Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
మీకు ఇష్టమైనవి తింటూనే డైట్ ప్లాన్ చేసుకోవడమెలా...!?

సన్నగా కనబడడానికి, సన్నబడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్ ల చుట్టూ తిరుగుతున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.
తప్పనిసరిగా తినాలి: శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.
ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు. కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది. కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.
ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి (నిద్రపోయే సమయంలో తప్ప). కడుపును ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి.
ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి. తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి. దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.
రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి. తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి. 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి. అంటే రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.
శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు. అయితే తెల్లవారుజామున నడిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వుంటాయి. మీడైట్ ప్లాన్ ను తరచూ మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించాలి. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్ ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications