మీ శరీరాన్ని స్లిమ్ గా ఉంచే నాలుగు అద్భుతమైన ఆహారాలు...!

ఈ బిజీ బిజీ జీవితంలో డబ్బు సంపాద, ఈజీగా లైఫ్ ఎంజాయ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంతో పోల్చుకొంటే ప్రస్తుతం కష్టపడి పనిచేసే వాళ్ళే కరువైయ్యారు. తక్కువ సంపాదించినా పర్వాలేదు. ఒళ్ళును మాత్రం కష్టపెట్టలేకపోతున్నారు. మనకు ఎంత సంపద ఉంది? నెలకు ెంత జీతం వస్తుంది? అనేది ముఖ్యం కాదు మనం ఎంత ఆరోగ్యంగా, నాజాగ్గా ఉన్నామన్నదే ముఖ్యం. మన ఆరోగ్యాన్ని శాసించేది ఆహరమే. శరీరానికి సరిపడినంత ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అందంగా, సన్నగా నాజూగ్గా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది మహిళలు డైటింగ్ చేస్తుంటారు. డైటింగ్ చేయడం వల్ల సన్నబడరు. డైటింగ్ చేసేవారు శరీరంలో ఉండే మేలుచేసే కొలెస్టరాల్, గుండెను రక్షించే ప్రొటీన్లు తగ్గిపోతాయి. తత్ఫలితంగా గుండెను ఒత్తిడి పెరిగి సమస్యలు వచ్చే అవకాశముంది.

Eat Four Super Foods To Stay Slim...!

అందుకే కడుపుకు పట్టినంత తిని ఒంటికి పట్టినంత పని చేయాలని అనేవారు పెద్దవారు. డైటింగ్ చేయడం అనువసరమని హాయిగా అన్ని ఆహారపధార్థాలను తినమని వైద్యులు సలహాలిస్తున్నారు. శరీరానికి కావాలసినంత వ్యాయామం వుంటే ఏ విధమైన డైటింగ్ చేయకుండానే అందంగా, నాజూగ్గా తయారవ్వచ్చు.. కాబట్టి అటు ఆరోగ్యం, ఇటు అందం మెరుగు పరుచుకోవాలంటే న్యూట్రిషన్ ఫుడ్ ను అధికంగా తీసుకోవల్సి ఉంటుంది. న్యూట్రిషన్ అధికంగా ఉండే నాలుగు ఆహారాలు ఫ్యాట్ తక్కువగా ఉండి, నాజూగ్గా తయారవ్వడానికి ఎంతగా సహాయపడుతాయంటే...? చెంపలేనంతగా సహాయపడుతాయి. అవేంటో చూద్దాం...

బెర్రీస్ : మనకు తెలిసినంత వరకూ బెర్రీస్ అత్యధిక న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారం. ఇది బరువును తగ్గించుటలో సూపర్ గా పనిచేస్తుంది. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతు, నాజూగ్గా మారుతారు. వీటిని డైరెక్ట్ గాను, జ్యూస్, సలాడ్స్ ల రూపంలోనూ తీసుకోవచ్చు.

యాపిల్స్: ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం. యాపిల్స్ లో లోఫాట్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల శరీరాన్ని నాజూగ్గా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.

టమోటో: మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందం గా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణం గా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరు తో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో "లైకోపీన్'అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచేస్తుంది. శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది. బరువును తగ్గించే గుణము : టమాటో లు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు . టమాటో లు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను తక్కువగా తింటారు . టమాటో లు తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని, ఇతర పదార్దములు గాని తిననీయదు ... కాబట్టి ఆకలి మీద నియంత్రణ , తక్కువ ఆహారము తీసుకోవడం వల్ల బరువు పెరగరు.

చాక్లెట్: బరువును తగ్గించే పదార్థాల్లో చాక్లెట్ అంటే అందరీ ఆశ్చర్యం కలగవచ్చు, కానీ పెద్దవిగా ఉండే డార్క్ చాక్లెట్స్ తప్పనిసరిగా బరువు తగ్గించడానికి ఉపయోగపడుతాయి. మరియు నాజూగ్గా శరీరాన్ని మొయింటైన్ చేయడానికి సహయపడుతుంది. డార్క్ చాక్లెట్ మీద కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత అందులో ఉండే ‘కోకా' ఆరోగ్యకరమైన, నాజూకైన శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అద్భుతంగా సహాపడుతుందని తేల్చారు. డార్క్ చాక్లెట్ గుండె సమర్ధవంతంగా పనిచేయడానికి తర్వాత ఆకలిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి చింతించ కుండా రోజు మార్చి రోజూ ఒక డార్క్ చాక్లెట్ తింటూ నాజూగ్గా తయారవ్వండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion