Latest Updates
-
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.!
జీవక్రియలను వేగవంతం చేసి, కొవ్వు కరిగించే మార్గాలు
బరువు తగ్గాలంటే మీ మెటబాలిజం రేటు అధికంగా వుండాలి. అపుడే కేలరీలు బాగా ఖర్చవుతాయి. మరి మీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా మెటబాలిజం ప్రక్రియ గూర్చి కొన్ని అంశాలు పరిశీలించండి. మెటబాలిజం ప్రక్రియను పూర్తిగా మార్చలేమని గుర్తించండి. అయితే, కేలరీలు తీసుకోవడం, శారీరక శ్రమ అధికం చేయడం ద్వారా దానిని మార్చవచ్చు. మీ కేలరీలు పూర్తిగా తగ్గించడం బరువు తగ్గడానికి సహకరించదు. బరువు తగ్గాలంటే ఆరోగ్యకర ఆహారాలు ఒక పద్ధతిలో తినాలి. చురుకైన రీతిలో మీ జీవన విధానం వుండాలి. అందుకు సహకరించేందుకు ఒక మాదిరి నుండి అధికమైన శారీరక వ్యాయామం చేయాలి. వేగవంతమైన నడక, జాగింగ్ మొదలైనవి మీ డైలీ రొటీన్ లో భాగంగా వుండాలి.
వ్యాయామం: మెటబాలిజం పెంచాలంటే, బరువులెత్తడం, కండలు ఏర్పరచుకోడం మంచి వ్యాయామం. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే 6 నుండి 8 గంటల పూర్తి నిద్ర ప్రతిరోజూ అవసరం. నిద్ర అంతకు తగ్గితే, శరీరంలోని బ్లడ్ షుగర్ నియంత్రించబడదు. నిద్రలేక వచ్చే ఒత్తిడి మీ లావుకు తోడవుతుంది. వయసు అధికమయ్యే కొద్ది మీ జీవప్రక్రియ తగ్గుతుంది. ధైరాయిడ్ సరిగా పని చేయకున్నా మీ మెటబాలిజం తగ్గుతుంది. కనుక ధైరాయిడ్ పరీక్షచేయించుకోవాలి.
కేఫైన్ వాడకం మెటబాలిజం పెంచినప్పటికి మీ కేంద్ర నరాల వ్యవస్ధను దెబ్బతీస్తుందని గుర్తించండి. కేలరీలు లెక్కించేకంటే, తీసుకునే కేలరీలు, మీ శారీరక శ్రమల మధ్య సమన్వయం చేకూర్చండి.

శరీరంలో వచ్చే వ్యాధులన్నిటికి కారణం జీర్ణవ్యవస్ధ సరిగా లేకపోవడమే. దీనిని మెరుగు పరచాలంటే శరీరాన్ని ఒకపూట ఆహారం లేకుండా చేయటమే నంటారు పోషకాహార నిపుణులు. శరీరం మొత్తంలోకి జీర్ణ వ్యవస్ధే అనేక సమస్యలకు గురవుతూంటుంది. కారణం - ఆ వ్యవస్ధను మనమే దుర్వినియోగం చేసేస్తుంటాం ! ఎలా ?
రసాయనాలు వేసి నిలువ వుంచిన ఆహారాన్ని తినేసి శరీరంలో కృత్రిమ కణ విభజనకు దోహదం చేస్తాం.
రుచిగా వుంటే...అధికంగా భుజిస్తాం. రుచి లేకుంటే... కావలసినదానికంటే కూడా తక్కువే తింటాం...
పార్టీల కెళితే, తక్కువ టైములో అనేక రకాల పదార్ధాలు తినేసి జీర్ణ శక్తికి తోడ్పడే ఎంజైములకు అసౌకర్యం కలిగిస్తాం. అంతే కాదు కలుప కూడని పదార్ధాలను కలిపేసి తినేస్తాం. ఉదాహరణకు - పాల ఉత్పత్తులను మాంసాహారంతో కలిపి, లేదా పుల్లని పదార్ధాలను పాలతో కలిపి జంక్ ఫుడ్ ను శీతల పానీయాలతో కలిపి తినేస్తాం.
మన బాడీ క్లాక్ ఆదేశాల మేరకు జీర్ణక్రియలో అవసరమైన ఎంజైములు రిలీజ్ అయినప్పటికి మనకు సమయం ఉన్నపుడు తింటాం, సమయం లేనపుడు మానేయటం చేస్తాం. ఈ ఎంజైములు లేకుంటే జీర్ణ శక్తి కష్టమే మరి! పైన పేర్కొన్న టిప్స్ ఆచరిస్తూ మీకు ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తే, జీర్ణ వ్యవస్ధకు హాని కలుగదని, ఆరోగ్యం సరిగా ఉంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications