Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
త్వరగా బరువు తగ్గించే దాల్చిన చెక్క-తేనె డైట్
మీరు డైలీ తిసుకోనే ఆహారంలో దాల్చిన చెక్క మరియు తేనెను చేర్చుకోవడం చాలా అవసరం మరియు ముఖ్యం కూడా. బరువు తగ్గాలనుకొన్నప్పుడు, ఇటువంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గడాన్ని బాగా సహాయపడుతాయి. బరువు తగ్గాలనుకొనే వారికి తేనె మరియు దాల్చిన చెక్క ఈ రెండూ ఫర్ఫెక్ట్ కాంబినేషన్ పదార్థాలు.
బరువు తగ్గించుకోవడంలో అతి తక్కువ క్యాలరీలు కలిగిన తేనెను కొన్ని సంవత్సరాలను ఉపయోగిస్తున్నారు. ఉదయం తేనె మరియు నిమ్మరసం రెండింటి మిశ్రంతో గోరువెచ్చని నీరు త్రాగేవారు, అలాగే కొద్దిగా తేనె కూడా వారి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అద్భతంగా పనిచేస్తాయి. అలాగే దాల్చిన చెక్క కూడా బరువు తగ్గించడంలో చాలా అద్భుతంగా సహాయపడుతాయి. అందుకే దాల్చిన చెక్క మరియు తేనెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.
దాల్చిన చెక్క మరియు తేనె కాంబినేషన్లో బరువును ఎలా తగ్గించుకోవచ్చు? ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

మీకు తగినంత శక్తిని అందిస్తుంది
స్వీట్ హనీ వ్యాయామానికి కావల్సిన శక్తిని అందించే ఒక మంచి టానిక్ వంటిది. బరువు తగ్గాలనుకొనే వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం వ్యాయామానికి ముందు తీసుకుంటే మంచి ఎనర్జీతో పాటు, బరువును ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్
ఊబకాయస్తులు మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి 2టేబుల్ స్పూన్ల తేనె మరియ 3టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడినొ ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేసి రెగ్యులర్ కొద్దిరోజులు తీసుకొంటే అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.

విటాలిటి
తేనె మరియు దాల్చిన చెక్కలోని షుగర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే తేనె శరీరానికి కావల్సిన థక్తిని అందిస్తుంది. అరటేబుల్ స్పూన్ తేనెను ఒక గ్లాసు నీళ్ళలో మిక్స్ చేసి దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసి భోజనానికి ముందు తీసుకుంటే విటాలిటీ పెంచుతుంది.

తిన్న ఆహారంను తేలికగా జీర్ణం చేస్తుంది
భోజనానికి ముందు రెండు టేబుల్ స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేసి తినాలి . ఇలా చేయడం వల్ల ఎసిడిటి తగ్గిస్తుంది. ఈ రెంటింటి కాంబినేషన్ వల్ల బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. తిన్న ఆహారంను విచ్ఛిన్నం చేయడానికి తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది .

ఫ్యాట్ ను తొలగిస్తుంది
తేనె మరియు దాల్చిన చెక్క ఈ రెండింటి కాంబినేషన్ త్వరగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ కాలీ కడుపుతో తీసుకుంటా మరియు రాత్రి నిద్రించడానికి ముందు తీసుకుంటే శరీరంలో నిల్వచేరిన ఫ్యాట్ ను కరిగిస్తుంది.

ఆకలి
తేనె మరియు దాల్చిన చెక్క పొడి బరువు తగ్గించడానికి సహాయపడటంతో పాటు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దాల్చిన చెక్క మరియు తేనె మిశ్రమం పెద్దప్రేగులలోని పారాసైట్స్, ఫంగస్, మరియు బ్యాక్టీరియాను శుభ్రం చేస్తుంది. తేనె బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. దాంతో ఆకలి కంట్రోల్ అవుతుంది.

సెల్యులైట్స్ ను నాశనం చేస్తుంది
తేనె మరియు దాల్చిన చెక్క కాంబినేషన్ బరువు తగ్గించడం మాత్రమే కాదు సెల్యులైట్ అనే అధనపు ఫ్యాట్ ను నాశనం చేస్తుంది.



Click it and Unblock the Notifications