Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
లెక్కకు మించి అధికంగా తింటే?

ఎంత డైటింగ్ చేస్తున్నప్పటికి బరువు తగ్గటం లేదంటే, బహుశ మీరు కింద తెలుపబడే ఆహారాల కేలరీలు లెక్కించటంలేదని గ్రహించండి. మనం లెక్క వేయని కేలరీలు ఎలా వుంటాయి?
అదనంగా ఒక కప్పు కాఫీ - మనం కాఫీ మరియు టీలు ఒక అలవాటుగా తీసుకుంటాం. ఇది ప్రత్యేకించి మనం ఆఫీస్ లో వుండగా లేదా పని ప్రదేశం లో పని చేసేటపుడు మనకు తెలియకుండా తాగేస్తాం. ఉదయం ఒకసారి, మరియు పనిలో వుండి తీసుకునే కాఫీలు, టీలు మనం లెక్కించం. ఒక కప్పు కాఫీ...అంటే అందులోని షుగర్, పాలు అన్నీ చేరి కనీసం 100 కేలరీలు వుంటుంది. మరి ఇవి తీసుకోకుండా మీరు ఒక చిన్న ముక్క చాక్లెట్ నోట్లో వేసుకుంటే సరిపోయేది కదా?
ఛీర్స్ అంటూ తాగే మందు - మనం తాగే ఆల్కహాల్ కేలరీలుగా లెక్కపెట్టం. కాని లావు ఎక్కాలంటే, ఆహారమే తినాలని లేదు. మీ వీక్ ఎండ్ పార్టీలు మీకు అధిక బరువు చేకూరుస్తాయి. వోడ్కా పానీయం తప్పక కొవ్వు కలిగించే పానీయం. ఒక గంట జిమ్ లో చేసిన కష్టమంతా ఒక్క బీర్ బాటిల్ తో వేస్ట్.
పండ్లు ఆరోగ్యమే...? పండ్లు మంచివే కాని వాటిలో కేలరీలు కూడా అధికమే. మామిడిపండ్లు ఆరోగ్యం అంటూ తిన్నారంటే, మీ బరువు తగ్గే ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పాల్సిందే. మామిడి, ద్రాక్ష, మొదలైనవి కొవ్వు అధికం చేస్తాయి. మీరు స్లిమ్ గా వుండాలంటే వీటిని వదిలేయండి.
డైట్ సోడానే కదా? డైట్ సోడాయే కదా అంటూ రెండు రోజుల్లో ఒక డజన్ తాగేస్తే, అవి మీకు లెక్కకు మించిన కేలరీలిస్తాయి. వాటిలో వుండే తీపి హాని చేస్తుంది. సాధారణ సోడా ఒక్కటైనా, పరవాలేదు. కాని డైట్ సోడా మాత్రం మీకు హానిచేస్తుంది.
ఎయిర్ కండిషన్ - బరువు పెరుగుతున్నారంటే, మీరు వాడే ఎయిర్ కండిషనర్ కూడా కారణమే. మీ శరీరానికి సమమైన ఉష్ణోగ్రత కావాలి. బాగా వేడిగా వుంటే, అది మీలోని ఎనర్జీ రిలీజ్ చేసి చల్లపరుస్తుంది. మరి చల్లగా వుంటే, అది కేలరీలు ఖర్చు చేసి వేడి పుట్టిస్తుంది. అయితే మీరు ఎల్లపుడూ 24 డిగ్రీల సెల్షియస్ లో కూర్చుంటే, మీ శరీరం సోమరిగా అంటే లేజీగా తయారవుతుంది. మరి సహజంగా మీరు కోల్పోవలసిన కేలరీలు అలానే వుండి మీరు లావు అయిపోతారు.
అనారోగ్యకరమైన స్నాక్స్ వంటివి మానేస్తే అవి మీ బరువు తగ్గించి శరీరాన్ని స్మార్ట్ చేయవు. మీరు కేలరీలను సైతం వివిధ రకాలుగా నియంత్రించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications