పీరియడ్స్ టైంలో తీసుకోవల్సిన ఆరోగ్యకరమైన ఆహారం

By Mallikarjuna

మెనుస్ట్రేషన్ సైకిల్ ప్రతి నెలా వచ్చే బుతుక్రమం లేదా పీరియడ్స్ . ఈ సమయంలో ప్రతి మహిళ చిరాకుగా, అలసినట్లు, మరియు ఖచ్చితంగా విసుగు చెంది ఉంటారు. కొందరిలో డిప్రెషన్ వల్ల కోపం మరియు ఆందోళన మొదలవుతాయి. ఈ పీరియడ్స్ సమయంలో చాలా మంది, లెగ్ క్రాంప్స్, అనారోగ్యం, వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. పీరియడ్స్ మద్యకాలంల. చాలా మంది స్త్రీలు వారి మొదటి రెండు రోజులు వారి రోజువారి కార్యక్రమాలు కూడా చేసుకోలేరు.

పీరియడ్స్ టైమ్ లో తినాల్సిన 10 బెస్ట్ ఫుడ్స్ మీరు తెలుసుకోవాలంటే...క్లిక్ చేయండి

కాబట్టి, అటువంటి సమయంలో హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో సరైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఆ సమయంలో ఆరోగ్యంగా ఎనర్జిటిక్ గా ఉండాలంటే కొన్ని కొన్ని మెనుస్ట్రేషన్ డైట్ తీసుకున్నట్లైత మీ స్టామిని పెంచుకోవచ్చు . దాంతో మీ శరీరంలో అవయవాలన్నీ చురుకుగా పనిచేయడానికి అనుమతిస్తాయి మరియు ఈ సమయంలో సాధారణంగా వచ్చే నొప్పిని తక్కువ చేస్తుంది . పీరియడ్స్ సమయంలో మీకు తగినంత శక్తిని అంధించడానికి కొన్ని ప్రత్యేమైన ఆహారాలున్నాయి . అవి...

పీరియడ్స్ టైమ్ లో తినకూడని ఆహారాలు కూడా ఉన్నాయి మీరు తెలుసుకోవాలంటే...క్లిక్ చేయండి

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కలిగిన పండ్లు, వెజిటేబుల్స్ మరియు ధాన్యాలతో తయారుచేసిన ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే వాటితో పాటు, క్యారెట్స్ ఆప్రికాట్స్, ఆర్గాన్స్, ప్లమ్స్ మొదలగునవి చేర్చుకోవాలి. ఈ సమయంలో స్వీట్స్ తినాలనే కరికను తగ్గిస్తుంది.

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ ను మీ డైట్ లో చేర్చుకోవడానికి ఇది ఒక ఫర్ ఫెక్ట్ టైమ్ . డార్క్ చాక్లెట్ బార్ లో యాంటియాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఇది సెరోటిన్ ఉత్పత్తిని పెంచి మెదుడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాంతో మీ మూడ్ మరింత బెటర్ గా ఉంటుంది. కాబట్టి, మీ మెనుస్ట్రువల్ డైట్ లో డార్క్ చాక్లెట్ తప్పనిసరిగా చేర్చుకోవాలి.

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారాలు:

మీ మెనుస్ట్రులవల్ డైట్ లో విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం . విటమిన్ ఇ మీ పిఎంఎస్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న గుడ్డు మరియు అవొకాడో వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే విటమిన్ బి6కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి మీలో పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్య మెరుగుపరచడానికి అవసరం . విటమిన్ సి కోసం, మీ ఆహారంలో ద్రాక్ష , మరియు నిమ్మ వంటి సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి. విటమిన్ B6 కోసం మీ డైట్ లో బంగాళదుంపను చేర్చుకోండి.

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

కెఫిన్ నివారించండి

మీ మెనుస్ట్రువల్ సమయంలో కెఫిన్ ను తప్పనిసరిగా నివారించాలి. మెనుస్ట్రువల్ సమయంలో కాఫీ తీసుకోవడం వల్ల కడుపులో మరింత యాసిడ్ ను పెంచుతుంది. ఫలితంగా కడుపునొప్పికి కారణం కావచ్చు. మీరు ఇప్పటికీ మీకు కాఫీ తాగాలనిపిస్తుంటే, కాఫీ బదులుగా టీని తీసుకోండి. ఏప్పుడైనా సరే టీ కెఫిన్ కోరికలను తగ్గించడం కోసం ఒక మంచి ప్రత్యామ్నాయం .

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

అత్యవసరం అయ్యే ఫ్యాటీ ఆసిడ్స్:

పీరియడ్స్ సమయంలో ముఖ్యంగా మీరు ఎదుర్కొనే సమస్య స్టొమక్ క్రాంప్స్. ఈ స్టొమక్ క్రాంప్స్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే, అత్యవసరం అయ్యే ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలి. మీ పీరియడ్స్ సమయంలో హెల్తీ ఫుడ్స్ ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారాలను ను తీసుకోవడం వల్ల హార్మోనుల అసమతుల్యతలను కంట్రోల్ చేస్తుంది. ప్యాటీ ఆసిడ్స్ కోసం మీ డైట్ లో ఫ్లాక్ సీడ్స్, గుమ్మడి మరియు సన్ ఫ్లవర్ సీడ్స్ ను చేర్చుకోవచ్చు. వీటిలో లినోలెనిక్ యాసిడ్స్ కలిగి ఉంటుంది, ఇది మీ గర్భాశయ కండరాలు రిలాక్స్ మరియు ఇది మీ తిమ్మిరిల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం:

మీ పీరియడ్స్ సయంలో రక్తాన్ని కోల్పోవడం వల్ల, మీరు మీ సిస్టమ్ లో అది తిరిగి అవసరం. కాబట్టి, ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలు మెనుస్ట్రువల్ సమయంలో చాలా అవసరం అవుతుంది. నిజానికి,ఐరన్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల అనీమియా (రక్తహీనత)నుండి రక్షణ కల్పిస్తుంది మరియు కోల్పోయిన హీమోగ్లీబిన్ ను తయారుచేస్తుంది . ఇంకా ఇది మిమ్మల్ని వీక్ గా లేదా డిప్రెషన్ చెందకుండా చేస్తుంది. ఇది ఒక మంచి యాంటీడిప్రెజెంట్ . ఐరన్ పొందడానికి రెడ్ మీట్, పౌల్ట్రీ, మాంసం, ఎండిన బీన్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను మీ డైట్ లో చేర్చుకోవాలి.

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి: డైట్ టిప్స్

ఈ పోషకాలు సమృద్ధిగా ఉండే తృణధాన్యాలు , తృణధాన్యాలు , పండ్లు మరియు కూరగాయలు మీ డైట్ లో చేర్చండి . సంతులిత ఆహారంను పొందాలి. మీరు మీ ఆహారంలో వీలైనన్ని ద్రవాలు చేర్చుకోవడం మంచిది. పీరియడ్స్ సమయంలో సాధ్యమైనంత వరకూ నీటిని ఎక్కువగా తీసుకోండి . ఒక మంచి మెనుస్ట్రేషన్ డైట్ ఒక మంచి ఆరోగ్యాన్ని అంధిస్తుంది.

Desktop Bottom Promotion