For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధ్యాహ్న భోజనం తరువాత మీరు బాగా అలిసిపోయినట్లయితే అది డయాబెటిస్ కి సంకేతం కావచ్చు !

మధ్యాహ్న భోజనం తరువాత మీరు బాగా అలిసిపోయినట్లయితే అది డయాబెటిస్ కి సంకేతం కావచ్చు !

|

కొంతమంది ఎంత ఆరోగ్యంగా ఉన్నా, కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వల్ల అలిసిపోయిన భావనను కలిగి ఉంటారు, అవునా ? ఒక వ్యక్తి గొప్ప ఆరోగ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, కొన్నిసార్లు శరీరము అతిగా శ్రమించినప్పుడు (లేదా) మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఆ వ్యక్తి తరచుగా అలసిపోతూ ఉంటారు. ఇది అనారోగ్యాన్ని సూచించేదిగా ఉంటుంది.

నిజానికి, అలసట అనేది ప్రజలను ప్రభావితం చేసే అనేక వ్యాధుల సూచికగా ఉంటుంది. ఈ అలసట పెద్దదిగా (లేదా) చిన్నదిగా; శారీరకంగా (లేదా) మానసికంగానైనా ఉండవచ్చు. ఉదాహరణకు:- ఒక వ్యక్తి తీవ్రమైన తలనొప్పి ఎదుర్కొంటున్నప్పుడు ఆ నొప్పి చివరికి అలసటకు దారితీస్తుంది. ఎవరైతే గుండెజబ్బులు, క్యాన్సర్ & మధుమేహం వంటి ప్రధానమైన వ్యాధులు బారిన పడ్డారో వాళ్ళు తరచుగా అలసటను ఎదుర్కొంటారు.

Feeling Tired At This Particular Time Every Day Can Be A Sign Of Diabetes!

కాబట్టి, ఒక వ్యక్తి తరచుగా కలిసిపోతున్న భావనను కలిగి ఉన్నప్పుడు - దానికి గల కారణాలను గుర్తించటం చాలా కష్టతరంగా ఉంటుంది, ఒక నిర్ధిష్టమైన వ్యాధి కోసం డాక్టర్ వద్ద తనిఖీ చేసుకుంటే తప్ప అలసట చెందుటకు గల పూర్తి కారణాలు బయటపడవు. ఎందుకంటే, అలసట అనేక వ్యాధులను సూచించే సంకేతంగా ఉంటుంది !

డయాబెటిస్ అనేది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒక సాధారణమైన "మెటబాలిక్ డిజార్డరని" మనకి బాగా తెలుసు. ఒక వ్యక్తి ప్రతిరోజూ ఒక నిర్దిష్టమైన సమయానికి అలిసిపోయినట్లుగా భావిస్తే, అది మధుమేహాన్ని సూచించే సంకేతం కావచ్చని ఇటీవల జరిపిన అధ్యయనాలు తెలియజేశాయి.

అలా "ఎందుకు" అనే ప్రశ్నను తెలుసుకోవడానికి ఈ క్రింది విషయాలను పూర్తిగా చదవండి !

అసలు

అసలు "డయాబెటిస్" (మధుమేహం) అంటే ఏమిటి ?

డయాబెటిస్ అంటే, ఇన్సులిన్ హార్మోన్ కారణంగా శరీర రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరగటం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతగా అభివర్ణించవచ్చు. డయాబెటిస్, పూర్తిగా నయం కాబడిన వ్యాధి. కానీ మీరు సరైన సమయంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి వాటి నివారణకు సరైన మందులను వాడటం & మీ జీవనశైలిలో మార్పులను కలిగి ఉండటం మంచిది.

మధ్యాహ్నం వేళలో వచ్చే అలసటకు - డయాబెటిస్కు మధ్య గల సంబంధం :-

మధ్యాహ్నం వేళలో వచ్చే అలసటకు - డయాబెటిస్కు మధ్య గల సంబంధం :-

మనం ముందు చదివినట్లుగా, ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరగబడి ఉంటాయి, అలా ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ప్రేరేపించబడతాయి. కాబట్టి, అలాంటి వ్యక్తి ఒక రోజులో మధ్యాహ్నం 1 గంట - సాయంత్రం 4 గంటల మధ్యలో బాగా అలసిపోతున్నట్లయితే, (ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత) అది మధుమేహ లక్షణాలను సూచిస్తుంది.

ఈ సమయంలోనే ఎందుకు అలసిపోతాట్లరంటే, ఒక వ్యక్తి మధ్యాహ్న భోజనం చేసినప్పుడు - అప్పటికే అతని రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు మరింతగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్న రోగులలో ఇన్సులిన్ హార్మోన్లు తక్కువ స్థాయిలో కలిగి ఉండటంతో, ఈ చక్కెరను ప్రాసెస్ చేయడానికి శరీరం చాలా కష్టపడాలి. ఇది అలసట కలిగిన అనుభూతికి దారితీస్తుంది. ఇలాంటి వారు ఎటువంటి కష్టమైనా పనులను చేయకపోయినప్పటికీ, మధ్యాహ్న సమయంలోనే తీవ్రమైన అలసటను అకస్మాత్తుగా కలిగి ఉంటారు.

డయాబెటిస్ రోగులు, ఒక రోజులో ఏ సమయంలోనైనా ఆహారాన్ని తీసుకున్నట్లయితే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచబడుతున్నందున వెంటనే అలసటకు గురవుతారు. కానీ మధ్యాహ్న వేళలో మీరు భోంచేసిన తరువాత కలిగే అలసట చాలా స్పష్టమైన "మధుమేహ" సూచికగా చెప్పవచ్చు.

మధుమేహం లేనివారిలో, మధ్యాహ్న భోజనం తర్వాత రక్తంలో చాలా తక్కువ మోతాదులో చక్కెర స్థాయిలను కలిగి ఉంటారు కాబట్టి, మధ్యాహ్న భోజనం తర్వాత ఎవరైతే తీవ్ర అలసట కలిగి ఉంటారో వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే, వారు డయాబెటిస్ బారిన పడ్డారని నిర్ధారించుకోవచ్చు.

అయితే, మధ్యాహ్న భోజనం తర్వాత తీవ్ర అలసటకు గురయ్యే లక్షణాన్ని బట్టి ఆ వ్యక్తికి మధుమేహం ఉన్నదని గుర్తించడం సరికాదు. ఈ అలసటతో పాటుగా వేరే ఇతర మధుమేహ లక్షణాలను కలిగి ఉండడం బట్టి ఆ వ్యక్తి మధుమేహ పరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉందని గుర్తించాలి.

భోజనం తర్వాత అలసటను కలిగి ఉన్న వ్యక్తులు ఈ క్రింది తెలిపిన ఇతర మధుమేహ లక్షణాలను కలిగి ఉన్నట్లుగా ముందుగా నిర్ధారించుకోవాలి. అవేమిటంటే,

మధుమేహ లక్షణాలు

మధుమేహ లక్షణాలు

* అమితమైన దాహము

* తరచూ మూత్రవిసర్జన అవ్వడం

* ఆకస్మికంగా బరువు తగ్గటం

* దృష్టిలోపాలు (మసకగా కనిపించడం)

* ఆకలిలో తేడాలు

* రోగనిరోధక శక్తి తగ్గడం

* గాయాలను స్వస్థత పరిచే సామర్థ్యం తగ్గడం

* వ్యాధుల నుండి విముక్తిని పొందే సామర్థ్యం తగ్గడం

* జీవక్రియ పనితీరు మందగించడం

* చికాకు

* చర్మం దురదగా ఉండటం

* తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావటం

* తరచుగా చిగుళ్ల వ్యాధులు సోకడం

* కామేచ్ఛ తగ్గడం / లైంగిక అసమర్ధత (ముఖ్యంగా పురుషులలో)

* చేతులు & పాదాలలో తిమ్మిర్లు ఏర్పడటం

* పొట్టలో పుండ్లు ఏర్పడటం

డయాబెటిస్తో బాధపడేవారు ఏమి చేయాలి ?

డయాబెటిస్తో బాధపడేవారు ఏమి చేయాలి ?

పైన తెలిపిన మధుమేహ లక్షణాలను మీలో ఉన్నట్లుగా గమనించిన తరువాత, తక్షణమే డాక్టర్ని సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ సూచించిన మందులను సక్రమంగా వాడటం ద్వారా మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించబడి, ఈ మధుమేహ లక్షణాలకు మీరు కాస్త దూరంగా ఉంచబడతారు.

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ లక్షణాలను మీరు దూరంగా

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ లక్షణాలను మీరు దూరంగా

వాటితోపాటు అదనంగా, మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ లక్షణాలను మీరు దూరంగా ఉంచబడటానికి సహాయపడుతుంది. అవి,

* చక్కెర (లేదా) గ్లూకోజ్ కంటెంటు లేని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం.

* ప్రతిరోజు మోస్తరు వ్యాయామాలను చేస్తూ, తగినంత శరీర బరువును నిర్వహించడం మంచిది.

* మద్యపానం & ధూమపానం వంటి చెడు అలవాట్లను పూర్తిగా విడిచి పెట్టడం.

* రక్తపోటు & కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉన్నాయని నిర్ధారించుకోవాలి.

* కొవ్వులను & కార్బోహైడ్రేట్ను కనీసం మొత్తంలో తీసుకోవాలి.

* క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మందులను వాడాలి & చక్కెర కలవని పానీయాలను తీసుకుంటూ, అలసట & ఇతర మధుమేహ లక్షణాలపై మీరు పై చేతిని సాధించాలి.

English summary

Feeling Tired At This Particular Time Every Day Can Be A Sign Of Diabetes!

Every individual, no matter how healthy they are, tends to feel exhausted or tired, once in a while, for a number of reasons, right? Even if a person enjoys great health, sometimes, when the body is overworked, or if a person is under a lot of stress mentally, it could lead to tiredness. However, tiredness or exhaustion, when experienced often, can be a sign of ill-health.
Story first published:Tuesday, August 28, 2018, 18:29 [IST]
Desktop Bottom Promotion