంగు పాలకూర వలన చేకూరే 20 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు, ఇది తింటే చాలు, ఇంకేమొద్దు, ఎన్ని లాభాలో

20 Wonderful Benefits Of Red Spinach, Nutrition & Recipes
Desktop Bottom Promotion