Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
ఉపవాసంలో... అధిక శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ ప్రధానం:
తక్కువ పరిమాణంలో ఉండి, కొద్దిసేపట్లోనే తినగలిగి ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు నట్స్. ఎత్తులకు ఎక్కే పర్వతారోహకులు, స్కీయింగ్ చేసే క్రీడాకారులు వంటి వారు తమతో నట్స్‌నే ఆహారంగా ఉంచుకుంటారు. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమించుకుని ఎక్కువ రుచికంగానూ, బలవర్థకంగానూ ఉండటం వల్ల వీటిని తమ ఆహారంలో ఎక్కువగా ఉపయోగించుకుంటుంటారు. తెల్లవారు జామున ‘సహార్' లో తీసుకునే ఆహారంలో తగినన్ని డ్రై ఫ్రూట్స్, పాలు, మాంసం, గోధుమ రొట్టెలు తీసుకుంటారు. కేవలం ఆహారం, రొట్టెలు మాత్రమే తీసుకుంటే వాటి ప్రభావం కేవలం రెండు, మూడు గంటలకే పరిమితం. 12గంట పాటు ఆహారం, నీరు తీసుకోకుండా ఉండేందుకు ఇబ్బందే. అందుకే డ్రై ఫ్రూట్స్ కు ప్రాధాన్యం ఇస్తారు.

బాదాంలో: ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. వైటమిన్-ఇ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదాం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్‌ఫ్లమేషన్ ఉంటే బాదాం తినడం మంచిది. అప్పుడు అందులోని ఒమెగా-3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. బాదం వంద గ్రాములకు 4.9శాతం ప్రోటీన్లు, 1.9శాతం ఐరన్ ఉంటుంది.
పిస్తాలో: పిస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, ల్యూటిన్, జియాగ్జాంథిన్ అనే కెరొటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
పల్లీలు: మనం పల్లీలను తరచూ తింటూనే ఉంటాం. పల్లీల్లో ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వందగ్రాములకు 25శాతం ప్రోటీన్ లు, 40శాతం కొవ్వు, ఆరు శాతం ఐన్ ఉంటుంది. 570క్యాలరీల శక్తి నిస్తాయి.
జీడిపప్పు: 100గ్రాముల 596క్యాలరీల శక్తి లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
