Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
సలాడ్లు తింటే కూడా బరువు తగ్గచ్చు!

బ్రేక్ ఫాస్ట్ - కూరగాయలు తరిగే టైమ్ లేకుంటే, పండ్లు, కాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ ఆహారాలు కూడా సలాడ్ ఆహారమే. వీటికి కొవ్వు తక్కువగా వుండే ఛీజ్ లేదా క్రీమ్ వంటివి కూడా కలిపి తినవచ్చు. లేదా వెజిటబుల్ శాండ్ విచ్ కూడా మంచి ఆహారమే.
లంచ్ - ఉడికించిన కూరల సలాడ్ లేదా తాజాగా కోసిన పచ్చి కూరలు ఆరోగ్యం, కడుపు నిండుతుంది. వీటిలో కొద్దిపాటి బ్లాక్ పెప్పర్, జీలకర్ర వంటివి కూడా వేయవచ్చు. ఈ ఆహారానికి కేరట్లు, దోసకాయలు, బ్రక్కోలి, టమాటాలు, కేబేజి ఆకులు వంటివి పనికొస్తాయి. దీనితోపాటు ఒక ఉడికించిన గుడ్డు, ఎండు ఫలాలు, క్రీము, స్ట్రాబెర్రీ, నిమ్మ, బెర్రీ, వాటర్ మెలన్ వంటి పండ్లు కూడా బాగా పనిచేస్తాయి.
సాయంత్రం స్నాక్స్ - సలాడ్ ఆహారం కిందే....తాజా పండ్లు, నట్స్ వంటివి పాలు లేదా పెరుగుతో కలిపి తినేయండి. నిమ్మజాతి పండ్లు బాదంపప్పులు, పెరుగులో ముంచుకు తింటే చాలు. పండ్లరసం లేదా వెజిటబుల్ సూప్ కూడా తాగండి.
డిన్నర్ - దీనిలో ఉడికించిన వెజిటబుల్ సలాడ్ తినాలి. తేలికగా జీర్ణం అవటమే కాక పోషకాలు కూడా అందిస్తుంది. పాలు లేదా సూప్ కూడా తీసుకుంటే డిన్నర్ పూర్తయినట్లే బ్రౌన్ రైస్, ఉడికించిన గుడ్డు కూడా మంచి పోషకాలనిస్తాయి. నిద్రకు కనీసం 3 లేదా 4 గంటల ముందు డిన్నర్ తీసుకోండి.
ఈ రకమైన ప్యూర్ సలాడ్ డైట్ తింటే, అధిక బరువు నియంత్రించి స్మార్ట్ గా తయారైపోవచ్చు. ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
