Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు!
వండర్ పండు... దీన్ని తింటే ఎన్నో ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్యాన్నిచ్చే ....కివి పండు!
కివి పండుకు పేర్లు చాలా వున్నాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై రట్జర్స్ యూనివర్శిటీ కి చెందిన డా. పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులోఅధిక పోషకాలుంటాయని స్టడీ తెలిపింది. కివి పండులో ఇన్ని పోషకాలుండటానికి కారణం ఏమిటి అనేది చూడండి.

కివి పండుతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ సి - కివి పండులో విటమిన్ సి అధికం. ఆరెంజస్ లో కంటే కివి పండులో విటమిన్ సి రెండు రెట్లు వుంటుంది. రోజులో తినవలసిన పోషకాలకు ఒక కివి పండు తింటే చాలని స్టడీ తెలుపుతోంది. కివి పండు శ్వాస సంబంధిత ఆస్త్మా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కివి పండు కనీసం వారానికోసారి తిన్న పిల్లలకు తినని వారికంటే 44 శాతం తక్కువ దగ్గు, జలుబు సమస్యలకు గురయ్యారని స్టడీ తెలిపింది.
పొటాషియం - అరటిపండులో ఎంత పొటాషియం వుందో అంత కివి పండులో వుంది. అరటిపండుతో పోలిస్తే కేలరీలు కూడా ఈ పండులో తక్కువే. కేలరీలు తక్కువుండటంతో గుండెకు ప్రయోజనకరంగా సోడియం కూడా తక్కువే. సోడియం రక్తపోటు నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
విటమిన్ ఇ - విటమిన్ ఇ అధికంగా వుండే ఆహారాలలో కొవ్వులు కూడా అధికమని మనకు తెలుసు. కాని కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ అధిక యాంటీ ఆక్సిడంట్లను అందించి గుండె ఆరోగ్యం కాపాడుతుంది.
ఫోలిక్ యాసిడ్లు - కివి పండు లో ఫోలిక్ యాసిడ్ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. ఫోలిక్ యాసిడ్లు బేబీలలో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లను కూడా అందిస్తుంది. బేబీ ఎదుగుదలలో మెదడు పెరిగేలా చేస్తుంది. గుండె జబ్బులనుండి రక్షిస్తుంది.
పీచు - రీసెర్చి మేరకు ఈ పండులో పీచు కూడా అధికంగా వుండి, జీర్ణ వ్యవస్ధను శుభ్ర పరచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. కొల్లెస్టరాల్ తగ్గిస్తుంది గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ రాకుండా రక్షిస్తుంది. రక్తంలో షుగర్ స్ధాయిలను తగ్గించి డయాబెటీస్ రాకుండా చేస్తుంది. కివిపండు కడుపు నింపుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది.
జింక్ - కివి పండులో వుండే జింక్ శాతం పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్ళు, గోళ్ళు మొదలైనవాటి ఆరోగ్యకర పెరుగుదలకు జింక్ సహకరిస్తుంది.
కివి పండ్లు మన దేశానివి కావు. అయినప్పటికి దీని పోషకాల దృష్ట్యా దానిని ఎక్కడనుండైనా సరే తెప్పించి తినవచ్చు. పండు సైజు గురించి ఆలోచించకండి. కివి పండు చిన్నదైనా రుచి, ప్రయోజనాలు అధికం. కివి పండు ఎలా ఎంపిక చేయాలి? మీ బొటన వేలితో కివి పండును ఒత్తండి. పండితే మెత్తగా వుంటుంది. తినటానికి అనువు. మరి తిని ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
కివి పండుతో చర్మ సౌందర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. దురద తగ్గించడంలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని మరింత సౌందర్యంగా మార్చేందుకు కూడా దోహదపడుతుంది.



Click it and Unblock the Notifications