Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు!

మొక్కజొన్న కండెలలోని ఆరోగ్య ప్రయోజనాలు
1. జీర్ణక్రియను పెంపొందిస్తుంది - మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు వుంటే అది మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది.
2. మొక్క జొన్నలో కావలసినన్ని లవణాలు లేదా మినరల్స్ వుంటాయి. పసుపు రంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతాయి.
3. చర్మ సంరక్షణ - మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా వుంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే, దీనిలో వుండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, లేదా ర్యాష్ లను కూడా తగ్గిస్తుంది.
4. రక్తహీనతను అరికడతాయి. రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్త కణాల సంఖ్య ఐరన్ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది.మరి మీరు తినే స్వీట్ మొక్కజొన్న విటమిన్ బ మరియు ఫోలిక్ యాసిడ్ లు కలిగి మీలో రక్త హీనత లేకుండా చేస్తుంది.
5. కొల్లెస్టరాల్ నివారణ చేస్తాయి. శరీరంలో లివర్ కొల్లెస్టరాల్ ను తయారు చేస్తుంది. రెండు రకాల కొల్లెస్టరాల్ తయారవుతుంది. అవి హెచ్ డిఎల్ మరియు చెడు కొల్లెస్టరాల్ అయిన ఎల్ డిఎల్. నేటి రోజులలో కొవ్వు అధికంగా వుండే ఆహారాలు చెడు కొల్లెస్టరాల్ ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ఫ్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొల్లెస్టరాల్ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికంచేస్తాయి.
6. గర్భవతులకు ఈ ఆహారం ప్రధానం - గర్భవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి వుండాలి. దీనిలో వుండే ఫోలిక్ యాసిడ్ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్క జొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.
కనుక మీ ఆహారంలో తగినంత మొక్కజొన్న ఆహారంచేర్చి తినండి. దానివలన వచ్చే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వివిధ రోగాలను తగ్గించుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
