Latest Updates
-
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్!
జిమ్ కి వెళ్ళకుండానే ఫిట్ నెస్!

2. సహ ఉద్యోగుల వద్దకు నడచి వెళ్ళి మీ అవసరాలు తెలుపండి. వారిని మీ వద్దకు పిలిచే అలవాటుకు స్వస్తి చెప్పండి. ఇంటర్ కాంలు, ఫోన్లు అవసరాన్ని పని వేగాన్నిబట్టి ఉపయోగించండి.
3. స్కూటర్ లేదా కారు ఉపయోగిస్తున్నారా? పార్కింగ్ లాట్ దగ్గరలోనే వుండాలని భావించకండి. దాని కోసం వెతుక్కుంటూ మైండ్ పాడు చేసుకోకండి. ఎక్కడ సరి అయిన పార్కింగ్ ప్లేస్ దొరికితే అక్కడ వాహనం నిలిపి, వాహనం పార్క్ చేసిన తర్వాత కొద్దిపాటి నడక చేయండి. ఈ చర్య శరీరానికి, మైండ్ కు కూడా చాలా మంచిది.
4. మీకవసరమైన కిరాణా షాప్ కొనుగోలుకు ఇంటిలో వున్న పిల్లవాడిని పంపద్దు. కొద్దిపాటి మార్పు కొరకై మీకై మీరే కిరాణా షాప్ కు నడచి వెళ్ళి కొనుగోలు చేయండి.
5. ఇంట్లో పెంపుడు కుక్కను పెంచండి. దానిని కనీసం రోజుకు రెండు సార్లు బయటకు తిప్పాల్సి వుంటుంది. ఆ పని మీరే చేసి దానితో కలసి బయట నడవండి. ఇది ఒకటే కాక, పెంపుడు కుక్క వలన వచ్చే ప్రయోజనాలు అధికంగా కూడా వుంటాయి.
6. ఇంట్లో పని వారు వున్నారా? ఉంటే వారికి కనీసం వారానికి ఒక రోజు సెలవు ఇవ్వండి. స్వంతంగా డిష్ క్లీనింగ్, స్వీపింగ్, ఫ్లోర్ మాపింగ్ లాంటివి చేయండి. ఫ్లోర్ మాపింగ్ మీ నడుముకు, తొడ భాగాలకు చాలా మంచిది. అంతే కాక, పనివారు అప్పటి వరకు సరిగా చేయని ఇంటిపనులు మీరు చక్క పెట్టారన్న సంతోషం మిగులుతుంది.
7. సెల్ ఫోన్ మాట్లాడాలా? నడుస్తూ మాట్లాడండి. తోటి వారికి, లేదా ఇంటిలో వారికి మీ ఫోన్ సంభాషణ చికాకు కలిగించదు. మీకు నడచినట్లూ వుంటుంది.
8. ఇంటి వద్దే పని చేసుకుంటారా? కనీసం ఇంటినుండి ఒక్క సారైనా బయటకు రండి. పార్కుకో లేక ఒక కప్పు కాఫీకో!
9. ప్రభుత్వం అందుబాటులో వుంచే బస్సులు, మెట్రో మొదలైన రవాణా ఉపయోగించండి. మీకు కొంత శారీరక శ్రమ కలుగగలదు. అదే సమయంలో ఇంధనాన్ని సేవ్ చేసిన వారు కూడా అవుతారు.
10. అన్నిటికి మించి యాక్టివ్ గా వుండాలనే భావనను తరచుగా గుర్తు చేసుకోండి. మీ పనులు మీరే చేసుకోండి. ఎప్పటికపుడు శరీరాన్ని చురుకుగా వుంచండి. అవసరపడిన చోటల్లా నడవండి. ఆనందంగా ఉన్నారా? డ్యాన్స్ చేయండి. చురుకైన జీవన శైలి కలిగి వుండండి. దీనితో మీరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండిపోగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
