Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
లైంగిక వాంఛలను రేపే హైదరాబాదీ హలీమ్ !

ఒక్క సారి పాతకాలం సంఘటనలు నెమరువేసుకుంటే....దశాబ్దాల కిందట యునాని వైద్యులు, ఆనాటి హకీం లనబడే డాక్టర్లు లైంగిక జీవనం మెరుగుపడాలంటే హలీమ్ తినమని వైద్య సలహా ఇచ్చేవారుట. హలీమ్ తయారీలో వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ లేదా ఎండుఫలాలు వాడతారు. ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. రంజాన్ మాసంలో పేరొందిన ఈ హలీమ్ వంటకం హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతంలోను విరివిగా బజార్లలో, మార్కెట్లలో, వివిధ రెస్టరెంట్లలో లభ్యమవుతుంది. హలీమ్ వంటకం తింటే లైంగిక జీవితం మరింత మెరుగుగా వుంటుందని దీనిని తినేవారు చెపుతారు.
అయితే, ఇంత వరకు దీనికి ఏ రకమైన సైంటిఫిక్ వివరణ రుజువుకాలేదని కూడా తెలుపుతారు. వంటకం తిన్నవారు మాత్రం అది తమ వ్యక్తిగత అనుభవమని, హలీమ్ లైంగికంగా వాంఛలను కలిగిస్తుందని తెలియజేస్తుంటారు. హలీమ్ తయారీలో ఎండు ఫలాలు మాత్రమే కాక, మాంసం, నెయ్యి, మసాల దినుసులు కూడా వినియోగిస్తారు. కనుక బలాన్ని చేకూర్చే ప్రొటీన్లు దీనిలో అధికం. డ్రై ఫ్రూట్స్ గా బాదం, ఖర్జూర్, అంజీర్, వంటివి వేస్తారు. అంజీర్ పండు పురుషులలో వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. హలీమ్ తింటే యవ్వనం పొంగి పొర్లుతుందని పురుషులు భావిస్తారు.
తయారీ దారులకంటే కూడా హలీమ్ ఔషధ గుణాలు, దాని ప్రయోజనాలు ముందుగా వైద్యులకే సుపరిచితంగా పూర్వీకులు చెపుతారు. ఇన్ని మంచి ప్రయోజనాలున్న హలీమ్ వంటకం...ఎంత తిన్నా ఎప్పటికపుడు కొత్తగా తినాలనే అనిపిస్తుంది. దీని తయారీ కూడా తేలికేనని, అతి ఎక్కువ పరిమాణాలలో ఒకే సారి చేసినప్పటికి నిల్వ వుండి తినటానికి రుచికూడా పోకుండా వుంటుందని చెపుతారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న హలీమ్ తినే , బహుశ నాటి నవాబులు తమ శృంగార జీవితంలో అనేకమంది రాణులను అలరించి వుంటారు కాబోలు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
