Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బలమైన కాళ్ళకు వ్యాయామాలు!

సులభమైన కాలి కండరాల వ్యాయామం!
కండరాలను బలపరచటానికి చేసే వ్యాయామం అంటే...స్ట్రెచింగ్. అంతే...ఎంతో తేలికైన వ్యాయామం. కాళ్ళ పిక్కల కండరాలు బలపడాలంటే ప్రతిరోజూ జిమ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటిని ఇంటిలోనే చేసుకొటూ ఆరోగ్యంగా వుండవచ్చు.
ప్రధానంగా రెండు రకాల స్ట్రెచింగ్ లున్నాయి. రెండూ కూడా ఏ పరికరాలు లేకుండానే చేయవచ్చు.
వాల్ స్ట్రెచ్ - గోడకు 10 అంగుళాల దూరంలో నించోండి. ఒక కాలిముందు మరోకాలు పెట్టండి. మీ మోకాలును తిన్నగా గోడవైపుకు వంచండి. మీరు కదలకుండా గోడవైపుకు మోకాలును పుష్ చేయాలి. మీ కాలిలో వచ్చే ఒత్తిడి కండరం బలపడటానికి చేసే వ్యాయామమని గ్రహించండి.
స్కిప్పింగ్ - చిన్నపుడు మనమంతా స్కిప్పింగ్ చేసిన వారమే. చాలా ఏళ్ళ తర్వాత మొదటి సారి చేస్తున్నట్లయితే, కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. అందరూ స్కిప్పింగ్ తేలికనుకుంటారు. ఆనందిస్తారు. కాని అది చాలా శ్రమతో కూడిన వ్యాయామం. ప్రతిరోజూ చేస్తూ వుంటే మీ పిక్క కండరాలు బలపడి శరీరమంతా తేలికవుతుంది. అధిక బరువు వున్నవారికి ఇది ఒక మంచి వ్యాయామం.
సిటింగ్ స్ట్రెచ్ - ఈ సాగే వ్యాయామానికి మీరు నేలపై కూర్చోండి. కాళ్లను మీ ముందుకు చాపండి. మీ పాదాల అరికాల్ళను అరచేతులతో పట్టుకోండి కాళ్ళను బయటకు నెడుతూ వుండండి. పిక్క కండరాల నొప్పులేమైనా వుంటే మాయమవుతాయి.
శరీరం చురుకుగా కదులుతూ ఆరోగ్యంగా వుండాలంటే, కాలి పిక్క కండరాలకు బలం పట్టటం ఎంతో ప్రధానం. ప్రతిరోజూ అధిక సమయం పాటు కూర్చుని పనులు చేయటంతో శారీరకంగా బలాన్ని సంతరించుకోవటం వెనుకబడిపోతోంది. కనుక. ప్రతిరోజూ ఉదయం వేళ లేక సాయంత్రాలు ఒక్క గంట ఏ పరికరాలు అవసరంలేని ఇట్టి వ్యాయామాలు చేస్తే శరీరం చక్కని ఫిట్ నెస్ సంతరించుకొంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
