Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
శరీరంలో కొవ్వతగ్గించుకొని త్వరగా స్లిమ్ అవ్వాలంటే...
నలభై ఏళ్లు దాటాక చాలా మంది మహిళలు, పురుషులు లావెక్కుతూ ఉంటారు. కొందరిక పొట్ట వస్తుంది. కారణం వారి శరీరంలో అదనంగా కొవ్వు వచ్చి చేరడమే. ఇలా చేరిన కొవ్వును కరిగించాలంటే వ్యాయామం చేయక తప్పదు. అయితే కేవలం వ్యాయామాల వల్లే కొవ్వు మొత్తం కరిగిపోదు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను ఈ కొవ్వును కరిగించేందుకు తోడ్పడతాయి. మరి అవేమిటో చూద్దామా.... చాలామంది లావెక్కడం గమనించగానే వెంటనే డైటింగ్ మొదలెడతారు. ఎడాపెడా కడుపును మాడ్చేస్తారు. మరొకొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కొద్దిగా తీసుకొని లంచ్ కు బ్రేక్ ఇచ్చేస్తారు. అయితే శరీరానికి ఇది ఏమాత్రం అలవాటు లేనిది కావడం వల్ల నీరసం ముంచుకొస్తుంది. దీంతో లాభం లేదనుకుని మధ్య మధ్యలో జ్యూసో, మరేదైనా పానీయమో తాగేస్తారు.

నిమ్మరసం
కొవ్వు తగ్గించాలను కొనే వాళ్ళకు నిమ్మరసం బెస్ట్ అయితే తీపి కలిగిన పానీయాలకంటే మంచినీళ్ళు తాగడమే ఉతమమని నిపుణులు

వాల్ నట్స్
ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడో, సినిమా హాల్లో వెండితెరను వీక్షిస్తున్నప్పుడో చిప్ప్ తినడం చాలా మందికి అలవాటు.

దాల్చిన చెక్క
కాఫీ లేదా టీలో పంచదార బదులు కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల తీపికి తీపి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

గ్రనోలా బార్స్
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద అధిక పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే రెండింతల కొవ్వు కరిగిపోతుందని మియామి

సాల్మన్ ఫిష్
కేవలం 90గ్రాముల కేన్డ్ సాల్మన్ ఫిష్ తినడం ద్వారా మీ శరీరానికి రోజంతా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా డి విటమిన్
1. నిమ్మరసం: కొవ్వు తగ్గించాలను కొనే వాళ్ళకు నిమ్మరసం బెస్ట్ అయితే తీపి కలిగిన పానీయాలకంటే మంచినీళ్ళు తాగడమే ఉతమమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై కాలిఫోర్నియాలో 240 మంది మహిళలపై అధ్యయనం జరిపిన న్యూట్రిషనిస్ట్ లు ఇతర తీపి పానీయాలకంటే మంచినీళ్ళు మంచివని తేల్చారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూనే రోజు మొత్తంలో వీలైనప్పుడల్లా మంచినీళ్లు తాగడం వల్ల ఏడాదికి అదనంగా ఒక కిలో వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నీళ్ళలో కూడా కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే మరీ మంచిదని, మరో కిలో కొవ్వు కరిగిపోతుంది.
2. వాల్ నట్స్: ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడో, సినిమా హాల్లో వెండితెరను వీక్షిస్తున్నప్పుడో చిప్ప్ తినడం చాలా మందికి అలవాటు. ఇలా చిప్స్ తినే బదులు నట్స్ తినడం మంచిదని, అందులోనూ వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. వాల్ నట్స్ ఉండే ఒమేగా 3ఫాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వును కరించడంలో బాగా తోడ్పడతాయి. రోజూ 8 నుంచి 10 వాల్ నట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గిపోతుందని వారు అంటున్నారు.
3. దాల్చిన చెక్క: కాఫీ లేదా టీలో పంచదార బదులు కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల తీపికి తీపి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకంటే, మీరు వేసుకునే ఒక టీస్పూన్ చక్కరలోనే 16కాలరీలు ఉంటాయని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. మరి రోజుకి కనీసం నాలుగైదుసార్లు టీ, కాఫీలు తాగే వారు ఎందరో!ఈ లెక్క వారి శరీరంలోకి ఒక్కటి, కాఫీల ద్వారానే రోజూ 80కేలరీల వరకూ చేరిపోతున్నాయి. పంచదారకు బదులు దాల్చిన చెక్క పొడి వేసుకోవడం ద్వారా ఈ కేలరీలు శరీరంలోకి చేరకుండా అడ్డుకట్ట వేయడమేకాకుండా గుండెను కూడా పదిలంటా కాపాడుకోవచ్చు. నిత్యం అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడి తినడం వల్ల కొలెస్ట్రాల్ ద్వారా గుండెకు కలిగే చేటును చాలా వరకూ తగ్గిస్తుంది.
4. గ్రనోలా బార్స్ : ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద అధిక పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే రెండింతల కొవ్వు కరిగిపోతుందని మియామి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లిసాడోఫిమాన్ పేర్కొంటున్నారు. రిఫైన్డ్ ఫుడ్ (పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహారం)రక్తంలోని చక్కెర నిల్వలను మరింత పెంచుతాయని, దీనికన్నా ప్రతిరోజూ 4గ్రాముల గ్రనోలా బార్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.
5. సాల్మన్ ఫిష్: కేవలం 90గ్రాముల కేన్డ్ సాల్మన్ ఫిష్ తినడం ద్వారా మీ శరీరానికి రోజంతా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా డి విటమిన్, 180మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తాయి. శరీరానికి సరిపడా విటమిన్ డి గనుక లభించకుంటే ఆకలిని కలిగించే లెప్టిన్ హార్మోన్ తన విధులు సరిగా నిర్వర్తించదట. చేపలు కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే చేపలు ట్యూనా, సాల్‌మన్, స్వార్డ్‌ఫిష్, ప్లాడర్.



Click it and Unblock the Notifications
