Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
బత్తాయి జ్యూస్ తో కొలెస్ట్రాల్ కంట్రోల్.. వేగంగా బరువు తగ్గిస్తుంది
అత్యంత ఆరోగ్యప్రయోజనాలను అంధించే పండ్లలో బత్తాయి కూడా ఒటి. దీన్ని(మోసంబీ) స్వీటీ లైమ్ అంటారు. మోసంబీ లేదా స్వీట్ లైమ్ జ్యూస్ ఇండియాలో హాట్ ఫేవరెట్, ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో వీటికి డిమాండ్ ఎక్కువ. ఇవి చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.
బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. బత్తాయి, ఇందులో విటమిన్ -సి పుష్కలంగా లభిస్తుంది. పీచు పదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, క్యాల్షియం వంటివి దాగివున్నాయి. క్యాలరీలు మరియు ఫ్యాట్ కూడా తక్కువ. కాబట్టి బరువు తగ్గించడంలో నిమ్మ తర్వాత బత్తాయి రసం కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుందని కొంత మంది ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు.
శరీరంలో అధిక క్యాలరీలను తగ్గించుకోవాలనుకునే వారు మోసంబి (బత్తాయి జ్యూస్)రోజులో రెండు సార్లు త్రాగవచ్చు . బరువు తగ్గించడం మాత్రమే కాదు, ఇది డీహైడ్రేషన్ నివారిస్తుంది, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. కామెర్లను అరికడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో అదనపు పౌండ్ల బరువు తగ్గించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ జ్యూస్ కు షుగర్ కాకుండా తేనె జోడించి తీసుకోవడం నేచురల్ గా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరి అదెలాగో చూద్దాం...

1. ఆకలి తగ్గిస్తుంది:
మోసంబి(బత్తాయి)జ్యూస్ లో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల త్వరగా ఆకలి కాకుండా చేస్తుంది. ఆకలి కోరికలు తగ్గిస్తుంది. కాబట్టి, మీరు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు బత్తాయి జ్యూస్ త్రాగడం వల్ల ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గించుకోవచ్చు.

2. క్యాలరీలు తక్కువ:
లెమన్ జ్యూస్ లో లాగా, మోసంబి జ్యూస్ లో చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. మోసంబి జ్యూస్ లో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది:
ఒక కప్పు మోసంబి జ్యూస్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక గ్లాస్ జ్యూస్ త్రాగిన వెంటనే చాలా ఎనర్జిటిక్ గా ఫీలవుతారు . అందువల్ల వర్కౌట్స్ చేయడానికి ముందు ఒక గ్లాసు మోసంబి జ్యూస్ త్రాగడం వల్ల మీకు అలసట అనిపించదు.

4. పోషకాలు అధికంగా ఉన్నాయి:
ఫ్రెష్ మోసంబి జ్యూస్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి . మోసంబి గుజ్జులో కూడా ఎక్కువ పోషకాలున్నాయి. ఈ న్యూట్రీషియన్స్ బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

5. టాక్సిన్స్ నివారిస్తుంది:
మోసంబి జ్యూస్ లోని యాసిడ్స్ వల్ల శరీరంలోని అనవసరమైన వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది . దాంతో జీవక్రియలు మరింత వేగంగా పనిచేస్తాయి. ఫ్యాట్ కరగడానికి సహాయపడుతాయి.

6. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
మోసంబి జ్యూస్ లోని ప్రయోజనాలు మీకు తెలుసా...శరీరంలోని కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది . కాబట్టి, మీరు అనుకొన్న దానికి కంటె ఎక్కువగా త్వరగా బరువు తగ్గించుకోవచ్చు.

7. ఎలా తీసుకోవాలి? :
ఫ్రెష్ బత్తాయి జ్యూస్ కు కొద్దిగా గోరువెచ్చని నీరు మిక్స్ చేసి, తేనె మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం కాలీ పొట్టతో తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
