Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఒక్క గ్లాసెడు మజ్జిగలో జీర వేసుకు తాగితే...!

జీలకర్ర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎలా వుంటాయనేది గమనిస్తే....
సాధారణ జలుబు - జీలకర్రలో వుండే యాంటీ సెప్టిక్ గుణాలు ఫ్లూ లేదా సాధారణ జలుబును తగ్గించేందుకు బాగా తోడ్పడతాయి. ఇది మీలోని రోగ నిరోధకతలను మెరుగుపరుస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి బాగా మరిగించి ఆ మిశ్రమానికి కొద్దిపాటి తేనె కలిపి తాగితే, జలుబు వెంటనే తగ్గుతుంది.
రక్త హీనత - జీలకర్ర విత్తనాలలో ఐరన్ అధికం. ఆక్సిజన్ శరీరంలోని భాగాలకు బాగా అందాలంటే రక్తం ఎంతో అవసరం. మరి ఆ రక్తంలో వుండే హెమోగ్లోబిన్ ఏర్పడాలంటే ఐరన్ కావాలి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. రక్తహీనత లేదా ఎనీమియా ఏర్పడిన వారిలో రక్తంలో తక్కువస్ధాయిలో హెమోగ్లోబిన్ వుంటుంది. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, టీనేజ్ పిల్లలలో ఈ పరిస్ధితి వస్తుంది. వీరికి ప్రతిరోజూ జీలకర్ర వంటకాలలో కలిపి అంటే, పరోటాలు, చపాతీలు, కూరలు, సూప్ లు, రైస్, వంటి తిండ్లలో కలిపి తినిపిస్తే రక్తహీనతనుండి వీరు దూరం అవుతారు.
జీర్ణక్రియ - జీర్ణక్రియ ప్రాధాన్యత అందరకు తెలిసిందే. సాధారణంగా భోజనం తర్వాత మన దేశంలో చాలామంది జీలకర్రను ఎంతో కొంత మొత్తంలో నోటిలో వేసుకొని చప్పరించటం చూస్తూ వుంటాం. తిన్న పదార్ధాలకు జీర్నక్రియ బాగా జరగాలంటే, అజీర్ణం వంటివి ఏర్పడకుండా వుండాలంటే, ఈ జీలకర్ర తినటం ఎంతో మేలు చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం చేస్తారు.
మహిళలలో వచ్చే అపసవ్య రుతుక్రమాలకు జీలకర్ర చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మొలలు బాధిస్తున్నాయా? అయితే జీలకర్ర తగుమాత్రంగా ప్రతిరోజూ తీసుకోండి. దీనిలో వుండే పీచు పదార్ధం ఎంతో మలబద్ధకాన్ని పోగొడుతుంది. నేటికి విరేచనం సాఫీగా జరగాలంటే మనదేశంలోని చాలా ప్రాంతాలలో జీలకర్రను ఉప్పుతో కలిపి తినటం చూస్తూనే వుంటాం.
కనుక ఇంతటి ఆరోగ్యాన్ని అందించే జీలకర్రను మీ వంటలలో తప్పక వాడి ప్రయోజనం పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
