Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
‘లీడర్’ భామ రిచా గంగోపాధ్యాయ ఫిట్ నెస్ సీక్రెట్
తెలుగు, తమిళ సినిమాల్లో సరికొత్త రూపంతో ఒక్కో మెట్టూ ఎక్కేస్తున్న రిచా గంగోపాధ్యాయ తనకు తానే డైటీషియన్. ఎవరైనా స్లిమ్ గా, ఫిట్ గా ఉండేందుకు మూడు సూత్రాలు పాటించాలంటుంది. నిజానికి ది చాలా సింపుల్. ముందుగా చేయాల్సిందల్లా రాత్రి భోజనం ఏడు నుండి ఎనిమిది గంటలోపే ముగించేసేయాలి. రాత్రి వేళ శారీరక జీవక్రియ నెమ్మదిస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. యుఎస్ లో ప్రజలు చాలా త్వరగా డిన్నర్ చేసేస్తారు. ఇండియాలో ప్రజలు రాత్రి తొమ్మిది గంటలయితే కానీ భోజనం చేయరు.
ఇక రెండో సీక్రెట్: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏడు నుండి ఎనిమిదిలోపే తినేయాలి. అప్పుడు శారీరక మెటబాలిజం ఊపు అందుకుంటుంది. దాంతో రోజంతా హుషారుగా ఉండేందుకు జీవక్రియ బాగా పనిచేస్తుంది. ఉదయం ఎంత త్వరగా ఎంత ఎక్కువ మోతాదులో బ్రేక్ ఫాస్ట్ ముగిస్తే అంత మంచిది.
మూడో సీక్రెట్: మంచినీళ్ళు వీలయినంత ఎక్కువగా తాగడం. నీళ్ళు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావించడం సరికాదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలన్నీ వెలికి వెళ్ళిపోతాయి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటినైనా తాగుతుండాలి. ఈ మూడూ పాటిస్తుంటే, ఫిట్ నెస్ దక్కినట్లే నాజూగ్గా తయారవుతారు. అని తన పిట్ నెస్ సీక్రెట్ ను బయటపెట్టింది లీడర్ భామ రిచా గంగోపాధ్యాయ.

అంతే కాదు రీసెంట్ గా అందం పెంచుకోవడానికి అతివల కోసం హైదరాబాద్ లో బ్యూటీ స్పాన్ ఏర్పాటు చేసారు. అతివల అందానికి మరింత మెరుగులు దిద్దే బ్యూటీ సెలూన్స్ పెరుగుతున్నాయి. ఫ్యాషన్‌ప్రియులకు కావాల్సిన అన్ని సేవలను అందిస్తూ ఇవి ఆదరణ పొందుతున్నాయి. విభిన్న రకాల స్పా సేవలను అందిస్తున్న వాటిల్లో ఒకటైన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ బ్రాంచీని కళ్యాణ్ నగర్‌లో ఏర్పాటు చేసింది. ఈ సెలూన్‌ను సినీనటి రిచా గంగోపాధ్యాయ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిచా మాట్లాడుతూ అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనన్నారు. అందం రెట్టింపుకోసం బ్యూటీ సెలూన్స్ ఎంతో ఉపయోగమన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
