Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బలమైన కండలు కావాలంటే?

ప్రొటీన్లు - ప్రొటీన్లు అధికంగా వుండే పాల వంటి ద్రవాహారాలే కాక, ఎమినో యాసిడ్లు వుండే ప్రొటీన్ ఆహారాలు శరీరాన్ని పెంచి ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. లీన్ బీన్స్, ఆల్మండ్స్, బచ్చలి, తోటకూరవంటి ఆకు కూరలు, చేప, లీన్ మీట్, లీన్ గొడ్డుమాంసం, పీతలు ఇతర ప్రొటీన్లు వుండే ధాన్యం గింజలు తినాలి
విటమిన్లు - ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వుంటే బలమైన కండలు ఏర్పడతాయి. శరీరం ధృఢంగాను వుంటుంది. రోజువారీ చర్యలలో శరీరంలో ఇవి ఎప్పటికపుడు తగ్గిపోతూ మిమ్మల్ని బలహీనంగాను, సోమరిగాను చేస్తాయి. కనుక వీటిని మరల భర్తీ చేయాలంటే గుడ్లు, మష్రూమ్స్, ఉల్లిపాయలు, మాంసం, టర్కీ లివర్, చిలకడదుంపలు, బచ్చలి, బ్రక్కోలి, కేరట్లు మొదలైన ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారాలు తీసుకోండి.
కార్బోహైడ్రేట్లు - ఆరోగ్యవంతమైన శరీరంలో బలమైన కండరాలు, ఎముకలు వుంటాయి. శరీర బరువు సమానంగా వుండాలి. ఇది కండరాలు వదులు కాకుండా చేస్తుంది. బెణుకులవంటివి వుండవు. ఒమేగా 3 ఫా్యటీ యాసిడ్లు, మోనో శాట్యురేటిడ్ కొవ్వులు శరీరాన్ని పటిష్టంగా వుంచి బలమైన కండలు, ఎముకలు ఏర్పరుస్తాయి. దీనికిగాను కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే, గోధుమ బ్రెడ్, పస్తా, తెల్లటి బియ్యం, బార్లీ, కార్న్, ఓట్మీల్, పైన్ ఆపిల్, స్ట్రాబెర్రీలు, ఖర్చూరాలు వంటివి తినాలి.
గ్లూటామైన్ - గ్లూటామైన్ అధికంగా వుండే ఆహారం గట్టి కండలు, ఎముకలు కలిగిస్తుంది. గ్లూటామైనో లో వుండే ఎమినో యాసిడ్లు శరీరానికి సహజ ఉప ఆహారంగా పనిచేస్తాయి. గ్లూటామైన్ ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. కేబేజి, ఎర్ర బచ్చలి, పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం, చికెన్, పోర్క్, చేపలలో ఈ పదార్ధం బాగా వుంటుంది.
మీ ఆహారంలో ఈ పదార్ధాలు చేరిస్తే త్వరగా మీ శరీరం కండలను, గట్టి ఎముకలను సంతరించుకుంటుంది. ప్రతిరోజూ తగినంత శరీరానికి అందించాలి. ఇది మీ శరీరంలోని మలినాలను విసర్జించి శరీర అధిక ఉష్ణోగ్రతలనుండి కాపాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
