హెల్తీ అండ్ ఎనర్జీ డ్రింక్సే కానీ, బరువు మాత్రం అమాంతం పెరుగిపోతారు...

మీకు తెలుసా మనం రెగ్యులర్ గా తీసుకొనే పానీయల వల్ల మన శరీరంలో అదనపు క్యాలరీలు వచ్చి చేరుతాయని?రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల ద్వారా ఈ విషయం నిర్ధారించబడినది. ప్రొసెస్డ్ ఫ్రూట్ జ్యూస్ లు మరియు ఆహారాలతో పాటు తీసుకొనే సోడా డ్రింక్స్ వల్ల మన శరీరంలోనిక 2500 క్యాలరీలు వచ్చి చేరుతాయని పరిశోధనల ద్వారా వెల్లడించారు.

అన్ని రకాల జంక్ ఫ్రుడ్స్ అండ్ డ్రింక్స్ ద్వారా తీసుకొనే క్యాలరీలన్నీ శరీరంలో చేరి చివరకు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి . అంతే కాదు మీరు అకస్మాత్తుగా బరువు పెరగడం గమనించినట్లైతే అందుకు ఈ పానీయాలే కారనం అని తెలిస్తే ఆవ్చర్యం కలగక మానదు. అందుకు కారణం ఈ డ్రింక్సే అని ఆరోపిస్తున్నారు.

పరిశోధనల ద్వారా , ఫిజ్జీ డ్రింక్స్ మనల్ని మరింత ఊబకాయులుగా మార్చేస్తున్నాయి . అంతే కాదు, వీటితో పాటు మరికొన్ని హెల్త్ డ్రింక్ కాఫీ, పాలు, మరియు బీర్ వంటివి కూడా ఊబకాయులుగా మార్చేస్తున్నాయి. ఎందుకంటే ఫిజ్జీ డ్రింక్స్ తో పోల్చితే హెల్తీ డ్రింక్స్ కూడా మనం రెగ్యులర్ గా తీసుకొనే వీటిలో క్యాలరీలు అధికంగా ఉన్నాయి .

అంతే కాదు ఊబకాయస్తులుగా మారడానికి కారణం అవుతున్న వీటితో పాటు మరికొన్ని పానియాల లిస్ట్ ను కూడా ఈక్రింది లిస్ట్ లో చేర్చడం జరిగింది . ఈ డ్రింక్స్ ను ఇప్పటికిప్పుడు త్రాగడం మానేసి, వాటి స్థానంలో నీరుత్రాగడం ప్రారంభించినట్లైతే హెల్తీగా బరువు తగ్గించుకోవచ్చు . మరియు హెల్తీ బాడీని కలిగి ఉండవచ్చు. శరీరానికి వాటర్ ఒక బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు. వాటర్ శరీరంలో చేరిన టాక్సిన్స్ ను బయటకు నెట్టివేడయంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఫలితంగా మీరు ఫిట్ గా మరియు యాక్టివ్ గా ఫీలవ్వడమే కాక, రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

మరి బరువు పెంచి ఊబకాయస్తులుగా మార్చే డ్రింక్స్ ఏంటో వాటి వివరాలేంటో తెలుసుకుందాం...

మీ బరువును పెంచే పానియాలు:

1. కాఫీ:

1. కాఫీ:

ఆరోజులు గుర్తున్నాయా? కాఫీ బార్లోకో...కాఫీడేలోకో ప్రవేశించగానే అడిగే మొదటి ప్రశ్న కోల్డ్ కాపీ ఉందా?అలా అడగటం వినడానికి హెల్తీగా మరియు ఇంట్రస్టింగ్ గా ఉండవచ్చు. కానీ ఈ బెవరేజ్ లో 900క్యాలరీలు ఉన్నాయి. కోల్డ్ లేదా ఫ్రోజోన్ కాఫీ షుగర్ మరియు క్రీమ్ తో తయారుచేయబడి ఉంటుంది . కాబట్టి ఇది అనారోగ్యకరమైన డ్రింక్ గా భావిస్తున్నారు. అందువల్ల బరువు తగ్గించుకోవాలనుకొనే వారు ఈ పానీయానికి దూరంగా ఉండటమే మంచిది.

2. పాలు:

2. పాలు:

బాడీ ఫ్యాట్ గా మార్చే మరో డ్రింక్ పాలు. ఇవి ఆరోగ్యానికి మంచిదే . అందుకే పోషకాహార నిపుణులు పాలను సెరల్స్, మిల్క్ షేక్స్ గా తీసుకోమని సూచిస్తుంటారు . పాలలో క్యాల్షియం మాత్రమే కాదు అధిక శాతంలో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉన్నాయి. బరువు పెరగడానికి ఇది ఒక్క కారణం చాలు.

3. ప్రొసెస్డ్ డ్రింక్స్:

3. ప్రొసెస్డ్ డ్రింక్స్:

ప్రొసెస్డ్ జ్యూస్ ఏవైనా సరే నేచురల్ డ్రింక్ అని భావిస్తాము. కానీ ఇందులో షుగర్స్ మాత్రం టన్నులో ఉంటుంది. మరియు ఇతర ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ క్యాలరీలను జోడిస్తుంది . ప్రొసెస్డ్ ఫ్రూట్స్ లో 3శాతం మాత్రమే ఫ్రూట్స్ కలిగి ఉంటాయి. అందుకే అవి త్రాగడానికి అనారోగ్యకరమైన డ్రింక్ గా సూచిస్తున్నారు.

4. ఎనర్జీ డ్రింక్స్ :

4. ఎనర్జీ డ్రింక్స్ :

ఎనర్జి డ్రింక్ మరింత బరువు పెరిగేలా చేస్తాయి . ఈ పానీయాలు షుగర్, కెఫిన్ మరియు ఇతర పదార్థాలు చోడించడం వల్ల బరువు తగ్గాలనుకొనేవారికి ఇవి ఏ మాత్రం సహకరించవు. ఇంకా శరీరంలో క్యాన్సర్ సెల్స్ ను అట్రాక్ట్ చేస్తుంది . ఎనర్జీ డ్రింక్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు కూడా కారణం అవుతుంది.

5. బీర్:

5. బీర్:

ఒక బాటిల్ బీర్ 120క్యాలరీలను శరీరానికి చేరవేస్తుంది. బీర్లో కూడా కార్బోహైడ్రేట్స్ తో నిండి ఉంటుంది మరియు ఇందులో న్యూట్రీషియన్స్ తక్కువ. కాబట్టి ఫ్యాట్ గా మారడానికి ఇది కూడా ఒక కారణం అవ్వొచ్చు.

6. సోడా:

6. సోడా:

సోడాను పరిమితికి మించి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇందులో న్యూట్రీషియన్స్ ఉండవు. ఇందులో సోడియం కంటెంట్ మరియు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అధికంగా ఉంటాయి. ఇది వేగంగా బరువు పెరగడానికి కారణం అవుతుంది . దాంతో లావుగా తయారవుతారు. అంతే కాదు దంతాలు పాడవుతాయి. దంతాల మీద ఉండే ఎనామిల్ కరిపోతుంది. దాంతో పాటు దంతాలు కూడా అరుగుతాయి.

7. మిల్క్ షేక్స్ :

7. మిల్క్ షేక్స్ :

మిల్క్ షేక్స్ తీసుకోవడం ఆరోగ్యకరం అని మీరు భావిస్తున్నారా?మిమ్మల్ని ఫ్యాట్ గా మార్చే అత్యంత ప్రథమ పానియం ఇది. షేక్స్ లో వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. ఇవి మనల్ని మరింత నీరసంగా మార్చేస్తాయి. ఇవి కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.

8. స్పోర్ట్స్ డ్రింక్స్:

8. స్పోర్ట్స్ డ్రింక్స్:

స్పోర్ట్స్ లో మరింత బెటర్ గా పెర్ఫామ్ చేయాలంటే స్పోర్ట్స్ డ్రింక్ త్రాగమని ఎంకరేజ్ చేస్తుంటారు . స్పోర్ట్స్ డ్రింక్ లో ఉండే షుగర్ కంటెంట్ మరియు అధిక కార్బోహైడ్రేట్స్ వల్ల కూడా ఫ్యాట్ గా తయారవుతారు. కాబట్టి తక్షణ ఎనర్జీ మరియు స్టామినా పొందడానికి నీరే పరమావధి .

Story first published: Saturday, December 5, 2015, 17:30 [IST]
Desktop Bottom Promotion