Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఆరోగ్యంగా బరువు తగ్గడానికి హెల్తీ డైటింగ్ టిప్స్
సాధారణంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు చాలా మంది. అది నిజం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతే ఆయుష్యును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం కోసం నానా ఇబ్బందుల పడుతున్నారు. జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుతున్నారతప్ప. సహజ పద్దతులతో నిత్య ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు.
మారుతున్న జీవన శైలితో మాటు శరీరాలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు నాజుకు అనేది మరుగై బొద్దుగా కనబడేది ఫాష్యన్ అయిపోయింది. అయితే ఆ అధిక బరువు ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది. అనేక అనారోగ్యాలు కారణం అవుతుంది. రక్త పోటు, గుండె సంబంధిత వ్యాధులు, మరియు మధుమేహం ఇలాంటి మరెన్నో రకాల జబ్బులకు రావడానికి అవకాశాలున్నాయి.కాబట్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శరీరక వ్యాయామానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితులల్లో ఆరోగ్యకరమైన పోషకాహారమే ప్రయోజనకరం మరి అటువంటి పోషకాహారన్ని డైయట్ లో ఏవిధంగా తీసుకొంటే అతి త్వరగా బరువు తగ్గుతారో చూద్దాం...

నిద్రలేవగానే -నిమ్మరసం:
ఉదయాన్నే కొద్దిగా నిమ్మరసం మరియు గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న విష మలినాలను బయటకు పంపవేయబడుతుంది.

కాల్షియం అత్యవసరం:
బరువు తగ్గడంలో కాల్షియం ముఖ్యం పాత్ర వహిస్తుంది. ఆహారంలో కాల్షియం తప్పనిసరిగా వుండేటట్లు చూసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉన్న పెరుగు, పనీర్ చాలా బాగా పనిచేస్తాయి. పాలలో వుండే మీగడలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పాలను నేరుగా తీసుకోవడం కన్నీ మజ్జిగ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్టాట్యుటరీ ఫాట్ ను తగ్గించాలి:
నూనె, నెయ్యిలలో స్టాట్యూటరీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వంటకాలలో వీటిని సాధ్యమైనంత తక్కువ ఉపయోగిస్తూనే మరికొన్నింటిలో పూర్తిగా మానేయొచ్చు. చపాతీలలోనూనె కన్నా పుల్కాలు ఆరోగ్యకరం. దోశ, వడ కన్నా ఆవిరి మీద తయారు చేసిన ఇడ్లీమేలు. రోజూవారీ భోజనంలో ఉపయోగించే నెయ్యిని కూడా పూర్తిగా నిషేధించాల్సిందే..

నీరే అమృతం:
రోజుకి పదిగ్లాసుల నీరు తాగితే అమృతంలా పనిచేస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు. నీరు ఎక్కువ తాగడం వలన ఆకలి త్వరగా వేయదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ తినాలన్న కోరిక కలగదు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొంటారు. నాన్ స్టిక్ పాత్రలలో వంట చేయడం వల్ల నూనె తక్కువ పట్టడంతో పాటు పదార్థాలలో పోషకవిలువలు పోకుండా ఉంటాయి. అప్పడాలను వేయించుకునే బదులు కాల్చుకొని తింటే వాటిని తినాలన్న కోరిక తీరుతుంది. నూనెనుండి తప్పించుకున్నట్లు ఉంటుంది.

తృణధాన్యాలు బెటర్:
ఉదయం నిద్రలేచిన తర్వాత భారీ ఎత్తున తీసుకునే బ్రేక్ ఫాస్ట్ సంగతి మరిచిపోండి. కడుపు నిండుగా వుండి క్యాలరీలు తక్కువగా వుండే తృణధాన్యాలను ఉపాహారం కింద తీసుకుంటే మంచిది. ముందు రోజూ నానబెట్టి మొలకలు వచ్చిన తృణధాన్యాలలో కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మరసం కలిపి తింటే రుచిగా వుంటాయి. ప్రతి రోజూ తినలేకపోయినా వారానికి రెండు మూడు సార్లు తప్పనిసరిగా తృణధాన్యాలు తీసుకునే అలవాటు చేసుకోండి.

ఫైబర్ తప్పనిసరి-పళ్ళు మరవద్దు:
తీసుకొనే ఆహారంలో ఫైబర్ వుండేట్లు చూసుకోవాలి. ఆకు కూరల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. రోజు మొత్తం మీద కనీసం ఒక పెద్ద పండన్నా తీసుకోవాలి. ప్రతి పండులోనూ పోషక విలువలు, ఫైవర్ ఎక్కువగానే లభిస్తాయి. ఫైబర్ తో పాటు చర్మం సౌందర్యానికి పళ్లు బాగా పనిచేస్తాయి.

మాంసాహారం:
మాంసాహారం లేకుండా ముద్ద దిగని వారు ఎందరో ఉన్నారు. మాంసాహారం వండేటప్పుడు చర్మం తీసేసి వండాలి. దీని వలన వందక్యాలరీలు తగ్గిపోతాయి. దీని తయారీలో నూనెకు బదులు నీటిని వాడితే కొవ్వు చేరకుండా జాగ్రత్తపడవచ్చు. చేపలలో తక్కువ పరిమాణంలో కొవ్వు ఉంటుంది. చికెన్, మటన్ కి బదులుగా చేపలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications
