Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
తేలికగా జీర్ణం మరియు అలసటను పోగొట్టే ఆహారాలు!

లెమనేడ్ - ఇందులో వుండే షుగర్ నుండి గ్లూకోజ్ శరీరానికి వెంటనే అందుతుంది. శరీరంలో సాయంత్రానికి ఆవిరి అయిపోయిన ద్రవాలను, ఖనిజలవణాలను భర్తీ చేసేందుకు ఇందులో వుండే ఉప్పు కూడా తోడ్పడుతుంది. అన్నిటికంటే ప్రధానమైన విటమిన్ సి నిమ్మకాయ నుండి లభిస్తుంది.
అరటిపండు - అలసిన శరీరానికి గ్లూకోజ్ ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది. రక్తంలోని హేమోగ్లోబిన్ కవసరమైన ఐరన్ అందిస్తుంది. ఎంతో శక్తి కలిగి భావిస్తారు.
ఛీజ్ - సాధారణంగా బరువు తగ్గాలంటూ డైటింగ్ లోవుండి నీరసపడేవారు కొద్దిపాటిగా ఉత్తేజాన్నిచ్చేందుకుగాను తింటారు. ఇది సరి కానప్పటికి, ఛీజ్ ఎంతో శక్తినిచ్చేదని భావించవచ్చు. శక్తినిచ్చే హార్మోన్లను ఇది రిలీజ్ చేస్తుంది.
స్ట్రాబెర్రీలు - తక్షణ శక్తికి ఈ పండును మించింది లేదు. అధికమైన పీచు, అధిక ఎనర్జీ, అధిక విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కలబోసిన ఈపండు తక్షణ శక్తినిస్తుంది.
గ్రీన్ టీ - నరాలను జివ్వును ఉత్తేజపరచాలంటే గ్రీన్ టీ ఎంతో మంచిది. సాధారణ కాఫీ, టీల కంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. లోపలి భాగాలను శుభ్రపరచి అధికమైన శక్తినివ్వటంలో గ్రీన్ టీ ని మించిన పానీయం లేదు.
తెల్ల చిక్కుడు గింజలు - వీటి రసం శరీరంలోని ట్రిగ్లీసెరైడ్స్ ను తగ్గించేందుకు కూడా సహకరిస్తుంది. కీళ్ళ అరుగుదలను నివారిస్తుంది. కార్బోహైడ్రేట్లను నిలుపు చేసి శరీరం లావు ఎక్క కుండాను, రక్తనాళాలు గడ్డకట్టకుండాను చేస్తుంది. శరీరంలో కొవ్వును బాగా లాగేస్తుంది. వీటివలన ఏర్పడే కొన్ని సమస్యలు పరిశీలిస్తే, కార్బో హైడ్రేట్లను విచ్ఛిన్నం కాకుండా చేస్తుంది కనుక జీర్ణవ్యవస్ధపై ప్రభావం చూపి గ్యాస్ సమస్యలు ఏర్పరుస్తాయి. గుండెమంట, డయోరియా కూడా కలిగించే గుణాలున్నాయి. త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి తెల్ల చిక్కుడు గింజల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్లను అరికడుతుంది. శరీరంలో ఒక ఎంజైముతో కలసి అనవసరమైన గ్లూకోజుగా మారకుండా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
