For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నిర్వహించటానికి తీసుకోవలసిన ఉత్తమ ఆహారాలు

By Super
|

మీరు టైప్ 2 డయాబెటిస్ బాధపడుతున్నట్లయితే లేదా మీరు అధికబరువుతో బాధపడుతున్నట్లయితే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న మాట.

మీకు ఆరోగ్య సమస్యలు విస్తృతంగా పెరగటానికి కారణం రక్తంలోని గ్లూకోజ్ స్తాయిల హెచ్చుతగ్గులు సరిగ్గా నిర్వహించలేకపోవటం వలన కావొచ్చు.

మధుమేహగ్రస్తులకు టాప్ 15 డయాబెటిక్ డైట్ టిప్స్

నిరాశపడకండి! గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి సహాయపడే ఆహారాలు చాలా ఉన్నాయి. వీటిలో క్తంలో చక్కెర స్థాయిలు నిర్వహణకు కావలసిన పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి, మీరు ఆరోగ్యంగా ఉండటానికి సులభతరం చేస్తాయి మరియు స్థిరంగా మీ బ్లడ్ షుగర్ ను ఉంచుతాయి.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి ఉత్తమ ఆహారాలు

మధుమేహ వ్యాధితో బాధపడుతున్నసెలబ్రిటీలు

క్రింద ఇచ్చిన ఆహారాలను చూడండి, అన్నికూడా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహణార్థం పోషకపదార్థాలతో నిండి ఉన్నాయి.

సిలోన్ దాల్చినచెక్క

సిలోన్ దాల్చినచెక్క

దాల్చినచెక్క, కేవలం వోట్మీల్ లేదా కారంగా ఉండే వైన్ లో ఉపయోగించే రుచికరమైన దినుసు మాత్రమే కాదు, దీనిలో రక్త చక్కెర స్థాయిల నిర్వహణకు కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సిలోన్ దాల్చినచెక్క మీ ఫాస్టింగ్ గ్లూకోస్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది - చెడు కొలెస్ట్రాల్ తో పాటు - రక్తం చక్కెర వల్ల వచ్చే చిక్కులు నిరోధించే మంచి ఆహారం.

ఓట్స్

ఓట్స్

వోట్స్ లో ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్నది, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే ఉత్తమ పోషకపదార్థాలు ఉన్నాయి. ఫైబర్ మీ శరీరంలో శోషణ యొక్క రేటు ను తగ్గించి, పిండి పదార్థాలు చాలా నెమ్మదిగా గ్లూకోజ్ గా మారుస్తుంది. అదనంగా, వోట్మీల్ లో బీటా-గ్లూకాన్ ఉండటంవలన ఇన్సులిన్ సూక్ష్మగ్రాహ్యత మెరుగ్గా ఉంటుంది.

మెంతులు

మెంతులు

ఇవి ఒక సామాన్య ఆహారపదార్థాలు కాకపోయినా, ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఉత్తమమైనవి. ఇవి రక్త చక్కెర స్థాయిలను టైప్ 1 మరియు 2 డయాబెటిస్ తో బాధపడే ప్రజల్లో తగ్గిస్తుంది మరియు మధుమేహం వొచ్చే ముందు కూడా. ఈ అద్భుతమైన విత్తనాలలో అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నందుకు మనం ధన్యవాదాలు తెలపాలి.

 సాల్మన్

సాల్మన్

సాల్మన్ లో ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమేకాక, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించగలిగే ప్రాథమిక పోషకాలు కలిగిన విటమిన్ D సమృద్ధిగా ఉంది. విటమిన్ D స్థాయి తక్కువగా ఉండటం టైప్ 2 డయాబెటిస్ కు దగ్గరగా అనుసంధానించబడింది, కాబట్టి విటమిన్ D తీసుకోవడం చాలా తెలివైన మార్గం. సాల్మన్ లో ఉండే ఒమేగా 3S కూడా మీ గుండెను రక్షించడానికి మరియు ఇన్సులిన్ నిరోధకత వాళ్ళ కలిగే సాధారణ వాపు తగ్గించడానికి సహాయపడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి కేవలం మీకు కలిగిన ఒక భయంకరమైన సమస్యను నిర్వహించండమే కాకుండా, రక్త చక్కెర సమస్యలను పరిష్కరించటంలో కూడా సహాయపడుతుంది. పరిశోధనలు వెల్లుల్లిలో ఉండే అనామ్లజనకాలు మరియు సల్ఫర్ మన శరీరంలో కుందేలు లాగా పరిగెత్తే రక్త చక్కెర స్థాయిలు నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు.

బాదంపప్పులు

బాదంపప్పులు

విటమిన్ E మరియు ఆరోగ్యకరమైన ఫైబర్ తో నిండి ఉన్న ఈ బాదంపప్పులు రక్తంలో చక్కెర స్థాయిల నిర్వహణ పూర్తి సామర్థ్యతని కలిగి ఉన్నాయి. వీటిలో ఉన్న ఐరన్, మెగ్నీషియం, జింక్, మరియు ప్రోటీన్ గ్లూకోజ్ ని నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి మరియు దీనిలో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ మీరు తిన్న ఏ పిండి పదార్థాలనైనా చాలా నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అదనంగా, ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిల కోసం చాలా గొప్పవి.

 అవకోడ్స్

అవకోడ్స్

అవకోడ్స్ మీ రక్తంలో చక్కెరను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కలిగిన ఒక అద్భుతమైన మూలం. ఈ పండ్లు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటానికి సహాయపడటమే కాకుండా, కానీ వంశపారంపర్యంగా కలిగే మధుమేహం వంటి రుగ్మత యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది

ఆరెంజెస్

ఆరెంజెస్

విటమిన్ సి కలిగిన సిట్రస్ పండుగా ఇది మనకు తెలుసు, కానీ వీటిలో ఉండే పెక్టిన్ కూడా ఒక అద్భుతమైన సోర్స్. పెక్టిన్ ఫైబర్ యొక్క ఒక రూపం, ఇది ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ మరియు రక్త చక్కెర స్థాయిలను రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఆరెంజెస్ లో చాలా తక్కువ GL ఉన్నది, కాబట్టి మీరు అధిక రక్త చక్కెర స్థాయిలను గురించి చింతించకుండా వాటిని తినవచ్చు.

. బ్లూ-బెర్రీస్

. బ్లూ-బెర్రీస్

ఇవి పరిమాణంలో చిన్నగా ఉండవచ్చు, కాని, వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, మరియు అనామ్లజనకాలు వంటి అద్భుతమైన పోషకపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. 2010 అధ్యయనం ప్రకారం ప్రీడయాబెటస్ కలిగి ఉన్న ఊబకాయ వ్యక్తుల యొక్క ఆహారంలో బ్లూ-బెర్రీస్ ను జోడించడం వలన కలిగే ప్రయోజనాలను నివేదించారు. ఆరు వారాలు బ్లూబెర్రీస్ ని రెండు చొప్పున రోజు తీసుకోవటం వలన, ఇన్సులిన్ సూక్ష్మగ్రాహ్యత పెరిగింది.

ఆపిల్ పళ్లరసం వినెగార్

ఆపిల్ పళ్లరసం వినెగార్

ఆపిల్ పళ్లరసం వినెగార్ చాలాకాలం క్రితమే ఇది ఆరోగ్యకరమైన ఆహారాలలో ప్రాచుర్యం పొందింది. ఇది వినటానికి ఏదో అతిశయోక్తిలాగా అనిపిస్తుంది. డయాబెటిస్ కేర్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి ముందు ఆపిల్ పళ్లరసం వినెగార్ మరియు నీరు కలిపిన మిశ్రమం తాగడం వలన లాభాలను కలిగిస్తుందని నివేదించారు. ఇది ఇన్సులిన్ యొక్క సూక్ష్మగ్రాహ్యతను పెంచటంలో సహాయపడుతుంది మరియు టైప్ 2 మధుమేహం ఉన్నవారు ,అలాగే ప్రీడయాబెటస్ వారికి పిండిపదార్థాలను ఆహారంగా తీసుకున్న తర్వాత ఇది రక్తంలోని చక్కెరకు విరుగుడుగా పనిచేస్తుంది.

English summary

Best Foods to Manage Blood Glucose Levels

If you’re suffering from Type 2 Diabetes or are struggling with your weight, chances are your blood sugar levels are a bit out of whack.
Story first published: Saturday, June 13, 2015, 11:06 [IST]
Desktop Bottom Promotion