Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ప్రయాణాలలో తేలికైన ఆహారాలు తినండి!

1. ప్రయాణించేటపుడు, కొద్దిపాటి డ్రైఫ్రూట్స్ లేదా వేరుశనగ పప్పు లేదా ఇతర సహజ ఆహారాలను వెంట వుంచుకోండి. బయటకనపడే వాటికి ఆకర్షించబడినపుడల్లా వీటిని తినండి. మీ ఆకలి తీరుతుంది. ఆరోగ్యంగానూ వుంటుంది.
2. ఒకవేళ బయట వస్తువులు తినాలనిపిస్తే, వేడి బఠాణీ లేదా బటర్ లేకుండా స్వీట్ కార్న్ లేదా దోసకాయ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, కొబ్బరి బోండాం, అరటి పండు వంటివి తిని మీ ఆరోగ్యం కాపాడుకోండి.
3. భోజనం ఏం చేయాలి? మీరే వండుకునేట్లు కొన్ని పదార్ధాలు, ఒక గిన్నె తీసుకు వెళ్ళండి. కొద్దిపాటి ఉడకపెట్టిన కూరలు, వాటితో రాగి ముద్ద లేదా నూనె లేని రొట్టెలు వేడిగా తింటే బాగుంటాయి. కూరలు ఉడికించిన నీటితోనే రాగి ముద్ద తయారు చేయవచ్చు. అన్నం లేదా కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే ఆహారాలు తీసుకోకండి.
4. విమాన ప్రయాణాల్లో కూడా మీకు ఛాయిస్ ఇస్తారు. సలాడ్లు, పండ్లు వంటివి తినండి. వేయించిన పదార్ధాలు వద్దు.
5. మైండ్ ఖాళీగా వుంటే కనపడేవి తినాలనిపిస్తుంది. కనుక చక్కటి మ్యూజిక్ వింటూ, ఒక పుస్తకం చదువుతూ లేదా సినిమా చూస్తూ ప్రయాణించి మంచి ఆహార ప్రణాళిక అమలు చేయండి.
6. ఎంత నడవగలిగితే అంత నడవండి. ఎస్కలేటర్లు, లిఫ్టులు కాక, వీలు అయినపుడల్లా మెట్లు ఎక్కండి. వీలైనన్ని ప్రదేశాలు చూడండి. ఇది మిమ్మల్ని చురుకుగా ఎపుడూ చిన్నవారుగా వుండేలా చేస్తాయి.
ఈ రకమైన ఆరోగ్యకర ఆహారాలు, మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడి నీరు, పదార్ధాలు మొదలైనవి తీసుకోకుండా మీరు మంచి ఆరోగ్యంగా వుండి ఏమీ తేడాలు రాకుండా చేస్తాయి. అదే సమయంలో వీలైనంత నడకను కూడా ఆచరించటంతో శరీరానికి తగిన వ్యాయామం కూడా చేకూరుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
