Latest Updates
-
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
డ్రైఫ్రూట్స్ (ఎండినపండ్లు)తో మాత్రమే బరువు తగ్గించుకోవడం ఎలా
డ్రైఫ్రూట్స్ లో బరువు తగ్గించుకోవడం ఎలా
డ్రై ఫ్రూట్స్ అంటే, తాజా పండ్ల నుండి పూర్తిగా తేమన కోల్పోవడం . నీడలో లేదా ఎండలో ఎండబెట్టిని కొన్ని తినేటటువంటి ఫలాలు. కొన్ని రకాల పండ్లను ఎండబెట్టి, లేదా తాజాగా అలాగే కూడా తినవచ్చు . పండ్లలో న్యూట్రీషియన్స్, కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్ అంటానే ముందుగా మనకు గుర్తొచ్చేది బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష మొదలగునవి. డ్రైఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మరియు శరీర జీవక్రియలు మెరుగుపరిచేటటువంటి గణనీయమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి . అంతే కాదు, వీటిలో ఇంకా, మంచి ఎనర్జీ కలిగి ఉంది. ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో మరియు తీవ్రమైన బరువుతో బాధపడుతున్నారో అలాంటి వారు డ్రైఫ్రూట్స్ ను అధికంగా తీసుకోమని సలహా. డ్రైప్రూట్ ఎక్కువ శక్తిని అంధిస్తుంది. గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలు కూడా డ్రైఫ్రూట్స్ తినవచ్చని సలహా . ఎందుకంటే ఇవి ఎవరికైనా సరే అత్యధిక పోషకాలను అంధిస్తుంది.
సాధారణంగా డ్రైఫ్రూట్స్ బరువు పెరగడానికి చాలా మంచివని భావిస్తారు. డ్రైఫ్రూట్స్ లో అధిక ఫ్యాట్స్ మరియు ఎనర్జీ కలిగి ఉన్నాయి. అలాగే డ్రైఫ్రూట్స్ తో బరువు తగ్గించుకోవడం కూడా సాధ్యమే. డ్రైఫ్రూట్స్ తో బరువు తగ్గడమనే భావన కొద్దిగా కొత్తగా ఉంది కదూ..!బరువు తగ్గాలనుకొనే వారు, శరీరంలో ఎటువంటి పోషకాలను కోల్పోకుండా, ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడానికి డ్రైఫ్రూట్స్ ను తీసుకోవచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి బరువు ఏవిధంగా తగ్గించుకోవచ్చు క్రింది విధంగా చర్చించడం జరిగింది.

1 . పరిమాణం - డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్స్ అధికంగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దాంతో బరువు తగ్గడానికి బదులు క్రమంగా బరువు పెరగడానికి దోహదపుడుతుంది. అందువల్ల, డైట్ టిప్ ను అనుసరించాలి . డ్రైఫ్రూట్స్ ను అధికపరిమాణంలో తీసుకోకుండా నివారించాలి . డ్రైఫ్రూట్స్ డైట్ లో బరువు తగ్గించుకవడానికి, మీ రెగ్యులర్ డైట్ లో ఒక బౌల్ డ్రైఫ్రూట్స్ ను జోడించండి. ఒక బౌల్ డ్రైఫ్రూట్స్ మీ ఎనర్జీలెవల్స్ ను తగినంత శక్తి స్థాయిలను మరియు న్యూట్రిషినల్ లెవల్స్ ను మీ శరీరంలో ఉంచడానికి సహాయపడుతుంది.
2 . నిర్ణీత సమయంలో నిర్ణీత పండ్లను తీసుకోవాలి - డ్రైఫ్రూట్స్ తో మాత్రమే బరువు తగ్గాలనుకుంటే, విభజించి పాలించు అనే విధానాన్ని ఉపయగించాలి. డ్రైఫ్రూట్స్ ను ఏటైమ్ లో అంటే ఆ టైమ్ లో తీసుకోకూడదు. ఉదాహరణకు, పూర్తి పోషకాలను మన శరీరానికి అందాలంటే, బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం వాటి తినడం వల్ల శరీరానికి అవసరం అయ్యే పోషకాలు మొత్తం ఇందులో మనకు లభ్యం అవుతాయి . బాదంలో అధిక శక్తి కలిగి ఉంది. ఇవి శరీరం యొక్క జీవక్రియలకే బూస్ట్ వంటిది. అదే విధంగా ఎండు ద్రాయ మరియు పిగ్స్ వంటి డ్రైఫ్రూడ్స్ మధ్యహ్నా భోజనం సమయంలో తీసుకోవాలి. ప్రతి ఒక్క డ్రైఫ్రూట్ కు కొంత కొంత సమయాన్ని విభజించండి . అన్నింటిని ఒకే సమయంలో తినకూడదు.
3 . పిస్తాలు - పిస్తా లేదా పిస్తాచో బరువు తగ్గడానికి చాలా మంచిదని రుజువు చేసుకుంది. పిస్తాచోస్ లో హెల్తీ ఫ్యాట్స్, న్యూట్రీషియట్స్, మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. పిస్తాచోలలోని ఫ్యాట్స్ మన శరీరంలో పూర్తిగా గ్రహించలేవు , అందువల్ల,వాటిలో లోక్యాలరీ ఫుడ్స్ గా చేయండి. బరువు తగ్గించుకోవడానికి ఒక మంచి డైట్ టిప్ మీ డ్రై ఫ్రూట్ డైట్ లో అధిక పిస్తాచోలను చేర్చుకోండి . వెయిట్ లాస్ డైట్ ప్లాన్ కు పిస్తాచోలు ఒక ఉత్తమ డ్రై ఫ్రూట్.
4 . ఆకలి కోరికలను - డ్రై ఫ్రూట్స్ లో అధిక కార్బో హైడ్రేట్స మరియు ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఒక బౌల్ నిండుగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆకలికోరికలను తగ్గిస్తుంది. ఆకలి తగ్గిస్తుంది, అలాగే తక్కువగా ఆహారాన్ని తీసుకొనేలా చేస్తుంది. డ్రైఫ్రూట్స్, చిప్స్, మరియు జంక్ ఫుడ్స్ కంటే డ్రైఫ్రూట్ మంచి ఎంపిక. డ్రై ఫ్రూట్స్ డైట్ మీ కడుపుకు అవసరం అయ్యే ఆహార పరిమాణాన్ని మాత్రమే తీసుకొనే విధంగా చేస్తుంది. ఇక్కడ అనుసరించడానికి ముఖ్యమైన ఆహారం చిట్కా అవసరమైన మోతాదులోనే డ్రైఫ్రూట్స్ ను తినాల్సి అవసరం వుంది. . ఈ చిట్కా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
నట్స్ మాత్రమే కాదు, బరువును హెర్బ్స్ కూడా తగ్గిస్తాయి
5 . ఇతర ప్రయోజనాలు - డ్రై ఫ్రూట్స్ వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, బాదం మొదడను చురుగా ఉండేలా చేస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డ్రై ఫిగ్స్ బలహీనత, మధుమేహం మరియు రక్త virculationకు మంచిగా ఉన్నాయి. ఎండు ద్రాక్ష కూడా చర్మం మరియు శరీరం యొక్క పనితీరు చాలా మంచిది. అదే విధంగా శరీరం యొక్క వేడి తగ్గించడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష కూడా బాదంలాగే, రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల ఎక్కువ పోషకాలు, ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు . జీడిపప్పును అధికంగా తీసుకోకూడదు. ఇందులో అధిక కొవ్వు, అధిక క్యాలరీలున్నాయి. వెయిట్ లాస్ డైట్ ప్లాన్ లో జీడిపప్పును మినహాయించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications