Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
ఆహారం, వ్యాయామాలు గుండె పోటును నివారిస్తాయా!

దీనికి కారణం అనారోగ్య జీవన విధానాలు మరియు తీసుకునే ఆహారం చెడుగా వుండటం అని చెప్పాలి. కనుక మీరు గుండె జబ్బులనుండి ప్రత్యేకించి గుండెపోటు నుండి దూరంగా వుండాలంటే, దిగువ తెలుపబడే ఆహారాలను క్రమం తప్పకుండా తినాలి.
గుండెపోటును అరికట్టే ఆహారాలు -
దానిమ్మపండు - గుండె జబ్బును అరికట్టే ప్రధాన ఆహారాలలో దానిమ్మ పండు మొదటి స్ధానం ఆక్రమిస్తుంది. ఎర్రగా వుండి మంచి రసాన్నిచ్చే ఈ పండు గుండె జబ్బులకు బాగా పనిచేస్తుంది. దీనిలోవుండే విటమిన్ సి గుండెమంటను తగ్గిస్తుంది. గుండె మంటే తరచుగా గుండె జబ్బులు కలిగిస్తుంది. కనుక ప్రతిరోజూ ఒక గ్లాస్ తాజా దానిమ్మ రసం తీసుకుంటే, మీ శరీరంలోని రక్తం బాగా ప్రవహించి తక్కువ రక్తపు ఒత్తిడి కలిగిస్తుంది.
వెల్లుల్లి - సాధారణంగా మన ఇండ్లలో వుండే వెల్లుల్లి గుండెజబ్బులకు బాగా పనిచేస్తుంది. గుండెజబ్బు రోగులకు వైద్యులు క్రమం తప్పకుండా వెల్లుల్లి తినమని చెపుతారు. వెల్లుల్లి వాసన చాలా ఘాటుగా వుంటుంది. వెల్లుల్లి, మీ రక్తపోటును నియంత్రించటమే కాదు. బ్లడ్ షుగర్ స్ధాయిలను కూడా డయాబెటిక్ మరియు డయాబెటిక్ రోగులు కానివారికి కూడా నియంత్రిస్తుంది. ఈమసాలా దినుసును ప్రతిరోజూ వాడి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు లేకుండా చేసుకోవచ్చు. వెల్లుల్లి మీ శరీరంలోని రక్త ప్రసరణ పెంచుతుంది. చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలను తగ్గిస్తుంది.
తీపి మొక్కజొన్న - తీపి మొక్క జొన్నలో క్రోమియం అధికంగా వుంటుంది. ఇది గుండె జబ్బులను దూరం చేస్తుంది. దీనిలో విటమిన్ బి 9 గా చెప్పబడే ఫోలేట్ కూడా వుంటుంది. ఇది గుండె పోటును మరియు బ్లాకేజీలను రాకుండా చేస్తుంది.
కివి పండు - ఈ పండు మీ శరీరానికి చాలా ఆరోగ్యకరమైంది. గుండె ఆరోగ్యంగా వుండాలంటే, ప్రతిరోజు ఒక కివి పండు తినండి. దీనిలోని పీచు, యాంటి ఆక్సిడెంట్లు మీ శరీరంలోని చెడు కొల్లెస్టరాల్ ను తగ్గిస్తాయి. ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మినరల్స్ వుంటాయి. అవి మీ బ్లడ్ ప్రెషర్ తగ్గించి గుండెను బ్లాకేజీలనుండి కాపాడతాయి.
బెర్రీలు - బెర్రీలలోవుండే పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడి గుండెను కాపాడతాయి. మీలోని కణాలు చెడిపోకుండా చేస్తాయి. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. అవి రక్తపోటును తగ్గిస్తాయి. మంచి కొల్లెస్టరాల్ స్ధాయినిపెంచుతాయి. బ్లూ బెర్రీలు గుండె మంటను తగ్గిస్తాయి. మరియు గుండెను బలపరుస్తాయి.
గుండెకు ఆరోగ్యం ఇచ్చే ఈ పండ్లు మీరు ఆహారంలో చేర్చటమేకాక మీరు ప్రతిరోజూ మీలోని కొవ్వును ఖర్చు చేసేందుకు, చెడు కొల్లెస్టారాల్ తగ్గించుకునేందుకు శరీరానికి కొన్ని వ్యాయామాలు చేయాలి. వ్యాయామం అంటే అది మీ రక్తనాళాల సాగతీతను పెంచుతుంది. అవయవాలలో రక్త ప్రసరణ అధికం చేస్తుంది.
గుండె జబ్బులు తగ్గించే వ్యాయామాలు
- నడక, ప్రత్యేకించి వేగంగా నడవటం
- జాగింగ్, జాగింగ్ ప్రారంభంలో మెల్లగా చేయాలి
- సైకిలింగ్, స్పీడు సైక్లింగ్ చేయాలి. జిమ్ లో చేసినా మంచిదే.
- స్విమ్మింగ్, రెగ్యులర్ స్ట్రోకులు
ఈ కొద్దిపాటి వ్యాయామాలు ప్రతిరోజూ చేస్తే మీ గుండెపోటు అరికడతాయి. ఈ వ్యాయామాలు చేసేముందు తప్పక వైద్య సలహా పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
