Latest Updates
-
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
తేలికగా..త్వరగా బరువు తగ్గించే 100 క్యాలరీ డైట్ ప్లాన్
బరువు తగ్గించే 100కాలరీ డైట్ ప్లాన్. బరువు తగ్గించే విషయంలో గుర్తుంచుకోవల్సిన ఒక ముఖ్య విషయం మీరు తీసుకొనే కాలరీలను కంట్రోల్ చేయడమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక క్యాలరీలు క్రమంగా బరువు పెరగడానికి దోహదం చేస్తాయంటారు. అందువల్ల, మీరు డైలీ డైట్ మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లోకాలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు.
మీరు త్వరగా బరువు తగ్గాలని సీరియస్ గా నిర్ణయించుకొన్నప్పుడు మీ డైలీ డైట్ లో చేర్చుకోవల్సిన కొన్ని ఆహారాలు 100క్యాలరీల కంటే తక్కువ ఉన్నవి ఉన్నాయి. వీటిని కనుక మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా మీ బరువు తగ్గించుకోవచ్చు. ఇవి చూడటానికి మనకు చాలా ఆకర్షనీయంగా జంక్ ఫుడ్స్ లా కనిపిస్తాయి. జంక్ ఫుడ్స్ అంటే బర్గర్, చీజ్ తో తయారుచేసిన పిజ్జా మరియు వేయించిన చికెన్ వంటి జంక్ ఫుడ్ మన రోజు వారి ఆహారంలో తీసుకోవలని కోరికను పెంచే ఆహారాలివి. అలాగే పొటాటో చిప్స్ చూడగానే వాటిని తినాలనే కోరిక ప్యాకెట్ మీద చెయ్యి వదలనివ్వకుండా చేస్తుంది. ఈ ఆహారాలన్నీ కూడా 100క్యాలరీలను కలిగి ఉన్నవే.
కాబట్టి ఇటువంటి హై కాలరీ ఆహారాలను చెక్ పెట్టి, మీ వెంట కొన్ని బరువు తగ్గించే ఆహారాలను తీసుకెళ్ళాలి, 100కాలరీల కంటే తక్కువ ఉన్నఆహారాలు క్రింది లిస్ట్ లో ఉన్నవి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. మీరు చాలా త్వరగా, సహజ పద్దతుల్లో బరువు తగ్గాలనుకుంటే, ఈ క్రింది స్లైడ్ లోని ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి. వాటి పరిశీలించి, మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. మరి త్వరగా బరువు తగ్గించే లోక్యాలరీ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

కివి:
బరువు తగ్గించే ప్లాన్ లో మీరున్నట్లైతే మీరు మీ రెగ్యులర్ డైట్ లో కివి పండ్లను చేర్చుకోవడం ఉత్తమం. ఈ పండులో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. కాబట్టి మీ పొట్టనిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దాంతో మీరు ఆహారాన్ని, స్నాక్స్ ను తినాలనే కోరికను తగ్గిస్తుంది.

బ్లూ బెర్రీస్:
ఈ జ్యూసీ ఫ్రూట్ లో 85క్యాలరీలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, వ్యాయామం చేసే ముందు ఒక కప్పు బ్లూ బెర్రీస్ ను తినడానికి ప్రయత్నించండి. ఇవి మీకు వ్యాయామానికి సరపడా ఎనర్జీని అందిస్తాయి.

గుడ్డు:
గుడ్డులోని తెల్లని పదార్థం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు బరువు తగ్గించే ప్లాన్ లో ఉన్నట్లైతే గుడ్డును మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. గుడ్డును ఉడికించి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు తీసుకోవడం మంచిది.

బ్రొకోలీ:
గ్రీన్ వెజిటేబుల్స్ లో ఇది ఒక బెస్ట్ వెజిటేబుల్. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు తీసుకోవడం వల్ల మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ రెగ్యులర్ గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు.

బంగాళదుంప:
బరువు తగ్గాలనుకొనే వారికి బేక్ చేసిన పొటాటో కూడా బాగా సహాయపడుతుంది. 100కాలరీ డైట్ లో పొటాటో కూడా ఒకటి . బేక్డ్ పొటాటోలో 85 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల వీటిని తీసుకోవడం ఆరోగ్యకరమే.

ఆపిల్స్:
100కాలరీ డైట్ చార్ట్ లో ఆపిల్ ఒక ఉత్తమ పండు. ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్ళ అవసరం ఉండదంటారు. అలాగే కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు . రెడ్ కలర్ ఆపిల్స్ ను వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల హెల్తీగా మరియు ఫిట్ గా ఉండవచ్చు.

బాదం:
నానబెట్టిన బాదం ఒక ఉత్తమ డ్రై ఫ్రూట్. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా బాదం తీసుకోవడం చాలా అవసరం. బాదంను మీ 100క్యాలరీ డైట్ చార్ట్ లో చేర్చుకోవడం ఉత్తమం. ఒక చిన్న బౌల్లో బాదంలో 89క్యాలరీలను కలిగి ఉండటం వల్ల మీరు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

దానిమ్మ:
తాజా దానిమ్మ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు, వారీ డైట్ చార్ట్ లో వీటిని జోడించడం ఉత్తమం. దానిమ్మలో 82క్యాలరీలు మాత్రమే కలిగి ఉన్నాయి.

చాక్లెట్:
డార్క్ చాక్లెట్ చాలా సురక్షితమైన ఎంపిక. మీరు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వారైతే డార్క్ చాక్లెట్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. డార్క్ చాక్లెట్ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ ను మీ 100కాలరీల డైట్ చార్ట్ లో చేర్చుకోవడం మంచిది. ఇందులో 92క్యాలరీలు కలిగి ఉంది.

క్రాన్ బెర్రీస్:
బెర్రీస్ లో వివిధ రకాలున్నాయి. వాటిలో ఎక్కువగా ఎంపిక చేసుకొనేది క్రాన్ బెర్రీస్. వీటిలో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్రాన్ బెర్రీస్ లో 72క్యాలరీలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. వీటిని మీ 100కాలరీ డైట్ చార్ట్ లో చేర్చుకోవడం వల్ల అదనపు పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు.

మొయోనైజ్:
బట్టర్ నుండి ఎగ్ లెస్ మొయోనైజ్ తీసుకోవడం వల్ల ఫిట్ అండ్ హెల్త్. నిపుణుల ప్రకారం ఒక సాడ్వించ్ 85శాతం కాలరీలను కలిగి ఉంటుంది.

ఆకుకూరలు:
గ్రీన్ వెజిటేబుల్స్ లో మీరు తీసుకోవల్సిన మరొకటి, గ్రీన్ లీఫ్స్. మీ 100క్యాలరీ డైట్ చార్ట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ఇందులో 75శాతం క్యాలరీలు మాత్రమే ఉంటాయి.

కర్బూజ:
ఒక బెస్ట్ జ్యూసీ ఫ్రూట్ వాటర్ మెలోన్. బరువు తగ్గాలనుకొనే వారు ఖచ్చింతగా వారి డైట్ లిస్ట్ లో చేర్చుకోవల్సి ఫ్రూట్ ఇది. ఇందులో 90శాతం క్యాలరీలు ఉన్నాయి. హెల్తీ జ్యూస్ గా కానీ లేదా సలాడ్ రూపంలో కానీ దీన్ని తీసుకోవచ్చు.

పీనట్ బట్టర్:
పీనట్ బటర్ కు దూరంగా ఉండాలని చాలా మంది సలహాలిస్తుంటారు . దీన్ని మీ 100క్యాలరీ డైట్ చార్ట్ లో చేర్చుకోవడం వల్ల, త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది . పీనట్ బటర్ సాడ్వించ్ లో 65క్యాలరీలున్నాయి.

గుమ్మడి:
ఎర్రటి గుమ్మడి కాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాదు బరువు తగ్గడంలో కూడా బాగా సహాయపడుతుంది . దీన్ని మీ 100క్యాలరీ డైట్ చార్ట్ లో చేర్చుకోవడం వల్ల 85శాతం క్యాలరీలను మాత్రమే పొందగలరు.



Click it and Unblock the Notifications











