Latest Updates
-
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..!
పీరియడ్స్ రెగ్యులర్‌గా రావట్లేదా? ఈ యోగాసనాలతో సమస్య పరిష్కారం గ్యారెంటీ
పీరియడ్స్.. ఇది చాలా మంది మహిళలకు ఒత్తిడి తీసుకువచ్చే అంశం. కొందరు ఎక్కువ నొప్పితో విలవిలలాడితే, మరికొందరు పీరియడ్స్ రెగ్యులర్ గా రాక ఒత్తిడి ఎదుర్కొంటారు. అయితే పీరియడ్స్ సమయానికి రాకపోవడం వెనక చాలానే కారణాలు ఉంటాయి. కారణాలు ఏవైనా పీరియడ్స్ సమయానికి రాకపోవడం మాత్రం ఆందోళన కలిగించేదే.
ఒత్తిడి, ఆందోళన, పలు రకాల మందులు, అతిగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, గర్భ నిరోధక మాత్రలు వాడటం, పీసీఓఎస్ వంటి కారణాల వల్ల పీరియడ్స్ ఆలస్యంగా రావొచ్చు. అసలెందుకు పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించడం ముఖ్యం. దీంతో పాటు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి కొన్ని రకాల యోగాసనాలు సహాయపడతాయి. ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ధనురాసనం:
పునరుత్పత్తి వ్యవస్థకు ఉత్తమమైన భంగిమల్లో ధనురాసనం ఒకటి. ఇది ప్రాథమిక హఠ యోగా భంగిమ. పొట్ట కొవ్వు తగ్గించడంలో, వెన్నుపాము, తొడలు, చీలమండలను బలోపేతం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనంలో శరీరం విల్లు ఆకారంలో ఉంటుంది.
ముందుగా నేలపై కడుపుపై పడుకోవాలి. కాళ్లను వెనక్కు వంచాలి. ఇప్పుడు చేతులను వెనక్కి చాచి, చీలమండను పట్టుకోవాలి. శరీర బరువు కడుపు ద్వారా మద్దతు ఇస్తుంది. 20 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండాలి. నాలుగైదు సార్లు రిపీట్ చేయాలి.

2. ఉస్త్రాసన:
పీరియడ్స్ ను క్రమబద్ధీకరించడానికి, రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి ఉస్త్రాసనా చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆసనం భుజాలు, వీపును బలపరుస్తుంది. ఉస్త్రాసనం వశ్యతను మెరుగుపరుస్తుంది. అంతర్గత అవయవాలను బలోపేతం చేస్తుంది.
ముందుగా నేలపై మోకాళ్లపై కూర్చోవాలి. భుజాలు, మోకాలు సమంగా ఉండేలా భంగిమలో ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి వంచాలి. రెండు చేతులతో కాలి మడమలను పట్టుకోవాలి. తుంటిని ముందుకు నెట్టాలి. తల వెనక్కి వంచాలి. 25 సెకన్ల పాటు అదే భంగిమలో ఉండాలి. రెండు సార్లు రిపీట్ చేయాలి.

3. భుజంగాసనం:
భుజంగాసనం మీ పునరుత్పత్తి అవయవాలకు అద్భుతమైన యోగాసనం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తప్రసరణను కూడా పెంచుతుది. నేలపై మీ కడుపు ఆనేలా పడుకోవాలి. రెండు చేతుల అరచేతులను నేలకు ఆనించి తలపైకి పెట్టి ఆకాశాన్ని చూడాలి. పొట్ట నేలపై ఆనుతూ ఉండగానే.. వీలైనంతగా మెడను సాగదీయాలి. ఇలాగే కొన్ని నిమిషాల పాటు ఉంటూ దాదాపు ఐదు సార్లు రిపీట్ చేయాలి.

4. మలసానా:
మలసానాను మలస్థానం అని కూడా పిలుస్తారు. మలాసనం ఒక కుంగుబాటు ఆసనం. ఈరోజుల్లో మనం గంటల తరబడి కూర్చున్న స్థితిలోనే గడుపుతుంటాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. జీవక్రియను మెరుగు పరచడానికి బొడ్డును చోన్ చేయడానికి, జీర్ణవ్యవస్థను సక్రియం చేయడానికి, గజ్జలను బలోపేతం చేయడానికి ప్రయోజన కరంగా ఉంటంది.
మీ పాదాలను వెడల్పుగా చేసి స్క్వాట్ చేయాలి. మీ పాదాలను వెడల్పుగా ఉంచండి. ఇప్పుడు మీ మోకాళ్లను మీ మొండెం కంటే వెడల్పుగా విస్తరించి.. నమస్తే పొజిషన్‌లో మీ అరచేతులను ఒకచోట చేర్చి, ఆపై మీ మోచేతులను లోపలి తొడల్లో ఉంచి సాగదీయండి. అలా కొన్ని నిమిషాలు పట్టుకోండి. అసలు స్థానానికి తిరిగి వెళ్లండి.

5. బద్ధ కోణాసనం
బుతు సంబంధ సమస్యలకు చికిత్స చేయడానికి బుద్ధ కోణాసనం ఉత్తమమైన ఆసనాల్లో ఒకటి. ఇది స్త్రీలతో పాటు పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థను మెరుగు పరుస్తుంది. రక్త ప్రసరణను కూడా బాగు చేస్తుంది. అలాగే మూత్రపిండాలు, మాత్రాశయం వంటి అవయవాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. బద్ధ కోణాసనం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.
మోకాళ్లను వంటి, అరికాళ్లను ఒకదానికొకటి తాకినట్లు నేలపై కూర్చోవాలి. అలాగే పాదాలను గట్టిగా పట్టుకొని పాదాలు కదలకుండా తొడలను పైకి కిందికి తిప్పడం ప్రారంభించండి. ఇలా రెండు నిమిషాలు చేయాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications