Latest Updates
-
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.!
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.!
తాజా పండ్లు ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిందే.. శరీరానికి తగిన విటమిన్లు, ఫైబర్, పోషకాలు అందాలంటే సీజనల్‌గా దొరికే పండ్లను ఖచ్చితంగా తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తారు. అయితే చాలా మంది ఫ్రూట్స్ కొనేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో బాడీకి కావాల్సిన పోషకాలు అందవు. ముఖ్యంగా దానిమ్మ పండ్ల విషయంలో కొన్ని విషయాలు తప్పనిసరిగా గమనించాలి.

సాధారణంగా పండ్లు, కూరగాయలకు వాటి రంగులు వాటిలోని మూలకాల వల్ల వస్తాయనే విషయం తెలిసిందే. పసుపు రంగుకి కర్కుమిన్ అనే సహజ వర్ణద్రవ్యం కారణమైతే, దానిమ్మ గింజలకు ఆ రంగు రావడానికి కూడా సైంటిఫికల్ రీజన్ ఉంటుంది. దానిమ్మ గింజలు ముదురు ఎరుపు రంగు ఆంథోసయనన్, లైకోపిన్‌తో వస్తుంది. వీటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని పండ్లలో తెలుపు, లేత గులాబీ రంగులో గింజలు ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

దానిమ్మ పండులో పోషకాలు
న్యూట్రిషనిస్టుల సలహా ప్రకారం పండ్లు, కూరగాయల రంగు ఎంత ముదురుగా ఉంటే వాటిలో అంత ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ మేరకు దానిమ్మ గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటే వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సమాచారం ప్రకారం ఒక మీడియం సైజు దానిమ్మలో సుమారు 4.71 గ్రా. ప్రొటీన్, 11.3 గ్రా ఫైబర్, 28.2 మి.గ్రా కాల్షియం, 0.846 మి.గ్రా ఐరన్, 33.8 మి.గ్రా మెగ్నీషియం, 102 మి.గ్రా పాస్ఫరస్, 666 మి.గ్రా పొటాషియం, 1.41 మైక్రోగ్రాముల సెలీనియంతో పాటు ఐరన్, జింక్, విటమిన్ సి ఉంటాయి. అదే విధంగా పలు బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు విటమిన్ ఇ కూడా ఉండటంతో ప్రతి ఒక్కరూ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తారు.

కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు గమనించండి
మరోవైపు దానిమ్మ గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటే తీపి అద్భుతంగా ఉండటంతో పాటు మెరుస్తూ ఉంటాయి. గింజలు పెద్దవిగా ఉంటాయి. ఈ సమాచారం ప్రకారం పరిశీలిస్తే దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే పోషకాలు ఏ మేరకు అందుతాయో ఒక అవగాహన వస్తుంది. గింజల రంగును బట్టి యాంటీఆక్సిడెంట్లు, పోషకాల పరిమాణం మారే అవకాశాలు ఉన్నాయి. దీనిపై స్పష్టంగా పరిశోధన వివరాలు లేకపోయినా.. దానిమ్మ పండ్లను కొనుగోలు చేసేటప్పుడు బాగా పండిన, ముదురు ఎరుపు రంగు గింజలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు తగిన మోతాదులో వాటిని తీసుకోండి.

దానిమ్మ ప్రయోజనాలు
అదే విధంగా దానిమ్మ పండ్ల నాణ్యతను కూడా పరిశీలించడం ముఖ్యం. మంచి రసవంతమైన పండ్లతో పాటు క్వాలిటీ చెక్ చేసుకోండి. దానిమ్మ పండ్లు తినడం ద్వారా శరీరంలో వాపును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు దోహదపడుతుంది. మూత్ర సంబంధిత సమస్యలకు కూడా ఔషధంలా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
