Latest Updates
-
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా?
బరువు తగ్గాలనుకొనేవారు తినకూడని ఆహారాలు
సాధారణంగా బరువు తగ్గాలనే ఆశ చాలా మందిలో ఉంటుంది. అందుకు కొంతమంది డైట్ ఫాలో అయితే మరికొంత మంది, జిమ్, వ్యాయామం, యోగా ఇతర పద్దతులు అనుసరిస్తుంటారు. అయితే డైట్ అనుసరించే డైటర్స్ మాత్రం వారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారికి మనకు అందుబాటులో ఉండేవి, మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో చాలా ఆహారాలు శరీరానికి అంత మంచివి కావు. అటువింటి ఆహారాలను మీ డైట్ లో మిక్స్ చేసుకోవడం వల్ల మరిన్ని పౌండ్ల బరువు పెరగడం తప్ప, బరువు తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి, మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకొని, ఒక స్ట్రిట్ డైట్ ను ఫాలో చేస్తుంటే కనుక, ఈక్రింది కొన్ని ఆహారాలు ఇచ్చాము, వాటిని మీ రెగ్యులర్ డైట్ లిస్ట్ నుండి తొలగించండి.
అధిక బరువు ఉండి బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీద చాలా జాగ్రత్త తీసుకోవాలి. బరువు పెంచే ఆహారాలున్నాయి, బరువు తగ్గించే ఆహారాలూ ఉన్నాయి. అవి తెలుసుకోకుండా అన్ని మిక్స్ చేసి తినడం వల్ల అదనపు బరువు పెరుగుతారు. తర్వాత బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది . ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన ఆహారాలను ఒక సారి పరిశీలించినట్లైతే వాటిని ఖచ్చింతా మీ ఫెవరెట్స్ ఫుడ్స్ ఉండనే ఉంటాయి. అయినా కూడా మీరు వాటి మీద ఇష్టాన్ని పక్కన పెట్టి, మీ రెగ్యులర్ లిస్ట్ లో నుండి తీసేస్తే మీరు ఖచ్చితంగా సులభంగా మరియు ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోగలుగుతారు.
ఎవరైతే వెయిట్ లాస్ డైట్ ప్లాన్ లో ఉన్నారో, అటువంటి వారు ఈ క్రింది లిస్ట్ చూసి, ఆ ఆహారాలను ఖచ్చితంగా మీ డైట్ లిస్ట్ నుండి తొలగించండి. దాంతో మీరు హెల్తీగా బరువు తగ్గుతారు. మరి బరువు తగ్గించుకోవడానికి మనం తినకూడని ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

బ్రెడ్:
మనం తీసుకొనే ఆహారాల్లో వైట్ బ్రెడ్ చాలా వరస్ట్ టైప్ ఫుడ్. బ్రౌన్ బ్రెడ్ తో పోల్చితే, వైట్ బ్రెడ్ లో అధిక క్యాలరీలు ఉన్నాయి. కాబట్టి వైట్ బ్రెడ్ తినడాన్ని మానుకోండి.

క్యాండీ:
ఈ ప్రపంచంలో క్యాండీస్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిందే. ఎవరైనా సరే ఏదో ఒక వయస్సులో వీటిని టేస్ట్ చూసే ఉంటారు. అంతే కాదు, ఇప్పటీకి వీటి మీద మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది.

సెరియల్స్:
మార్కెట్లో వివిధ రకాల షుగర్ క్యాండీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత మోడ్రల్ లైఫ్ లో చాలా మంది వీటి ఆకర్షింపబడుతున్నారు. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే సెరియల్స్ కు బదులుగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోండి.

నూనె:
మరో చెడ్డ ఆహారం అంటే ఇదే. ఎందుకంటే మిమ్మల్ని టన్నులు టన్నులు బరువు పెంచేవి ఈ నూనెలే. కాబట్టి, వెయిట్ లాస్ డైట్ ఫాలో చేసే వారు, ఖచ్చితంగా నేచురల్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ సీడ్ ఆయిల్ వంటివి ఎంపిక చేసుకోవాలి.

డైరీప్రొడక్ట్స్:
డైరీప్రొడక్ట్ ఫుడ్స్ డైటర్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. వెన్న తియ్యని పాలు డైటర్స్ కు చాలా హానికరం. అతి తేలికగా, సులభంగా బరువు పెంచేస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనే వారు వెన్నతియ్యకుండా పాలు తీసుకోవకూడదు.

బంగాళదుంపలు:
మనం తినే ఆహారాల్లో చాలా ఇష్టమైన ఆహారం బంగాళదుంప. అంతే కాదు చాలా త్వరగా టన్నుల బరువు పెంచే ఆహారం కూడా ఇదే. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు బంగాళదుంపలో అధికంగా స్ట్రార్ట్ ఉంటుంది. ఇది మన శరీరానికి అంత మంచిది కాదు, ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారికి.

అరటి పండ్లు:
అరటి పండ్లు బరువు తగ్గాలనుకొనే వారికి వరస్ట్ ఫ్రూట్ అనే చెప్పవచ్చు. డైటర్స్ దీన్ని కచ్చితంగా నివారించాలి . అరటిపండులో అధికంగా క్యాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి మీకు ఎక్కువ ఎనర్జీని అంధిస్తాయి. కానీ, బరువు కూడా తేలికగా పెంచేస్తాయి.

సోడా:
ఏదైనా సరే ఏరియేటెడ్ డ్రిక్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. సోడాలో ఉండే అధిక క్యాలరీలు మీ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అదుపు తప్పేలా చేస్తుంది.

జంక్ ఫుడ్:
డైటర్స్ కు జంక్ ఫుడ్స్ ప్రెండ్లీ ఫుడ్స్ కావు. జంక్ ఫుడ్స్ లో చిప్స్, పాస్ట్రీస్ మరియు ఏవైనా సరే నూనెలో ఫ్రై చేసినవి ఆరోగ్యకరం కావు. వీటిలో అధికంగా నూనెలుండి గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

ప్రొసెస్డ్ మీట్:
క్యాన్డ్ మరియు ప్రొసెస్డ్ నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ డైటర్స్ కు అంత మంచి ఆహారాలు కావు. మీరు నాన్ వెజిటేరియన్ అయితే, తాజాగా కట్ చేసిన మాంసాహారం మరియు లీన్ మీట్ తీసుకోవడం మంచిది .



Click it and Unblock the Notifications