మధుమేహం వలన మీ శరీరంలో కలిగే మార్పులు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

మధుమేహం అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఎందుకంటే ఒకసారి మీకు మధుమేహం ఉందని నిర్ధారణ అయ్యాక ఇంక తగ్గడం అనే మాటే ఉండదు. ఇంకా భయంకరమైన నిజం ఏమిటంటే ఇప్పటికేే ప్రపంచం మొత్తం మీద మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 500మిలియన్లు దాటేసింది!

This Is What Diabetes Does To Your Body

వీటన్నిటినీ చూస్తుంటే ఆధునిక జీవనశైలి పుణ్యమా అని పరిస్థితులు ఎంత విషమంగా మారాయంటే, మనం మధుమేహ వ్యాధిగ్రస్తులమో కాదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవడం, ఈ వ్యాధి లక్షణాలు మరియు ప్రభావాలు గురించి తెలుసుకోవడం అనివార్యమయ్యింది.

మధుమేహం వలన మీ శరీరంలో ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!

1. మీ రక్తనాళాలను దెబ్బతీస్తుంది:

1. మీ రక్తనాళాలను దెబ్బతీస్తుంది:

రక్తంలో అధిక చెక్కరల మూలంగా రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి, కాలం గడిచేకొద్దీ వెడల్పు తగ్గి సన్నగా మారిపోతాయి. దీనిమూలంగా గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి మాక్రో వాస్క్యూలర్ సమస్యలు, అవయవ వైఫల్యం వంటి మైక్రో వాస్క్యూలర్ సమస్యలు తలెత్తుతాయి.

నిజానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులలో హృద్రోగ మరణాలు కలిగే అవకాశం నాలుగురెట్లు అధికంగా ఉంటుంది.

 2. నరాలను దెబ్బతీస్తుంది:

2. నరాలను దెబ్బతీస్తుంది:

మధుమేహ వ్యాధిగ్రస్తులలో కాలం గడుస్తున్న కొద్దీ (సుమారుగా నిర్ధారణ జరిగిన 20 సంవత్సరాల తరువాత), రక్తప్రసరణ సరిగ్గా జరగనందున నరాలు దెబ్బతినే అవకాశం (న్యూరోపతి) పెరుగుతుంది. సాధారణంగా చేతులు,కాళ్ళు మరియు వేళ్ళలో స్పర్శ కోల్పోతారు కనుక, ఆ ప్రదేశాలలో గాయాలైనా తెలుసుకోలేరు.

3. మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు:

3. మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు:

అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, 2011లో మూత్రపిండాల వైఫల్యము జరిగిన వారిలో 44% మధుమేహం తో ముడిపడిన మైక్రో వాస్క్యూలర్ సమస్యలు ఉన్నవారే!

మధుమేహం వలన మూత్రపిండాలలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనిమూలంగా అవి రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడకట్టడంలో విఫలమౌతాయి. చివరికి ఈ పరిస్థితి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

4. అంధత్వాన్ని కలుగజేస్తుంది:

4. అంధత్వాన్ని కలుగజేస్తుంది:

ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి ముఖ్య కారణం డయాబెటిక్ రెటినోపతి కాకపోయినప్పటికి, మధుమేహం వలన తలెత్తే మైక్రో వాస్క్యూలర్ సమస్యలు రెటీనాలో వివిధ పొరల వాపు మరియు అవి విడిపోవడానికి కారణమవుతాయి.

డయాబెటిక్ రెటినోపతి వలన ఏర్పడిన అంధత్వానికి చికిత్స లేదు.

5. గ్యాస్ట్రోపారెసిస్ కలుగచేస్తుంది:

5. గ్యాస్ట్రోపారెసిస్ కలుగచేస్తుంది:

ఆహార నాళంలో ఆహారం యొక్క సహజ కదలికలు నెమ్మదించడాన్ని వైద్య పరిభాషలో గ్యాస్ట్రోపారెసిస్ అంటారు. అధిక కాలం నుండి మధుమేహసమస్యతో బాధ పడేవారిలో నరాలు దెబ్బతినడం వలన ఈ పరిస్థితి నెలకొంటుంది.

కడుపులోని తిప్పడం, కడుపుబ్బరం, వాంతి వచ్చేట్టు అనిపించడం మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి.

6. మీ శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుంది:

6. మీ శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుంది:

డయాబెటిస్ తో ముడిపడిన మైక్రో వాస్క్యూలర్ సమస్యలు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు వలన శృంగార జీవితం ప్రభావితం అవుతుంది. పురుషులలో లైంగిక పటుత్వం తగ్గే అవకాశం మూడురెట్లు పెరుగుతుంది.

స్త్రీలలో యోని పొడిబారటం, శృంగారం పట్ల అనాసక్తి మరియు కలయిక సమయంలో నొప్పి కలుగుతాయి.

7. గాయాలను తగ్గనివ్వదు:

7. గాయాలను తగ్గనివ్వదు:

మధుమేహంతో తలెత్తే మైక్రో వాస్క్యూలర్ సమస్యల మూలంగా శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీనిమూలంగా శరీరంపై, ముఖ్యంగా కొనలకు అయిన గాయాలు మానడానికి చాలా కాలం పడుతుంది.

అంతేకాక చెక్కెరలు అధికంగా ఉన్న కణజాలాలలో బాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది, గాయాలను పుండ్లుగా మరియు గ్యాంగ్రేన్ గా మారుస్తుంది.

8. మీ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది:

8. మీ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది:

మధుమేహ నిర్ధారణ జరిగిన కొత్తలో చర్మం పొడిబారడం, నల్లని ప్యాచ్ లు ఏర్పడటం (ఎకాంథోసిస్ నైగ్రన్స్) వంటివి జరుగుతాయి. కాలం గడుస్తున్నకొద్దీ వీరిలో చర్మంపై బొబ్బలు, అథ్లెట్స్ ఫుట్ మరియు స్టయిస్, వంటి సమస్యలకు లోనవుతారు.

కొంతమందిలో చర్మము పై గోధుమరంగులో, గుండ్రని పొలుసులు వంటివి తయారవుతాయి. ఇది డయాబెటిస్ యొక్క తీవ్రతను తెలిపే లక్షణం.

English summary

This Is What Diabetes Does To Your Body

The complications of diabetes take a long time to manifest, sometimes years, but most of them are caused by damage to blood vessels. This leads to macrovascular complications, like heart attack and stroke, and microvascular complications, like diabetic retinopathy, kidney failure, and sexual dysfunction.