For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ పేషంట్స్ కి హెల్తీ అండ్ టేస్టీ జ్యూస్

By Swathi
|

డయాబెటిక్ పేషంట్స్ నోరు కట్టేసుకుని ఉండాల్సిన పరిస్థితి. తీపి పదార్థాలు, ఎక్కువ స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ కూడా తీసుకోలేని విధంగా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కఠిన నియమాలు పాటిస్తేనే.. షుగర్ వ్యాధి కంట్రోల్ లోకి వస్తుంది. అయితే.. మీకు కూడా శుభవార్త ఉంది. డయాబెటిక్ పేషంట్స్ తీసుకోగలిగిన జ్యూస్ లు ఉన్నాయి.

డయాబెటిక్ పేషంట్స్ కి తీపి వార్త... మీరు తీసుకోగలిగే లో షుగర్ ఫుడ్స్..డయాబెటిక్ పేషంట్స్ కి తీపి వార్త... మీరు తీసుకోగలిగే లో షుగర్ ఫుడ్స్..

ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. కాబట్టి.. మీరు నోరు తీపి చేసుకునే అవకాశం దొరికింది. మరి ఎక్కువ స్వీట్ లేకుండా.. హెల్తీ జ్యూస్ లు తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావం లేకపోగా.. మీ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఈ హెల్తీ జ్యూస్ లు తయారు చేసుకోవడం కూడా తేలికైన పనే. ఇంకెందుకు ఆలస్యం.. డయాబెటిక్ పేషంట్స్ తీసుకోగలిగే.. హెల్తీ జ్యూస్ లు ఏంటో తెలుసుకుందామా..

క్యారట్, టొమాటొ, దోసకాయ

క్యారట్, టొమాటొ, దోసకాయ

1 క్యారెట్, 1 దోసకాయ, 2 బాగా పండిన టమోటాలు తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇది స్వీట్ నెస్ ని ఇస్తూనే డయాబెటిక్ పేషంట్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్స్ తియ్యని రుచిని ఇస్తే.. దోసకాయ, టొమాటొ యూరిన్ లో షుగర్ ని తగ్గిస్తాయి.

క్యారట్, గ్రీన్ యాపిల్, సెలరీ, స్పినాచ్

క్యారట్, గ్రీన్ యాపిల్, సెలరీ, స్పినాచ్

2 క్యారెట్స్, 1 గ్రీన్ యాపిల్, 1 కట్ట స్పినాచ్, కొంచెం సెలరీ తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి జ్యూస్ తయారు చేసుకుని డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవాలి. స్పినాచ్ లో కార్బొహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. స్పినాచ్, సెలరీ కలపితే మరింత మంచిది. గ్రీన్ యాపిల్స్, క్యారెట్స్ ఈ జ్యూస్ కి మంచి పోషకవిలువలు, టేస్ట్ ని అందిస్తాయి.

క్యాప్సికమ్, కాకరకాయ

క్యాప్సికమ్, కాకరకాయ

సగం క్యాప్సికమ్, సగం కాకరకాయ, సగం దోసకాయ, సగం గ్రీన్ యాపిల్, కొంచెం సెలరీ తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. క్యాప్సికమ్, కాకరకాయ మెటబాలిజం స్థాయిని రెగ్యులేట్ చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు.. బ్లడ్ గ్లూకోజ్ ని తగ్గిస్తాయి.

బ్రొకోలి

బ్రొకోలి

బాగా శుభ్రం చేసిన కొద్దిగా బ్రొకోలి, 3 నుంచి 4 క్యారట్స్, 2 గ్రీన్ యాపిల్స్ తీసుకుని మిక్సీ పట్టి జ్యూస్ తయారు చేసుకుని డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవాలి. బ్రొకోలిలో ఉండే పోషకాలు.. కణాల డ్యామేజ్ కి కారణమయ్యే ఎంజైమ్స్ ని అరికడతాయి. దీనికి క్యారట్స్, యాపిల్స్ మిక్స్ చేయడం వల్ల.. స్వీట్ నెస్ వచ్చి.. జ్యూస్ డయాబెటిక్ పేషంట్స్ కి టేస్టీగా ఉంటుంది.

క్యారట్

క్యారట్

6 చిన్న సైజు క్యారట్స్, 1 బ్రొకోలి, 3 సెలరీ ఆకులు, 1 చిన్న దోసకాయ కలిపి.. జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవడం వల్ల యూరిన్ లో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది.

టమోటా

టమోటా

4 బాగా పండిన టొమాటోలు, 1 కప్పు తరిగిన పాలకూర తీసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ తో అనుసంధానమైన కార్డియోవాస్కులర్ రిస్క్ ని టొమాటోలు తగ్గిస్తాయి. సింపుల్ గా తయారు చేసుకునే ఈ జ్యూస్ ద్వారా డయాబెటిక్ పేషంట్స్ అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.

కాకరకాయ, దోసకాయ, నిమ్మ

కాకరకాయ, దోసకాయ, నిమ్మ

రెండు కాకరకాయలు, 1 దోసకాయ, అరనిమ్మకాయ తీసుకోవాలి. కాకరకాయల్లోని చేదుని దోసకాయ, నిమ్మరసం తగ్గిస్తాయి. కాబట్టి ఈ జ్యూస్ తాగితే.. డయాబెటిక్ పేషంట్స్ లో షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు.

English summary

Healthy juice recipes for diabetics: Healthy and Tasty juice recipes for diabetics

Healthy juice recipes for diabetics. There are not much nice and sweet products that diabetics can consume - but there is solution for almost every problem. We collected few recipes for juices that can be consumed by diabetics.
Story first published: Friday, February 26, 2016, 12:03 [IST]
Desktop Bottom Promotion