Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
సాయంత్రాల్లో వ్యాయామం చేయడానికి చిట్కాలు
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్యాయామాలు మరియు వర్కౌట్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొన్నారు. అంతే కాదు, ప్రతి రోజూ ఎంతో కొంత వ్యాయామం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం అవుతుంది. రెగ్యులర్ వ్యాయామం వల్ల ఒత్తిడి మరియు మెంటల్ గా మరియు ఫిజికల్ గా ఒత్తిడగి తగ్గించుకోవడానికి ఈ వ్యాయామం చాలా అవసరం . అయితే ఈ బిజీ షెడ్యూల్స్, బిజీ లైఫ్ లో వ్యాయామం చేయడానికి సమయం లేని వాళ్ళు ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటుంటారు.
అయితే ఏదో ఒక విధంగా రోజులో ఏదో ఒక సమయంలో చిన్న పాటి వ్యాయామానికి సమయం కేటాయించుకోవాలి. కార్పొరేట్ ఉద్యోగస్తులకు కానీ, స్టూడెంట్స్ కు కానీ సాయంత్రం వేళ కొంచెం సమయం దొరుకుతుంది. ఆ సమయంలో చేసే వ్యాయామాలు, వర్కౌట్స్ తో హేల్త్ కేర్ తీసుకోవచ్చు . రోజంత పని, ఒత్తిడితో అలసిపోయిన శరీరానికి ఒత్తిడి మరియు అలసటను తగ్గించుకోవడానికి ఈ సమయం చాలు వ్యాయామం చేయడానికి. శరీరం తగినంత ఎనర్జీని పొందడంతో పాటు, రిఫ్రెష్ అవుతుంది.
ఈ హెల్ అండ్ ఫిట్ నెస్ ఆర్టికల్లో వ్యాయామం గురించి మాట్లాడటం జరిగింది. ఉదయం వ్యాయామానికి సమయం లేనప్పుడు, సాయంత్రం చేసే వ్యాయామాలకు పాటించాల్సి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈవెనింగ్ వ్యాయామాలు మొదలు పెట్టడానికి ముందు వీటిని ప్రయత్నించండి.

1. ప్రీ వర్కౌట్: సాయంత్రంలో వ్యాయామం చేయడానికి ముందు మీ శరీరం వ్యాయామానికి సిద్దం చేసుకోవాలి . సాయంత్రం వ్యాయామం చేయడానికి ఒక గంట ముందు ఎటువంటి ఆహారాలు తీసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈవెనింగ్ వర్కౌట్స్ కు ఇది ఒక ముఖ్యమైన చిట్కా. మీ శరీరం మీద ఏదైనా శారీరక ఒత్తిడి కలిగించినప్పుడు, మీ పొట్టు ఫుల్ గా అనిపిస్తుంది దాంతో మీరు అసౌకర్యంగా భావిస్తారు. అనారోగ్యం చెందుతారు . ఈవెనింగ్ వర్కౌట్స్ కు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే సైడ్ ఎఫెక్ట్స్ స్టొమక్ పెయిన్, మజిల్ స్ట్రెయిన్ మరియు అలసట వంటివి ఎదురవుతాయి.
2. టైమింగ్స్ : మీరు వ్యాయామం చేయడానికి మొదలు పెట్టే సమయం లో మీరు శారీరకంగా మరియు మానసికంగా సౌకర్యవంతంగా ఉండాలి. వర్కౌట్ చేసిన తర్వాత మీ శరీరం కొద్దిగా విశ్రాంతి పొందుతుంది . ఎక్కువ ఒత్తిడికి గురైతే, అది ఎక్కువ అలసటకు మరియు వీక్ నెస్ కు గురిచేస్తుంది. కాబట్టి, మీరు పని నుండి తిరిగి వస్తానే కొద్ది విరామం తీసుకొని తర్వాత వ్యాయామం మొదలు పెట్టాలి. ఈవినింగ్ వ్యాయమం చేసేవారికి ఇది ఒక మంచి సంరక్షణ చిట్కా. అలాగే మీరు ప్రారంభించే సమయం రెగ్యులర్ గా ఒకే సమయం ఉండాలి.
3. కెఫిన్: ఎక్స్ ట్రా ఎనర్జీ మరియు రిఫ్రెష్ మెంట్ కోసం మీరు కొద్దిగా కాఫీ తీసుకోవచ్చు. వర్కౌట్ చేయడానికి ముందు కొద్దిగా కాఫీ త్రాగడం వల్ల మీలో తిరిగి ఎనర్జీ పొందడానికి సహాయపడుతుంది. కార్డియో వ్యాయామలు మరియు ప్లోర్ వ్యాయామాలు చేసే వారికి ఇది చాలా అవసరం . కాఫీ మిమ్మల్ని లైట్ గా భావించేలా చేస్తుంది. కాఫీ మీ చాయిస్ కానప్పుడు, మీరు గ్రీన్ టీకి కూడా ప్రాధాన్యత ఇవ్వొచ్చు . గ్రీన్ టీలో న్యూట్రీషినయన్స్, ఉండి మీ స్టామిని మరియు ఎనర్జీ పెంచుతుంది. ఒక కప్పు కాఫీ లేదా టీ వ్యాయమానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు.
4. నీళ్ళు: సాయంత్రం వ్యాయామంకు చాలా అవసరం అయినది నీళ్ళు. రోజంతా పనిచేసి శరీరం అలసటకు మరియు డీహైడ్రేషన్ కు గురి అవుతుంది మరియు ఒత్తిడికి లోనవుతుంది. కాబట్టి మీ శరీరాన్ని తిరిగి రీ హైడ్రేషన్ కలిగి ఉండటం చాలా అవసరం. వ్యాయామం చేసేప్పుడు కూడా, చిన్నచిన్న గుటకలు వేస్తూ కొద్దికొద్దిగా నీరు త్రాగడం చాలా మంచిది.
5. పోస్ట్ మీల్:సాయంత్రం వ్యాయం చేసిన తర్వాత డిన్నర్ హెవీ మీల్ తీసుకోకండి. అలాగే ఫ్యాట్ ఫుడ్స్ కు బదులుగా హెల్తీ స్నాక్స్ ను , సలాడ్స్ మరియు సూప్ లను చేర్చుకోవచ్చు . ఈవెనింగ్ వ్యాయామం తర్వాత ఈ పోస్ట్ కేర్ టిప్ చాలా ముఖ్యం, అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











