Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సులభంగా బరువు తగ్గించే సమ్మర్ వెయిట్ లాస్ టిప్స్
చలికాలంలో మీరు గమనించారో లేదో, మనం కొద్దిగా బరువు పెరుగుతాం. కాని వేసవిలో ఇది రాదు. నిపుణులు చాలామంది, బరువు తగ్గాలంటే వేసవి మంచిదంటారు. ఇందుకు అనేక కారణాలు దోహదపడతాయి. వీటిలో మనలోనుండి వేసవిలో అధికంగా వచ్చే చెమట ఒకటి. మరి ఇతర కారణాలు ఏమై వుంటాయో పరిశీలించండి. విజయవంతంగా బరువు తగ్గటానికి వేసవికాలం బాగుంటుంది. కొన్ని ఉపయోగపడే చిట్కాలు క్రింద ఇచ్చాము:
మీ లక్ష్యానికి మద్దతుగా మీ వేసవి ప్లాన్ చేయండి: మీ వేసవిలో ప్రచారం ప్లాన్ చెయ్యండి మరియు విజయవంతంగా గెలిచిన ఫలితాన్ని చూడండి.

ప్రతి చోటా నీరు త్రాగండి: నీటిలో జీరో కాలోరీస్ ఉంటాయి, మీ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది, మిమ్మల్ని కూల్ గా ఉంచుతుంది, వేసవిలో వేడికి హైడ్రేటెడ్ చేస్తుంది మరియు ఇది మీ దాహాన్ని తీర్చినంతగా వేరేది ఏది తీర్చదు. కాబట్టి నీరుని ప్రేమించండి. దీనిలో నిమ్మకాయరసాన్ని కలపండి లేదా మూలికల చల్లని తేనీరు ప్రయత్నించండి. చలికాలం పొడిబారి వుంటుంది. మన శరీరానికి డీహైడ్రేషన్ లేకుండా కొంత నీరు శరీరంలో వుండాలి. వేసవికాలంలో, మీరు చెమట బాగా కార్చి కొంత బరువు తగ్గించుకుంటారు. పైగా నీరు మీ శరీరంలో ఎక్కువసేపు వుండదు కూడాను. కనుక నీరు మీ బరువుకు కలుస్తుందన్న భయం లేకుండా తగినంత నీరు తాగేయండి.

వ్యాయామం: ఉదయం లేవగానే చేయండి; వ్యాయామంతో వేడిని ఎదుర్కోవటానికి ఉదయపు వేళలు సరి అయినవి మరియు బరువు తగ్గటానికి. మీ ఉదయాన్ని బరువు తగ్గే చిట్కాలతో ప్రారంభించండి మరియు కాలరీస్ తగ్గించుకోండి మరియు సూర్యుడు తన వేడితో మీలో సోమరితనాన్ని నింపకముందే మీ జీవక్రియను ప్రారంభించండి.

లో కాలరీ ఫుడ్స్: బయటికి వెళ్ళడానికి ఆరోగ్యకరమైన తక్కువ కాలరీలు ఉన్న స్నాక్స్ ప్యాక్ చేసుకోండి. కొద్ది కాలరీలు ఉన్నఆహారాని ఎక్కువగా తీసుకోండి, ఎక్కడకి వెళ్ళినా కొద్దికొద్దిగా భోజనం తీసుకోండి. ఉదాహరణకి: తరిగిన కూరగాయల ముక్కలు, వండిన చికెన్ బ్రెస్ట్ యొక్క ముక్కలు, తాజా పళ్ళు, తక్కువ కొవ్వు ఉన్నజున్నులేదా తక్కువ కాలరీలు ఉన్న సాండ్విచ్

చేపలు: ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తయారుచేసుకోండి; తక్కువ కాలరీలు,ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అది మిమ్మలిని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ప్రతి అల్పాహారానికి, భోజనానికి కొన్ని కాల్చిన చికెన్ బ్రెస్ట్, తయారుగా సాల్మాన్ లేదా చేప, కొన్ని గింజలు, బీన్స్ లేదా తక్కువ కొవ్వు ఉన్న పెరుగును జోడించండి.

పండ్లు: స్వీట్స్ బదులుగా తాజా పండ్లను తీసుకోండి. పండ్ల జాబితా నుండి తాజా సీజనల్ పండ్లను తీసుకొనే ఎక్కువ కలరీలను భర్తీ చేయండి. మీరు అల్పాహారం కోసం ఒక చల్లని పండు స్మూతీని కూడా ప్రయత్నిచావొచ్చు. మీరు ఎండిన పండు మరియు తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, పాలు లేదా మంచి నాణ్యత గల ప్రొటీన్ పౌడర్ అల్పాహారంలో తీసుకోవొచ్చు.

చల్లని వేసవి ఆహారాలు/పెరుగు: వేసవిలో పెరుగు, కూరలు, పండ్లు రసాలు వంటివి శరీరానికి చల్లదనం ఇస్తాయి. అవి మీకు బరువు చేర్చవు. చలికాలంలో, మనం శరీరానికి అధిక వేడి కావాలంటూ కొన్ని ఆహారాలు తినేస్తాం. ఈ ఆహారాలు ఏవంటే...మాంసం, జున్ను మొదలైనవి. వీటిలో కేలరీలు అధికం. కాని వేసవిలో, ఈ రకంగా వేడి పుట్టే ఆహారాలు మానేస్తాం.

జ్యూసులు: ద్రవాహారాలు మరియు బరువు తగ్గుట ....వేసవిలో వేడిని తగ్గించటానికి ద్రవాహారాలు అధికంగా తీసుకోవాలి. ద్రవాలు మీ కడుపు నింపుతాయి. కనుక మీరు ఎప్పుడు పడితే అపుడు ఆహారం తీసుకోడానికి ఇష్టపడరు. ఫలితంగా మీరు తక్కువ తినడం, వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. రెండవ ప్రయోజనంగా మీరు తీసుకునే ద్రవాహారాలు మీ శరీరంలోని మలినాలను, వ్యర్ధాలను బయటకు విసర్జిస్తాయి. ఇక అపుడు మీ జీవక్రియ రేటు పెరిగి మీరు ఆరోగ్యంగా వుంటారు. కనుక వేసవిలో మీరు బరువు తగ్గటం తేలిక.

నిద్ర: సరైన నిద్రలేకపోవడం వల్ల కూడా బరువు పెరగడానికి ఒక కారణమే. ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో ఆకలిని పెంచే హార్మోను ప్రభావం పెరుగుతుంది. దీని వల్ల కార్బోహైడ్రేట్లు, జంక్ ఆహారం తినాలనే కోరిక తీవ్రతరం అవుతుంది. కాబట్టి ప్రతి రోజూ మంచి నిద్రతో చూడచక్కని ఆకారం అనే విషయాన్ని మరిచిపోకండి.

స్పైసీ: మెటబాలిజం వేగవంతం చేయడానికి కాప్ససిన్ అనే కాంపౌండ్ చాలా అవసరం. ఇది శరీరంలో వేడి పెంచి జీవక్రియలు వేగవంతం చేస్తుంది. కాప్ససిన్ అనే అంశం శరీరంలో వేడి పుట్టించి క్రొవ్వు కరిగించడానికి బాగా సహాయపడుతుంది. స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపు ఫుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది.

డైయంట్ ప్లాన్: ఆకలేస్తే తినడం..లేకపోతే తినకపోవడం మంచి పద్దతి కాదు. జీవక్రియలు పూర్తిగా మందగించకుండా చూసుకోవడం చాలా అవసరం. ఉదయం లేచిన తర్వాత గంటా, గంటన్నరలోపు అల్పాహారం తినేస్తే ఏ మస్యా ఉండదు. అలాగే ప్రతి మూడు నాలుగు గంటలకోసారి ఏదో ఒక ఆరోగ్యకరమైన ఉపాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందుకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.

బ్లాక్ టీ మేజిక్ - టీలో ధియాఫ్లావిన్స్ మరియు ధియా రూబిగిన్స్ అనే రెండు పదార్ధాలు కొవ్వును కరిగించటానికి బాగా పనిచేస్తాయట. అయితే దీనిలో పాలు కలిపితే ఆ రెండు పదార్ధాల సామర్ధ్యం పోతుందట. కనుక పాలు కలుపకుండా తాగితే టీలో బరువు తగ్గే పదార్ధాలు బాగా పని చేస్తాయట. అంతేకాదు, బ్లాక్ టీ లో వుండే యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని ఎంతో అలర్ట్ గా వుంచుతూ గుండె జబ్బుల వంటివాటిని దగ్గరకు చేరనివ్వవని కూడా చెపుతున్నారు.



Click it and Unblock the Notifications











