Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రశాంతంగా నిద్రించేందుకూ కావాలి మంచి ఆహారం...!

1. అరటి పండు: అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
2. చమోమిలే(చామంతి) టీ: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడుతున్న హెర్బల్ టీలలో ఇది కూడా ఒకటి. చామంతి పూలతో ఆసియాలో పలు దేశాలలో తీయటి పానీయం తయారు చేసుకుని సేవిస్తారు. దీనినే చాలా మటుకు ‘చామంతి టీ'గా వ్యవహరిస్తున్నారు. చామంతి పువ్వులను నీళ్ళలో వేసి మరిగించి కొద్దిగా పంచదార వేస్తే సాధారణమైన టీ తయారవుతుంది. కొన్ని హంగులు చేరిస్తే చక్కటి పానీయంగా మారుతుంది. అంటే ఈ టీ సర్వరోగ నివారణి అన్నమాట. దగ్గు, పడిశం, నిద్రలేమి, కీళ్ల నొప్పులు, పక్షవాతం తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
3. తేనె: తేనే ప్రక్రుతి సిద్దం గా దొరికే అపురాపమైన ఔషధము . తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి అందిస్తున్నాయి. తేనేలో ఉన్నావిటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును. రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది. రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తుంది.
4. వెచ్చని పాలు: నిద్రించే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగే అలవాటు భారతీయ సాంప్రదాయంలో ఉంది. అయితే అది పురాణ గాధ కాదు. కొన్ని పరిశోదన ప్రకారం రాత్రి నిద్రించే ముందు పాలు తాగడం మంచిదంటున్నారు. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. పాలలో ఉండే ట్రిప్టొఫాన్ అనే అమినో ఆసిడ్, సెరొటొనిన్ నీ, మెలటొనిన్ నీ పెంచి, సహాజంగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇవి మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీప్రసారకాలు(న్యూరోట్రాన్స్ మీటర్), ట్రైటోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది.
5. ఓట్ మీల్: ఓట్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. కొన్ని పరిశోధన ప్రకారం ఇందులో కరిగే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. పాలలో కలిపి తినాటి. ఇందులో వుండే పీచు మీ కడుపు బాగా నింపి త్వరగా మరల ఆకలి కాకుండా చేస్తుంది. కనుక వెన్నతీసిన పాలలో ఓట్లు వేసుకొని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఓట్ మీల్ ను తిసుకొంటే సౌండ్ లెస్ స్లీమ్ మీరు పొందవచ్చు.
6. బాదాం: బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉందిబాదంలో ఎక్కువ మెగ్నీషియం కలిగి ఉంటుంది. మెగ్నీషియం మీ శరీరంలోని కండరాలకు ఉపయోగపడి, శరీరానికి మంచి విశ్రాంతిని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ నిద్రించే ముందు కొన్ని బాదం పప్పులను తినడంతో మంచి నిద్రను పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
