For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైప్ -2 డయాబెటిస్ సమస్య ఉన్నవారు, ఉదయాన్నే అల్పాహారంలో గుడ్డు తినాలంట!!

టైప్ -2 డయాబెటిస్ సమస్య ఉన్నవారు, ఉదయాన్నే అల్పాహారంలో గుడ్డు తినాలంట!!

|

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు అనేక ఇతర సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏమి తినాలి, ఏది తినకూడదు అనే విషయంలో చాలా గందరగోళం ఉంటుంది. అందువల్ల, వారు తినే కొన్ని ఆహారాల ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగవచ్చు. టైప్ -2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.

కానీ శరీరం ఈ ఇన్సులిన్ ఉపయోగించడానికి సాధ్యపడదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పిలవబడుతుంది. ఇటీవలి జరిపిన పరిశోధన ప్రకారం, టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారు ఉదయం అల్పాహారంలో గుడ్లు తినవచ్చు. అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదని పరిశోధనలో తేలింది. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Eggs for Breakfast May Benefit Type-2 Diabetic Patients,

ఈ అధ్యయనం యొక్క నివేధిక అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించబడింది.

కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు అల్పాహారం తిన్న తర్వాత పెరుగుతాయి. టైప్ 2 డయాబెటిస్ కూడా ఉదయం ఇన్సులిన్ నిరోధకతతో సంబంధం కలిగి ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు కొన్ని అల్పహారాలు ధాన్యం, వోట్మీల్, టోస్ట్ మరియు కొన్ని పండ్లు వంటి. ఇందులో అధిక స్థాయిలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయని అధ్యయన రచయిత జోనాథన్ లిటిల్ చెప్పారు.

Eggs for Breakfast May Benefit Type-2 Diabetic Patients

అల్పాహార సమయంలో ఎక్కువగా శరీరానికి చక్కెర తీసుకోవడం పెరిగింది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్‌ వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వ్యక్తి తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు అధిక కొవ్వు ఉన్న స్నాక్స్ తీసుకుంటే, రోజంతా చక్కెర తీసుకోవడం తగ్గుతుందని జోనాథన్ చెప్పారు. ఉదయం మీరు తినే అల్పాహారంలో గుడ్డు తింటే, డయాబెటిస్‌తో పాటు మరికొన్ని ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి.

Eggs for Breakfast May Benefit Type-2 Diabetic Patients,

ఈ పరిశోధన కోసం టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకొని ఉన్నవ్యక్తులను పరీక్షించారు. మొదటి రోజు అతనికి అల్పాహారంలో ఆమ్లెట్ ఇచ్చారు. మరుసటి రోజు అల్పాహారంలో కోసం వారికి వోట్మీల్ మరియు పండ్లను ఇచ్చారు. దీని తరువాత మధ్యహ్నానం మరియు రాత్రి సాధారణ భోజనం చేయించారు. ఈ చిన్న సాధనంను రోగి పొట్టకు అలవాటు చేయబడినది.

Eggs for Breakfast May Benefit Type-2 Diabetic Patients

ఇది ప్రతి ఐదు నిమిషాలకు వారి చక్కెర ప్రమాణం తెలుసుకోసుకోవడం జరుగుతుంది. దీనితో పాటు ఆకలి, కడుపు నిండినట్లు అనిపించడం మరియు స్వీట్లు తినాలనే కోరిక వంటి కొన్ని ఇతర సమస్యలను కూడా పరీక్షించారు. తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు అధిక కొవ్వు ఉన్న అల్పాహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి మరియు రోజంతా మీ చక్కెర పరిమాణం తక్కువ తీసుకోవడం జరుగుతుంది.

English summary

Eggs for Breakfast May Benefit Type-2 Diabetic Patients

A diabetic patient has to be very careful about what to eat and what to avoid. The patient has to worry about the effect of the food consumed on his or her blood sugar levels. A type-2 diabetes patient makes insulin but the body of the patient is not able to use the insulin which is termed as insulin resistance. According to a recent study, a person with type-2 diabetes should consume eggs for breakfast. The study suggests that a high fat, low carb breakfast is better for a diabetic patient. It will help the patient to control blood sugar levels throughout the day.
Story first published:Monday, October 14, 2019, 12:50 [IST]
Desktop Bottom Promotion