Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
అధిక బరువును -పొట్టను తగ్గించే ఐదు అద్భుతమైన ఆహారాలు...
బరువు తగ్గాలి, పొట్ట తగ్గించాలనుకునేవారిలో చాలామంది ఒక్కసారిగా ఆహారం మానేస్తుంటారు. దీనివలన చాలా తక్కువ సమయంలో బరువు తగ్గవచ్చనేది వారి ఆలోచన. అయితే ఇది సర యిన విధానం కాదంటున్నారు వైద్యనిపుణులు. ఆహారాన్ని మానేయటం వలన శరీరంలో గ్లయికోజెన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది కూడా ఒక రకం కార్బోహైడ్రేటే. ఇది తగ్గిపోవటం వలన శరీరం నీటిని కోల్పోతుంది. ఆహారం మానేయటం వలన తగ్గే బరువు ఇలా శరీరంలో కోల్పోయిన నీరే. ఇక ఆ తరువాత అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బరువు తగ్గడానికి కానీ, పొట్ట తగ్గించడానికి కానీ కొన్ని ఆహారాలు తరచూ తీసుకొంటుంటే బరువు తగ్గవచ్చు
కారణాలు: అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం, తక్కువగా మాత్రమే శారీరకం గా శ్రమపడటం స్ధులకాయానికి దారితీస్తుంది. తాము ఆహారం ద్వార తీసుకోనే శక్తికి, వివిధ పనుల ద్వార ఖర్చు పెట్టే శక్తికి మథ్య సమతుల్యం లేనప్పుడు స్థూలకాయం లేదా అధిక బరువు ఏర్పడుతుంది. ఆహరంలో క్రొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా స్థూలకాయం వస్తుంది. వ్యక్తి సంక్లిష్టమైన నడవడిక, మానసిక పరిస్ధితి కూడా అతను అధికంగా ఆహారం తీసుకోవటానికి కారణం అవుతాయి. ఫలితంగా ఇది స్ధూలకాయానికి దారితీస్తుంది. కారణం ఏదైనా బరువు తగ్గడానికి కొన్నిఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆ ఆహారాలేంటో చూద్దాం..

అవొకాడో
అవొకాడో తింటుంటే వయసు మీద పడుతున్నా యవ్వనంగానే కనిపిస్తారు. ఇందులో ఫ్యాట్ ఎక్కువని చాలా మంది అపోహపడుతుంటారు కాని, అవొకాడోలో ఉండే ఫ్యాట్‌లో ఎక్కువ భాగం మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్. దీనిని ఆరోగ్యకరమైన ఫ్యాట్‌గా పరిగణిస్తారు. కాబట్టి నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులోని ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు చర్మం పొడిబారడాన్ని నివారించి నిత్యయవ్వనంగా ఉంచుతాయి. అవొకాడోలో ఉండే 'సి', 'ఇ' విటమిన్లు యాంటి ఏజింగ్ ఎలిమెంట్స్‌గా పనిచేసి వార్ధక్యాన్ని దూరం చేస్తాయి.

గుడ్డు
ఎన్నో సంవత్సరాలనుండి గుడ్డు కొలెస్టరాల్ ఇస్తుందని అది మీ రక్తనాళాలను అడ్డగిస్తుందని వింటూ వున్నారు. అయితే, అది మీ బరువు ఎలా తగ్గిస్తుందనేది పరిశీలిచండి. జాగ్రత్తగా గమనిస్తే మీ పోషకాహార నిపుణుడు బరువు తగ్గాలనే ప్రణాళికలో గుడ్డు తప్పక చేర్చి వుంటాడు. దానికి కారణం? గుడ్లు హానికరమైతే, పోషకాహార నిపుణులు ఎందుకు వ్రాస్తారు? మరి బరువు తగ్గటంలో గుడ్డు పాత్ర పరిశీలించండి. అవసరమైన ఎమినో యాసిడ్లు - ఎమినో యాసిడ్లనేవి ప్రొటీన్లకు ప్రధానం. గుడ్డులో వుండే ల్యూసిన్ అనేది ఒక ఎమినో యాసిడ్. ల్యూసిన్ బరువును తగ్గించటంలో సహకరిస్తుంది. తెల్లగుడ్డు - మీరు ప్రొటీన్ డైట్ లో వుంటే, తెల్లగుడ్డు మీకు ప్రధానంగా కావలసిందే. వీటిలో వుండే కేలరీలు మీ బరువు పెంచవు. బలాన్నిస్తాయి. కనుక మీ వర్కవుట్లకు సహకరిస్తాయి. కనుక బరువు త్వరగా తగ్గాలంటే, సన్నబడాలంటే, గుడ్డు వాడాల్సిందే.

బాదం
దీనిలో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. కార్బొహైడ్రేటులు, శాచ్యురేటెడ్, మోనోశ్యాచురేటెడ్ క్రొవ్యులు, బీ కాంప్లెక్స్, ఈ విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, జింక్ మూలకాలు తగిన మోతాదులో ఉంటాయి. పరిమాణంలో చిన్నదయినా బాదం పప్పులో మనకు మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. రోజుకు 23 గింజలు తింటే శరీరానికి సరిపడా పోషకపదార్థాలు అందుతాయని చెబుతారు. మధుమేహ రోగుల్లో గ్లూకోజ్ స్థాయి నియంత్రణకు బాదం పప్పు ఉపయోగపడుతుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. అంద రూ అనుకుంటున్నట్టు బాదంపప్పులో కొలెస్ట్రాల్ అసలుండదు. అన్ని సీజన్లలోనూ దీన్ని నిరభ్యంతరంగా తినొచ్చు.

సాల్మన్
సాల్మన్ ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్ ఫిష్ ప్రొటీన్ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీవక్రియను బాగా మెరుగపరచడమే కాకుండా శరీరంలోని రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. కాబట్టి మధ్యహానపు భోజనంలో సాల్మన్ ఫిఫ్ సలాడ్ ను బ్లాక్ పెప్పర్ లేదా తులసి వంటి మూలికలు లేదా మసాలాలతో కలిపి తీసుకోవచ్చు. సాల్మన్ సలాడ్స్ కి గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలను చేర్చితే ఇక అంతకంటే ఆరోగ్యకరమైన ఆహారం మరొకటుండదు.

బెర్రీస్
మనకు తెలిసినంత వరకూ బెర్రీస్ అత్యధిక న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారం. ఇది బరువును తగ్గించుటలో సూపర్ గా పనిచేస్తుంది. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు.



Click it and Unblock the Notifications











