మీరు ఎంత ఆరోగ్యవంతులుగా వున్నారు?

By B N Sharma

Aerobics
ఏ ఆరోగ్య సమస్యా లేనంతవరకు ప్రతి ఒక్కరూ తాము ఆరోగ్యంగా వున్నామని భావిస్తారు. ఇక ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం మొదలైనవాటిపై ఏ మాత్రం శ్రధ్ధ వహించరు. అయితే, జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే మీ శరీరం కొన్ని అనారోగ్య లక్షణాలను ముందుగానే మీకు సూచిస్తుంది. కొన్ని ఏళ్ళు గడిచిపోయినా శరీరానికి పూర్తి మెడికల్ చెక్ అప్ అనేది చేయించం కనుకే అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా మీద పడతాయి. శరీరం అనారోగ్య లక్షణాలను సూచించే మార్పులు గమనించండి.

పింక్ రంగు గోళ్ళు
- మీ గోళ్ళ రంగు మీ ఆరోగ్యం గురించి ఎంతైనా చెపుతుంది. గోళ్ళపై తెల్లని మచ్చలు, చారల వంటివి కనపడితే డయాబెటీస్ చెక్ చేయించాలి. గోళ్ళు పసుపు రంగులో వుంటే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.
మూత్రం రంగు - శరీరంలో నీరు తగినంత వుందా? లేదా? అనేది మీ మూత్రం రంగు చెపుతుంది. గాఢ పసుపురంగు వుంటే మీరు తగినంత నీరు తాగటం లేదని తెలుస్తుంది. మూత్రం వాసన, లేదా రక్తం కలిగి వుంటే తీవ్రమైన అనారోగ్య సమస్య అని చెప్పాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
సుఖ విరోచనం - ప్రతి రోజూ ఒకే సమయానికి సుఖ విరోచనం కావాలి. మీరు అప్పుడపుడూ మలం విసర్జిస్తున్నా లేదా అది ఎక్కువ మెత్తగా లేదా గట్టిగా వున్నా సమస్య వున్నట్లే. తగినంత పీచు పదార్ధం మీరు శరీరానికి అందించటంలేదు. పోషకాహార నిపుణులను సంప్రదించి తగిన మార్పులు ఆహారంలో చేయండి.
గాఢ నిద్ర - నిద్ర సరిగా రాకుంటే శరీరం రిస్కులో వుందని త్వరలో గుండె సంబంధిత లేదా ఇతర వ్యాధులు వస్తాయని చూపుతుంది. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి. త్వరగా నిద్రించండి. మంచి విశ్రాంతి ఆరోగ్యానికి అత్యవసరం.
బాడీ మాస్ ఇండెక్స్ స్ధాయి - శరీర బరువు వుండవలసిన దానికంటే తక్కువ లేదా ఎక్కువ వుండరాదు. శరీర కొవ్వు పరీక్షలు చేయించండి. ఆరోగ్యకరమైన 40 ఏళ్ళ పురుషుడు 8-19 శాతం, 41 సంవత్సరాల వయసు మించినవారు 11-22 శాతం రేంజిలో శరీర కొవ్వు, కలిగి వుండాలి.
గుండె చప్పుడు - నిమిషానికి మీ గుండె 70 లేదా అంతకు తక్కువ సార్లు కొట్టుకుంటే ఆరోగ్యం. అంతకంటే అధికమైతే రిస్కులో వున్నట్లే.
20 పుష్ అప్ లు - ఒకే సారి మీ శరీరం 20 పుష్ అప్ లు వరుసగా చేయగలిగితే శరీరం ఆరోగ్యంలోనే వున్నట్లు పరిగణించవచ్చు. అంతకు తక్కువయితే....దానికి తగ్గ ధారుఢ్యం పెంచుకోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, December 19, 2011, 9:59 [IST]
Desktop Bottom Promotion