Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
బరువు తగ్గేందుకు మెంతుల వాడకం!

మరి ఔషధ ప్రయోజనాలున్న మెంతులు బరువు ఎలా తగ్గిస్తాయి?
1. మెంతులులో పీచు అధికం. రక్తపోటు నియంత్రిస్తాయి. బ్లడ్ షుగర్ నియంత్రిస్తాయి. చాలా సేపు ఆకలిలేకుండా కూడా చేస్తాయి.
2. మెంతులలో కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫలితంగా మీకు అధిక బరువు చేరదు.
3. బరువు తగ్గాలంటే మీరు కేలరీలు తగ్గించాలి. మెంతులు చాలా తక్కువ కేలరీలు కలిగి వుంటాయి.
మెంతులు ఎలా తినాలి?
- ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. వేడినీటితో ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినాలి. ఇవి మీలోని వ్యర్ధ పదార్ధాలను విసర్జించటమే కాదు బరువును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. లేదా వేడి నీటితో వాటిని నమిలివేయవచ్చు.
- మెంతి పొడి - మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్ గా చేసుకొని చల్లబడినతర్వాత తినవచ్చు. గాలి చొరని డబ్బాలో ఈ మెంతి పొడి వుంచాలి. పెరుగు తో కలిపి తినవచ్చు. లేదా మసాలా దినుసులుగా వాడవచ్చు.
- ఫెను గ్రీక్ టీ - మెంతి పొడిని గ్రీన్ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. ఖాళీ కడుపుతో ఉదయం వేళ తాగితే, అది ఆకలిని నియంత్రిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా మెంతులను బరువు తగ్గించేందుకు వాడవచ్చు. ఇది ఎంతో తేలికగా ఆచరించకల విధానం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
