ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

బరువు తగ్గించుకోవాలంటే మొదట గుర్తొచ్చేది డైట్ . డైలీ డైట్ లో ఫ్యాటీఫుడ్స్ ఉండటం, ఈ ఫుడ్స్ లో క్యాలరీలు అధికంగా ఉండటం మరియు కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఎక్స్ ట్రా పౌండ్ బరువు తగ్గడానికి ఎలాంటి చాన్సెస్ ఉండవు . వ్యాయామం ఎంత చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు . హెల్తీగా మరియు ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే మొదట డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి.

పోషకాహార నిపుణుల సలహా మేరకు మంచి బ్యాలెన్సింగ్ డైట్ ను అనుసరిస్తున్నట్లైతే శరీరం మంచి ఎనర్జీని పొంది శరీరంలో ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతాయి . హై ప్రోటీన్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక ఫ్యాట్ ను కరిగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. హై ప్రోటీన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్ గా ఫీలవుతారు ఎలాంటి అలసట మరియు ఉండదు.

అదే విధంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా శరీరానికి అదే ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. కాబట్టి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను కూడా డైలీ డైట్ లో చేర్చుకోవాలి . ఇలాంటి హైప్రోటీన్, అండ్ ఫైబర్ బ్రిలియంట్ ఫుడ్ వల్ల ఫ్రెండ్లీగా బరువు తగ్గించుకోవచ్చు.

ఈ హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల శరీరం తనంతట తాను ఫ్యాట్ బర్న్ చేసుకోగలుగుతుంది . అంతే కాదు క్రమంగా శరీరకంగా ఫిట్ గా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి . మరి మన వంటగదిలోని వెయిట్ లాస్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం...

ఫైబర్ ఫుడ్స్:

ఫైబర్ ఫుడ్స్:

రెగ్యులర్ డైట్ లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను జోడించాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, మరియు గోధుమలు మరియు మరికొన్ని ఇండియన్ ఫుడ్స్ ను చేర్చాలి . ఈ ఫుడ్స్ ఫ్రెండ్లీగా బరువు తగ్గించడం మాత్రమే కాదు, పొట్ట నింపుతుంది మరియు వ్యాధినిరోధకత పెంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది.

బాదం:

బాదం:

గుప్పెడు బాదం పప్పులు తినడం వల్ల శరీరానికి అవసరం అయ్యే విటమిన్ ఇని అందిస్తుంది. బరువు తగ్గించుకోవాలని చూసేవారు ప్రోటీన్ ఫుడ్స్ అధికంగా అవసరం అవుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన 5 బాదం పప్పులను తినడం మంచిది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ ఒక హేర్బల్ బెవరేజ్. విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ కు ఒక పవర్ హౌస్ వంటిది. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాపడుతుంది. కాబట్టి రెండు నుండి 3 కప్పులు గ్రీన్ టీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, మీ ఎనర్జీలో మార్పులను మరియు బరువు తగ్గించుకోవడంలో మార్పులను గమనించండి.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ లో ప్రోటీనులు అధికంగా ఉన్నాయి . ఎగ్ వైట్ క్యాల్షియం ను అందిస్తుంది. ఇది బోన్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది. మరియు బోన్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది . గుడ్లలో ఉండే గ్లూకగాన్ హార్మోన్ ఫాట్ బర్నింగ్ కు సమాయపడుతుంది . కాబట్టి ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎనర్జీని అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తుంది.

పెరుగు:

పెరుగు:

గ్రీక్ యోగ్రట్ బరువు తగ్గించుకోవడంలో ఒక బెస్ట్ ఫుడ్ . వెయిట్ లాస్ ఫ్రెండ్లీ ఫుడ్. ఇందులో ప్రోటీనులు మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది . ఇంకా పొటాషియం, జింక్ మరియు విటమిన్ బి6 మరియు బి12 అధికంగా ఉండటం వల్ల టమ్మీ శాటిస్ ఫై మరియు ఆకలికోరికలను తగ్గిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిల్లో క్రొవ్వు కరిగించే గుణాలు అలిసిన్ పుష్కలంగా ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. కాబట్టి పురుషులు ఈ ఇండియన్ స్పైసీ వెల్లుల్లిని రెగ్యులర్ గా తింటే శరీర బరువును తగ్గించుకొని, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . మరియు అందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువ. దాంతో మీరు స్వీట్ తినాలనే కోరికలను తగ్గిస్తాయి(వీటని అలాగే నేరుగా లేదా జ్యూసులు లేదా సలాడ్స్ )రూపంలో తీసుకోవచ్చు. ఇది అదనపు బరువు పెరగకుండా సహాయపడుతుంది.

సాల్మన్ :

సాల్మన్ :

సాల్మన్ ప్రోటీనులు అధికంగా ఉంటాయి . ఇది మిమ్మల్ని పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది కానీ కొద్దిగా కూడా బరువు పెరగకుండా చేస్తుంది. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇన్సులిన్ సెన్సివిటిని మరియు హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది

హాట్ చిల్ పెప్పర్స్

హాట్ చిల్ పెప్పర్స్

భోజనానికి అరగంట ముందు హాట్ చిల్ పెప్పర్స్ ను తీసుకోవడం వల్ల మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం యొక్క మోతాదు కంటే 10శాతం తక్కువగా తీసుకోగలుగుతారు. బరువు తగ్గించడంలో ఇది ఒక గ్రేట్ ఫుడ్ గా భావిస్తారు.

చియా సీడ్స్ :

చియా సీడ్స్ :

ఫ్లాక్ సీడ్స్ వలే చియా సీడ్స్ కూడా మరో చీప్ వెయిట్ లాస్ ఫుడ్ . ఎందుకంటే చియా సీడ్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఆకలిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి. .

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది . హెల్తీ డైజెషన్ వల్ల క్రమంగా బరువు తగ్గించుకోవచ్చు. నిమ్మరసం అందించే న్యూట్రీషీయన్స్ ఫ్యాట్ బర్న్ కు సహాయపడుతుంది, శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది. మెటబాలిజంను ఆలస్యం చేస్తుంది. *3టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో ఒక చెంచాతేనె, అరటీస్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేయాలి. ఈ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగాలి. క్రమంగా 3 నెలలు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు:

కరివేపాకు:

ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే 10 కరివేపాకు ఆకులను తినడం వల్ల ఒబేసిటి దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్ కు కారణమయ్యే ఊబకాయంను తగ్గించడంలో , అధిక బరువు తగ్గించడంలో కరివేపాకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . రెగ్యులర్ గా మూడు నెలలపాటు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

టమోటోలు:

టమోటోలు:

ప్రతి రోజూ ఉదయం పరగడుపు రెండు మూడు టమోటోలు తినాలి. విత్తనాలు, తొక్కతో పాటు అలాగే తినాలి. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. టమోటోలో ఉండే కొన్ని కాంపౌడ్స్ ఆకలిని తగ్గించే హార్మోనులను ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆకలి తగ్గించే ఆహారాల మీద కోరిక కలగకుండా ఎక్కువ ఆహారాలు తీసుకోకుండా చేస్తుంది.

తేనె దాల్చిన చెక్క:

తేనె దాల్చిన చెక్క:

ఈ రెండింటి కాబినేషన్ డ్రింక్ బరువు తగ్గించడంలో, కొవ్వు కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. ఒక కప్పు హాట్ వాటర్ లో తేనె , దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి రోజూ ఉదయం పరగడపున మరియు రాత్రి నిద్రించే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కాకరకాయ

కాకరకాయ

ఈ చీప్ వెయిట్ లాస్ ఫుడ్ వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది . ఇదిలో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

Story first published: Saturday, August 20, 2016, 15:53 [IST]
Desktop Bottom Promotion