Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
గుండె నొప్పులను అరికట్టే ఎండు ఫలాలు!

1. బాదం పప్పులు - ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి.
2. జీడిపప్పులు - ప్రతిరోజూ జీడిపప్పులు తింటే....డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది. జీడిపప్పులో ఓలెక్ యాసిడ్ వుంటుంది ఇది గుండెకు మంచి కొవ్వు. వీటిలో జింక్, కాపర్ మెగ్నీషియం, ఐరన్ మొదలైనవి వుండి ఎర్రరక్త కణాలను, గుండె కండరాలను బలపరుస్తాయి.
3. పెకాన్స్ - వీటిలో విటమిన్లు అదికంగా వుండి రక్త నాళాలలో కొవ్వు డిపాజిట్లను కరిగిస్తుంది. గుండెకవసరమైన 15 రకాల విటమిన్లు వుంటాయి. విటమిన్లు ఎ,బి మరియు ఇ ఫోలిక్ యాసిడ్, మినరల్స్, కాల్షియం, పొటాషియం కూడా వుంటాయి. వీటిలో వుండే మెగ్నీషియం, జింక్ లు గుండెకు మాత్రమే కాక ఎముకలను, కండరాలను కూడా బలపరుస్తాయి.
4. పిస్తా: వీటిలో కావలసినంత పీచుపదార్ధముంటుంది. గుండెకు చాలా మంచిది. అధిక కొవ్వు కరిగిస్తుంది. కేన్సర్ ను నిరోధిస్తుంది. ప్రొటీన్లు వుండటం వలన మంచి ఎనర్జీ లభిస్తుంది.
5. వాల్ నట్స్ - వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
