Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
కేవలం 15 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించే అద్భుత ఆహారాలు..!!
బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా? బెల్లీ ఫ్యాట్ ఉంటే ఇబ్బంది మాత్రమే కాదు చూడటానికి అందవిహీనంగా కనబడుతారు. ఆకర్షణీయంగా ఉండదు . పాట్ బల్లీకి వివిధ రకాల కారణాలున్నాయి . అయితే బెల్లీ ఫాట్ కు కామన్ రీజన్ ఏంటంటే పొట్ట ఉదరంలో గ్యాస్ చేరడం. పొట్టలో గ్యాస్ చేయడం వల్ల కడుపుబ్బరంగాను, పొట్ట ముందుకు పొడుచుకొచ్చి, ఉబ్బుగా(వాపుతో) కనబడుతుంది.
పొట్టలో గ్యాస్ చేరడం వల్ల పొట్ట ఉబ్బరంగా, ఉండటం మాత్రమే అసౌకర్యంగా కూడా ఉంటుంది. గ్యాస్ వల్ల పొట్ట ఉబ్బినట్లైతే మీకు సులభంగా అర్ధమువుతుంది. పొట్ట ఉబ్బడానికి ఫ్యాట్ కారణం కాదు, గ్యాస్ వల్లే పొట్ట ఉబ్బిందని గ్రహిస్తారు .
ఇటువంటి బెల్లీ(పొట్ట) సమస్యను కేవలం కొద్దిరోజుల్లోనే తగ్గించుకోవచ్చు. ఇలా గ్యాస్ వల్ల ఏర్పడ్డ పొట్టను కేవలం 15 రోజుల్లో తగ్గించుకుని మీకు నచ్చిన డ్రెస్సులో మీరు అందంగా కనబడవచ్చు. బాడీ సన్నగా ఉండి పొట్ట మాత్రమే ఉబ్బెత్తుగా కనబడుతున్నదని మూలపడేసిన డ్రెస్సును ఇప్పుడు వేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది.
గ్యాస్ కారణంగా ఏర్పడ్డ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి కొన్ని ఆహారాలు గొప్పగా సహాయపడుతాయి. ఇవి పొట్ట ఉదరంలో గ్యాస్ నివారిస్తాయి. పొట్ట ఉబ్బరంను తగ్గిస్తాయి. బెల్లీ ఫ్యాట్ కరిగించి, టమ్మీని ఫ్లాట్ చేసి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ...

1. బొప్పాయి:
బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ డైజషన్ కు సహాయపడుతుంది. మనం తీసుకున్న ఆహారం ఎప్పటికప్పుడు జీర్ణమతుంటే..గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. పచ్చిబొప్పాయిని తీసుకోవడం వల్ల ఇందులో పెప్పైన్ అధికంగా ఉంటుంది. టమ్మీ ఫ్యాట్ కరిగించడంలో ఇది బెస్ట్ ఫుడ్ .

2. పైనాపిల్:
పైనాపిల్లో బ్రొమైలిన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్ ను నివారిస్తుంది. టమ్మీ ఫ్లాట్ గా మరియు స్లిమ్ గా మార్చుతుంది. పైనాపిల్ టమ్మీని ఫ్లాట్ గా మార్చడంలో బెస్ట్ నేచురల్ ఫుడ్.

3. అలొవకాడో:
అవొకాడోలో లైపేజ్ అనే డైజెస్టివ్ ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఎంజైమ్స్ ఫ్యాట్ ను బ్రేక్ చేస్తుంది. ఫ్రేగుల్లో ఆహారాన్ని ముందుకు నెట్టుతూ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో పొట్టలో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది. పైనాపిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బెల్లీలో ఉండే వాటర్ ను తగ్గిస్తుంది.

4. అల్లం:
అల్లం కార్మినేటివ్ గా పనిచేస్తుంది, అంటే ఇది పొట్ట ఉదరంలో గ్యాస్ ను తొలగిస్తుంది. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. రోజూ అల్లం టీని తాగడం వల్ల కడుపుబ్బరం తగ్గించుకోవచ్చు. రోజుకు రెండు సార్లు అల్లం టీ తాగడం వల్ల టమ్మీ ఫ్లాట్ గా మార్చడానికి ఇది బెస్ట్ హోం రెమెడీ.

5. పెరుగులో మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్ )ఉంటుంది.
ఇది జీర్ణశక్తిని పెంచుతుంది . ఇది విటమిన్స్ మరియు మినిరల్స్ ను గ్రహిస్తుంది. రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల 80శాతం గ్యాస్ మరియు బ్లోటింగ్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుందని నిరూపించబడినది.

6. అరటిపండ్లు:
అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది పొట్ట ఉబ్బరం తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . కాబట్టి రోజూ తప్పనిసరిగా బాగా పండిన అరటిపండును ఒకటి తీసుకోవాలి.

7. లెమన్ జ్యూస్ :
లైమ్ వాటర్ జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్దకం నివారిస్తుంది శరీరంలో ఎక్సెస్ వాటర్ తొలగిస్తుంది, పొట్టలోని ఎక్సెస్ వాటర్ ను కూడా తగ్గిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ కు ముందు లెమన్ జ్యూస్ తీసుకోవడం మంచిది . రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట వద్ద వాపు మరియు ఉబ్బరంను తగ్గిస్తుంది .

8. వాటర్ మెలోన్:
వాటర్ మెలోన్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల యూరిన్ ఫ్రీక్వెన్స్ మరియు వాల్యూమ్ ను పెంచుతుంది . వాష్ రూమ్ కు ఫ్రీక్వెంట్ గా వెళుతుంటే పొట్ట ఉబ్బరం ఉండదు. మరియు శరీరంలో ఎక్సెస్ వాటర్ ను తొలగిస్తుంది .స్టొమక్ ఫ్లాట్ గా మార్చడంలో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది.

9. ఆస్పరాగస్:
టమ్మీ ఫ్లాట్ గా మార్చడంలో మరో నేచురల్ ఫుడ్. ఇది జీర్ణశక్తిని పెంచడంలో మరియు శరీరంలో ఎక్సెస్ వాటర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్టఉబ్బరం తగ్గిస్తుంది. దాంతో పొట్ట ఫ్లాట్ గా మారుతుంది. ఆస్పరాగస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల టమ్మీ ఫాట్ సులభంగా కరిగిపోతుంది.

10. హెర్బల్ టీలు:
చమోమెలీ మరియు పెప్పర్ మింట్ టీ కడుపుబ్బరం నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. మరియు జీర్ణశక్తిని పెంచి త్వరగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది . భోజనం చేసిన తర్వాత ఒక కప్పు హెర్బల్ టీ తాగడం వల్ల హెవీగా అనిపించదు. త్వరగా పొట్ట తగ్గించుకోవడానికి ఇది ఒక గ్రేట్ రెమెడీ.

11. ఆపిల్ సైడర్ వెనిగర్ :
కడుపుబ్బరం మరియు గ్యాస్ నివారించడంలో ఆపిల్సైడర్ వెనిగర్ సహాయపడుతుంది. ఇది టమ్మీ సైజ్ తగ్గిస్తుంది. పొట్టలోని గ్యాస్ తొలగిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా రోజూ తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. భోజనానికి ముందు తాగడం వల్ల కడుపుబ్బరం మరియు గ్యాస్ నివారించబడతుంది.



Click it and Unblock the Notifications
